మరోసారి అల్లు అర్జున సరసన శ్రీవల్లీ.. డైరెక్టర్ ఎవరంటే..
Rajitha Chanti
Pic credit - Instagram
05 February 2026
ప్రస్తుతం చేతినిండా సినిమాలతో ఫుల్ బిజీగా ఉంది హీరోయిన్ రష్మిక మందన్నా. తెలుగుతోపాటు, హిందీలోనూ బ్యాక్ టూ బ్యాక్ చిత్రాలతో అలరిస్తుంది ఈ ముద్దుగుమ్మ.
ఇటీవలే గర్ల్ ఫ్రెండ్, కుబేర, థామ వంటి చిత్రాలతో వరుస హిట్స్ అందుకుంది. ఇప్పుడు వినిపిస్తున్న సమాచారం ప్రకారం మరోసారి బన్నీ సరసన కనిపించనున్నట్లు టాక్.
ప్రస్తుతం అల్లు అర్జున్ డైరెక్టర్ అట్లీ దర్శకత్వంలో ఓ ప్రాజెక్ట్ చేస్తున్న సంగతి తెలిసిందే. వీరిద్దరి కాంబోలో రాబోయే సినిమాపై ఇప్పటికే భారీ అంచనాలు నెలకొన్నాయి.
ఇందులో బాలీవుడ్ బ్యూటీ దీపికా పదుకొణె, మృణాల్ ఠాకూర్ హీరోయిన్లుగా నటిస్తున్నారు. వీరితోపాటు ఈ మూవీలో హీరోయిన్ రష్మిక మందన్నా కనిపించనుందట.
అయితే తాజాగా రష్మిక ఈ మూవీ షూటింగ్ లో జాయిన్ అయినట్లు ప్రచారం జరుగుతుంది. ప్రస్తుతం ఈ మూవీ షూటింగ్ లో జరుగుతుందని ఆంగ్ల మీడియా పేర్కొంది.
నెల రోజుల పాటు ప్లాన్ చేసిన ఈ షెడ్యూల్‌లో కొన్ని కీలకమైన యాక్షన్ సీన్స్,అలాగే ఎమోషనల్ సన్నివేశాలను చిత్రీకరించనున్నారని.. ఇందులో రష్మిక పై షూట్ ఉంటుందట.
దీంతో ఇప్పుడు మరోసారి పుష్ప కాంబో రిపీట్ కాబోతుండడంపై మరింత ఆసక్తి ఏర్పడింది. ఈ చిత్రాన్ని భారీ బడ్జెట్ తో పాన్ ఇండియా లెవల్లో రూపొందిస్తున్నారట.
ప్రస్తుతం చేతినిండా సినిమాలతో బిజీగా ఉన్న రష్మిక ఇటు సోషల్ మీడియాలోనూ యాక్టివ్ గా ఉంటుంది. నిత్యం గ్లామరస్ ఫోటోషూట్స్ చేస్తూ ఆకట్టుకుంటుంది.