AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

మల్లీశ్వరి సినిమాలో హీరోయిన్‌గా ఆమెను అనుకున్నారట.. కానీ కత్రినా ఛాన్స్ కొట్టేసింది

విక్టరీ వెంకటేశ్ నటించిన సూపర్ హిట్ చిత్రాల్లో మల్లీశ్వరి ఒకటి. డైరెక్టర్ కె. విజయ్ భాస్కర్ తెరకెక్కించిన ఈ సినిమా అప్పట్లో భారీ విజయాన్ని అందుకుంది. ఈ మూవీ వస్తే చాలు ఇప్పటికీ టీవీలకు అతుక్కుపోతుంటారు అడియన్స్. చిన్నా, పెద్ద అనే తేడా లేకుండా ఈ సినిమాకు సెపరేట్ ఫ్యాన్ బేస్ ఉంటుంది

మల్లీశ్వరి సినిమాలో హీరోయిన్‌గా ఆమెను అనుకున్నారట.. కానీ కత్రినా ఛాన్స్ కొట్టేసింది
Malliswari Movie
Rajeev Rayala
|

Updated on: Feb 05, 2026 | 5:57 PM

Share

సూపర్ హిట్ సినిమాలు తెరకెక్కించి దర్శకుడిగా తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు స్టార్ డైరెక్టర్ విజయ్ భాస్కర్. నువ్వు నాకు నచ్చవ్, మల్లీశ్వరి, మన్మధుడు ఇలా ఎన్నో సూపర్ హిట్ సినిమాలు అందించి ప్రేక్షకులను అలరించారు దర్శకుడు విజయ్ భాస్కర్. ఇటీవలే ఆయన తన కుమారుడితో ఉషా పరిణయం అనే సినిమా చేశారు. ఈ సినిమా అంతగా ప్రేక్షకులను ఆకట్టుకోలేకపోయింది. దర్శకుడు విజయ భాస్కర్ తాజాగా ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ పలు ఆసక్తికర విషయాలను పంచుకుంది. అలాగే ఆయన మల్లీశ్వరి సినిమా గురించి ఆసక్తికర విషయాలను పంచుకున్నారు. మల్లీశ్వరి చిత్రం కోసం నటి కత్రినా కైఫ్‌ను ఎంపిక చేయడం గురించి.. అలాగే ఈమెను సెలక్ట్ చేసే సమయంలో ఎదుర్కొన్న సవాళ్ల గురించి తెలిపారు విజయ్ భాస్కర్.

కత్రినా కైఫ్ కు నటన రాదని కొందరు భావించినప్పటికీ, ఆమె చాలా కష్టపడే నటి అని విజయ భాస్కర్ అన్నారు. తనకు తెలియదని ఒప్పుకునే జ్ఞానం కత్రినాకు ఉందని ఆయన అన్నారు. కత్రినాకు తెలుగు వాతావరణం, బాడీ లాంగ్వేజ్‌పై అవగాహన లేదని, రాకుమారి రాయల్‌గా, ప్రేమగా ఉండాలి అని ఆమెకు నేర్పాల్సి వచ్చిందని భాస్కర్ పేర్కొన్నారు. మల్లీశ్వరిలో కత్రినా కైఫ్‌ను ఎంపిక చేయడం తన వ్యక్తిగత నిర్ణయం అని, దానివల్ల నిర్మాత దిల్ రాజుకు చాలా కష్టమైందని ఆయన తెలిపారు. ఒక యాడ్‌లో కత్రినాను చూసి, కథ చెప్పి ఒప్పించిన తర్వాత ఆమె హైదరాబాద్ రాలేదని, అడ్వాన్సులు కూడా తీసుకోవడానికి నిరాకరించిందని భాస్కర్ గుర్తు చేసుకున్నారు. అప్పుడు సోనాలి బింద్రే లాంటి లాంటి స్టార్ హీరోయిన్స్ ను అనేక మంది చూసినా, మల్లీశ్వరి పాత్రకు కొత్త అమ్మాయి కావాలి కాబట్టి కత్రినానే సరైన ఎంపిక అని తాను పట్టుబట్టానని ఆయన అన్నారు. రోమన్ హాలిడే సినిమా స్ఫూర్తితో ఒక సామాన్య వ్యక్తికి, రాకుమారికి మధ్య ప్రేమకథగా మల్లీశ్వరిని రూపొందించాలనుకున్నానని తెలిపారు. మూడు నెలల ఎదురుచూపుల తర్వాత, చివరి ప్రయత్నంగా ముంబై వెళ్లి కత్రినాతో మాట్లాడినప్పుడు, ఆమెకు భాష రాదనే భయంతోనే సినిమాకు ఒప్పుకోవడం లేదని తెలిసింది.

కత్రినాకు హిందీ కూడా రాదని, కాబట్టి తెలుగు నేర్చుకోవడం పెద్ద సమస్య కాదని తాను ఆమెకు నచ్చజెప్పానని చెప్పారు. రెండు రోజులు ప్రయత్నించి, నచ్చకపోతే తప్పుకోవచ్చని హామీ ఇచ్చారట. మొదటి రోజు షూటింగ్‌లో వైజాగ్‌లోని ఓ రెస్టారెంట్‌లో, ఆమెకు డైలాగులు లేకుండా కేవలం వెంకటేష్ మాటలకు ఎక్స్‌ప్రెషన్లు ఇవ్వాలని చెప్పగా, ఆమె సులభంగానే నటించింది. రెండో రోజుకు ఆమె మరింత ఫ్రీ అయ్యిందని తెలిపారు. క్లైమాక్స్ సన్నివేశంలో మూడు పేజీల డైలాగులను నేర్చుకోవలసి వచ్చినప్పుడు, కత్రినా మీరు నన్ను మోసం చేశారు అని సరదాగా అంది అని భాస్కర్ నవ్వారు. కానీ తన పేరు పోకూడదని పట్టుదలతో ఆ డైలాగులను నేర్చుకుందని చెప్పారు. సునీత కత్రినాకు డబ్బింగ్ చెప్పిందని విజయ్ భాస్కర్ గుర్తు చేసుకున్నారు.

మరిన్ని ఎంటర్టైన్మెంట్ వార్తల కోసం ఇక్కడ చూడండి..