జాన్వీ కపూర్ అందాల ఫిట్నెస్, బ్యూటీ సీక్రెట్స్ ఇవే.. ఏం చేస్తుందంటే..

Rajitha Chanti

Pic credit - Instagram

05 February 2026

బాలీవుడ్ బ్యూటీ జాన్వీ కపూర్ ప్రస్తుతం చేతినిండా సినిమాలతో ఫుల్ బిజీగా ఉంది. దేవర సినిమా తర్వాత ఇప్పుడు పెద్ది చిత్రంలో నటిస్తుంది.

హిందీతోపాటు తెలుగులోనూ వరుస ఆఫర్స్ అందుకుంటుంది. ప్రస్తుతం జాన్వీ కపూర్ వయసు 28 సంవత్సరాలు. ఆమె బ్యూటీ సీక్రెట్స్ ఇవే.

జాన్వీ ప్రతి రోజూ నాలుగు సార్లు చల్లని నీటితో ముఖాన్ని వాష్ చేసుకుంటుందట. అలాగే అప్పుడప్పుడు ముఖానికి ఆవిరి పడుతుందట ఈ బ్యూటీ.

అంతేకాకుండా వారానికి రెండుసార్లు ఫ్రూట్ మాస్కులు ట్రై చేయడమే కాకుండా ఇంట్లో ఉండే పదార్థాలతో హోంమేడ్ ఫేస్ మాస్క్ రెడీ చేస్తుందట.

ముఖంపై పేరుకుపోయే టాన్ తొలగించడానికి నారింజను ఉపయోగిస్తుందట. ఆ రసాన్ని ముఖంపై అప్లై చేయడమే కాకుండా ప్యాక్ లా వాడుతుంది.

ఐస్ క్యూబ్స్ తో ముఖానికి మసాజ్ చేస్తుందట. బాదం నూనెను ముఖానికి రెగ్యులర్ గా అప్లై చేస్తుందట. ఇలా చేయడం వల్ల ఫేస్ హైడ్రేట్ గా ఉంటుంది.

ఇక ఫిట్నెస్ విషయంలో అస్సలు రాజీ పడదు. ప్రతి రోజూ కనీసం గంటపాటు శరీరానికి అవసరమైన వర్కవుట్స్, బ్యాలెన్స్ వ్యాయమాలు చేస్తుందట.

రన్నింగ్, స్విమ్మింగ్, కార్డియో ఎక్కువగా చేస్తుంది. యోగా, మెడిటేషన్​తో పాటు బాడీ ఫ్లేక్సిబులిటీ కోసం రోజూ డ్యాన్స్ కూడా చేస్తానని అంటుంది జాన్వీ.