AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

నాకు అలవాటు ఉంది.. కానీ ఇంట్లోనే ఎంజాయ్ చేస్తా.! షాకింగ్ విషయం చెప్పిన దివి

బిగ్ బాస్ గేమ్ షో ద్వారా పాపులర్ అయినా ముద్దుగుమ్మల్లో దివి ఒకరు. ఈ అందాల భామ పలు సినిమాల్లో చిన్న చిన్న పాత్రల్లో నటించింది. తన అందంతో ప్రేక్షకులను ఆకట్టుకుంది దివి. ఆ క్రేజ్ తోనే ఈ చిన్నది బిగ్ బాస్ షోలో ఛాన్స్ అందుకుంది.

నాకు అలవాటు ఉంది.. కానీ ఇంట్లోనే ఎంజాయ్ చేస్తా.!  షాకింగ్ విషయం చెప్పిన దివి
Divi
Rajeev Rayala
|

Updated on: Feb 05, 2026 | 6:23 PM

Share

సినిమాల్లో చిన్న చిన్న పాత్రలు చేస్తూ ప్రేక్షకులను ఆకట్టుకొని ఆతర్వాత క్రేజ్ తెచ్చుకుంది అందాల భామ దివి వాద్త్యా. సినిమాల్లో చిన్న పాత్రలు చేసిన ఈ అమ్మడు ఆతర్వాత బిగ్ బాస్ గేమ్ షోలో అవకాశం అందుకుంది. బిగ్ బాస్ గేమ్ షోలో తన ఆటతో ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంది. ఈముద్దుగుమ్మ తన అందంతోనూ కవ్వించింది. బిగ్ బాస్ నుంచి బయటకు వచ్చిన తర్వాత పెద్దగా ఆఫర్స్ అందుకోలేకపోయింది. ఇప్పుడిప్పుడే ఈ చిన్నది ఆఫర్స్ అందుకుంటుంది. ప్రస్తుతం నవీన్ చంద్ర హీరోగా నటిస్తున్న హనీ సినిమాలో నటిస్తుంది. ఈ సినిమా త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రానుంది. కాగా దివి రీసెంట్ గా ఓ ఇంటర్వ్యూలో ఆసక్తికర విషయాలు పంచుకున్నారు.

దివి ఓ పాడ్‌కాస్ట్‌లో అనేక ఆసక్తికరమైన అంశాలపై తన అభిప్రాయాలను పంచుకుంది. అలాగే తన వ్యక్తిగత అలవాట్లపై దివి మాట్లాడింది. అబ్బాయిలు, అమ్మాయిల డ్రింకింగ్, స్మోకింగ్ అలవాట్ల గురించి మాట్లాడుతూ.. ఈ విషయంలో లింగ సమానత్వాన్ని దివి వ్యతిరేకించింది. సమానత్వం మంచి విషయాలలో.. ముఖ్యంగా కెరీర్, ఉన్నత విషయాలలో.. ఉండాలని.. డ్రింకింగ్, స్మోకింగ్ వంటి ఆరోగ్యానికి హానికరం కాని విషయాలలో కాదని చెప్పుకొచ్చింది. ధూమపానం వల్ల ఆరోగ్యం, ముఖ్యంగా చర్మం త్వరగా పాడైపోతుందని… స్మోక్ చేసే అమ్మాయిలు 25 ఏళ్ల వయసులో 35 ఏళ్లలా కనిపిస్తారని, చర్మంపై ప్రేమ ఉంటే ధూమపానానికి దూరంగా ఉండాలని దివి సలహా ఇచ్చింది.

తన వ్యక్తిగత అలవాట్ల గురించి అడగగా.., తాను అప్పుడప్పుడు స్నేహితులతో కలిసి డ్రింక్ చేస్తానని తెలిపింది. డాన్ హులియో టెకీలా తనకిష్టమైన బ్రాండ్ అని తెలిపింది దివి. డ్రింక్ చేసిన తర్వాత తాను చాలా చిల్‌గా, హైపర్‌గా ఉంటానని, తన స్నేహితులు తనతో పార్టీలను ఎంజాయ్ చేస్తానని తెలిపింది. పబ్స్‌లో అంతగా ఎంజాయ్ చేయనని, అక్కడ కేవలం వాటర్ మాత్రమే తాగుతానని.. ఇంట్లోనే ఎక్కువగా పార్టీలు చేసుకుంటా అని తెలిపింది. తన పుట్టినరోజులు, న్యూ ఇయర్‌కు కచ్చితంగా ఇంట్లోనే హౌస్ పార్టీలు ఉంటాయని, అక్కడ తాను మనసు విప్పి డ్యాన్స్ చేస్తానని చెప్పుకొచ్చింది. ఈ పార్టీలలో సినిమా రంగానికి చెందిన వారెవరూ ఉండరని, సినిమాకు సంబంధించిన టాపిక్స్ కూడా మాట్లాడుకోము అని దివి తెలిపింది. పార్టీకి వచ్చిన అందరినీ బాగా చూసుకోవడం, వారిని సంతోషంగా ఉంచడమే తన లక్ష్యమని, డ్రింక్ చేసిన తర్వాత తనకు ఎలాంటి నెగటివ్ ఆలోచనలు రావని దివి చెప్పుకొచ్చింది.

View this post on Instagram

A post shared by Divi (@actordivi)

మరిన్ని ఎంటర్టైన్మెంట్ వార్తల కోసం ఇక్కడ చూడండి..

నాకు అలవాటు ఉంది.. కానీ ఇంట్లోనే ఎంజాయ్ చేస్తా.!
నాకు అలవాటు ఉంది.. కానీ ఇంట్లోనే ఎంజాయ్ చేస్తా.!
'మన శంకరవరప్రసాద్ గారు' కి 25 రోజుల్లో ఎన్ని కోట్లు వచ్చాయంటే?
'మన శంకరవరప్రసాద్ గారు' కి 25 రోజుల్లో ఎన్ని కోట్లు వచ్చాయంటే?
భర్తగా, తండ్రిగా ఓడిపోయా.. కూతురు జాగ్రత్త..! కన్నీళ్లు పెట్టిస్త
భర్తగా, తండ్రిగా ఓడిపోయా.. కూతురు జాగ్రత్త..! కన్నీళ్లు పెట్టిస్త
నెలసరి నొప్పికి ఎవ్వరూ చెప్పని చిట్కా.. పైనాపిల్‌తో దీన్ని కలపండి
నెలసరి నొప్పికి ఎవ్వరూ చెప్పని చిట్కా.. పైనాపిల్‌తో దీన్ని కలపండి
వాతదోష నివారణకు బాబా రాందేవ్‌ ఇంటి చిట్కాలు విన్నారా..?
వాతదోష నివారణకు బాబా రాందేవ్‌ ఇంటి చిట్కాలు విన్నారా..?
మల్లీశ్వరి సినిమాలో హీరోయిన్‌గా ఆమెను అనుకున్నారట..
మల్లీశ్వరి సినిమాలో హీరోయిన్‌గా ఆమెను అనుకున్నారట..
25 ఏళ్ల క్రితం ప్రకాశ్ రాజ్ ఇంటి మందు బాటిళ్లు ఎత్తుకెళ్లారు..
25 ఏళ్ల క్రితం ప్రకాశ్ రాజ్ ఇంటి మందు బాటిళ్లు ఎత్తుకెళ్లారు..
మున్సిపల్ పీఠాన్ని బీజేపీకి ఇవ్వండి.. అభివృద్ధికి బాటలు వేయండి
మున్సిపల్ పీఠాన్ని బీజేపీకి ఇవ్వండి.. అభివృద్ధికి బాటలు వేయండి
పాక్ ప్లాన్ రివర్స్..సూర్య ఇచ్చిన దెబ్బకు పీసీబీ షాక్
పాక్ ప్లాన్ రివర్స్..సూర్య ఇచ్చిన దెబ్బకు పీసీబీ షాక్
రష్యా నుంచి భారత్ చమురు కొనుగోలు ఆపేస్తుందా?
రష్యా నుంచి భారత్ చమురు కొనుగోలు ఆపేస్తుందా?