AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

విదేశాల నుంచి భారత్‌కు వచ్చే ప్రయాణికులకు కొత్త బ్యాగేజ్ రూల్స్

విదేశాల నుంచి భారత్‌కు వచ్చే ప్రయాణికులకు కొత్త బ్యాగేజ్ రూల్స్

Phani CH
|

Updated on: Feb 05, 2026 | 7:26 PM

Share

ఫిబ్రవరి 3, 2026 నుండి భారత్‌కు వచ్చే అంతర్జాతీయ ప్రయాణికులకు కొత్త బ్యాగేజ్ రూల్స్ అమలవుతాయి. బంగారం ఆభరణాలకు డ్యూటీ-ఫ్రీ పరిమితులు (మహిళలకు 4 తులాల, పురుషులకు 2 తులాల వరకు) మారాయి. సాధారణ వస్తువుల డ్యూటీ-ఫ్రీ పరిమితి ₹75,000కి పెరిగింది. 18 ఏళ్లు పైబడిన ప్రతి ప్రయాణికుడు ఒక ల్యాప్‌టాప్‌ను డ్యూటీ లేకుండా తీసుకురావచ్చు. కరెన్సీ నిబంధనలు యథాతథంగా ఉంటాయి.

ఫిబ్రవరి 3, 2026 నుంచి విదేశాల నుంచి భారత్‌కు వచ్చే ప్రయాణికులకు కొత్త బ్యాగేజ్ రూల్స్ అమల్లోకి వచ్చాయి. 2016లో అమలులో ఉన్న పాత నిబంధనలను పూర్తిగా రద్దు చేస్తూ, కేంద్ర ప్రభుత్వం కొత్త పరిమితులు, స్పష్టమైన నిర్వచనాలతో ఈ రూల్స్‌ను తీసుకొచ్చింది. బంగారం, సాధారణ వస్తువులు, ల్యాప్‌టాప్‌లు, విదేశీ పర్యాటకులకు అనుమతించే వస్తువుల విషయంలో కీలకమైన మార్పులతో కొత్త రూల్స్ ఇవాళ్టి నుంచే అమల్లోకి వచ్చాయి. కొత్త రూల్స్‌ ప్రకారం ఏడాదికి పైగా విదేశాల్లో ఉన్న మహిళా ప్రయాణికులు నాలుగు తులాల వరకు, పురుషులు రెండు తులాల వరకు గోల్డ్ జువెలరీని ఎటువంటి పన్ను లేకుండా తీసుకురావచ్చు. అయితే ఇది కేవలం ఆభరణాలకు మాత్రమే వర్తిస్తుంది. బంగారు బిస్కెట్లు, నాణేలు లేదా అమ్మకానికి ఉద్దేశించిన గోల్డ్‌కు ఈ మినహాయింపు వర్తించదు. ఇక సాధారణ వస్తువుల విషయంలో కూడా కొత్త మార్పు తీసుకొచ్చారు. ఇప్పటివరకు విదేశాల నుంచి తీసుకువచ్చే వస్తువులకు డ్యూటీ ఫ్రీ లిమిట్ రూ.50వేలుగా ఉండేది. ఇప్పుడు దీన్ని రూ.75లకు పెంచారు. ఇది దుస్తులు, గ్యాడ్జెట్లు, గిఫ్ట్ ఐటమ్స్‌కు వర్తిస్తుంది. అలాగే కొత్త రూల్స్ ప్రకారం, 18ఏళ్లు నిండిన ప్రతి ప్రయాణికుడు ఒక ల్యాప్‌టాప్‌ను డ్యూటీ ఫ్రీగా తెచ్చుకోవడానికి కూడా పర్మిషన్ ఇచ్చారు. విదేశీ పర్యాటకులు వారి వ్యక్తిగత అవసరాలకు సంబంధించి రూ.25వేల వరకు విలువ చేసే వస్తువులకు మాత్రమే అనుమతి ఇచ్చింది ప్రభుత్వం. ఇక ప్రభుత్వం బంగారం, వెండి దిగుమతి సుంకాలను యథాతథంగా కొనసాగించింది. ఐతే బ్యాగేజీ రూల్స్ మారినా, కరెన్సీ నిబంధనల్లో ఎలాంటి మార్పులు లేవు. విదేశీ కరెన్సీ, నగదు తీసుకువచ్చే విషయంలో ఇప్పటివరకు అమలులో ఉన్న FEMA రూల్సే కొనసాగుతాయి.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

పులి సంచారంతో వణుకుతున్న తూర్పుగోదావరి

మద్యం మత్తులో ఓవరాక్షన్‌ చేసిన కానిస్టేబుల్‌కి తగిన శాస్తి

పుణ్య దంపతులు.. మరణంలోనూ తోడుగా..

గోల్డ్ బాండ్ ఇన్వెస్టర్లకు షాక్.. ఏప్రిల్ 1 నుంచి మారనున్న రూల్స్ !!

అది పులి కాదురా బాబూ.. పిల్లి రా అయ్యా..