Japan Trailer: కార్తీ ‘జపాన్’ టీజర్ రిలీజ్.. కామెడీ ఎంటర్టైన్మెంట్ పక్కా..

ప్రస్తుతం తన కెరీర్ లో 25వ సినిమాగా తెరకెక్కుతున్న చిత్రం జపాన్. ఈ సినిమాకు రాజు మురుగన్ దర్శకత్వం వహిస్తున్నారు. హీరోయిన్ అను ఇమ్మానుయేల్ ఈ సినిమాలో కార్తీ సరసన నటించింది. దర్శకుడు కేఎస్ రవికుమార్, నటుడు సునీల్, విజయ్ మిల్టన్ ప్రధాన పాత్రలు పోషించారు. ఈ చిత్రాన్ని డ్రీమ్ వారియర్ పిక్చర్స్ నిర్మిస్తోంది. కార్తీకి 25వ సినిమా కావడంతో పాటు వరుస హిట్లు రావడంతో జపాన్ సినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి. ఈ క్రమంలోనే బుధవారం సాయంత్రం ఈ మూవీ టీజర్ రిలీజ్ చేశారు మేకర్స్.

Japan Trailer: కార్తీ 'జపాన్' టీజర్ రిలీజ్.. కామెడీ ఎంటర్టైన్మెంట్ పక్కా..
Japan
Follow us

|

Updated on: Oct 18, 2023 | 9:14 PM

కోలీవుడ్ స్టార్ కార్తీ సినిమాల కోసం తెలుగు అడియన్స్ సైతం ఆసక్తిగా ఎదురూచూస్తుంటారు. ఇప్పటివరకు అతను నటించిన సినిమాలు తెలుగులోకి డబ్ అయి సూపర్ రెస్పాన్స్ అందుకున్నాయి. ఇక ఊపిరి సినిమాతో తెలుగు వారికి మరింత దగ్గరయ్యాడు కార్తీ. ప్రస్తుతం తన కెరీర్ లో 25వ సినిమాగా తెరకెక్కుతున్న చిత్రం జపాన్. ఈ సినిమాకు రాజు మురుగన్ దర్శకత్వం వహిస్తున్నారు. హీరోయిన్ అను ఇమ్మానుయేల్ ఈ సినిమాలో కార్తీ సరసన నటించింది. దర్శకుడు కేఎస్ రవికుమార్, నటుడు సునీల్, విజయ్ మిల్టన్ ప్రధాన పాత్రలు పోషించారు. ఈ చిత్రాన్ని డ్రీమ్ వారియర్ పిక్చర్స్ నిర్మిస్తోంది. కార్తీకి 25వ సినిమా కావడంతో పాటు వరుస హిట్లు రావడంతో జపాన్ సినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి. ఈ క్రమంలోనే బుధవారం సాయంత్రం ఈ మూవీ టీజర్ రిలీజ్ చేశారు మేకర్స్.

తాజాగా విడుదలైన టీజర్ సినిమా అంచనాలను పెంచేసింది. ఈ సినిమా టీజర్‌లోనే దర్శకుడు రాజు మురుగన్ సినిమా సారాంశాన్ని చెప్పేశారు. ఇందులో కార్తీ లుక్ మాత్రం కాస్త డిఫరెంట్ గా కనిపిస్తోంది. జపాన్ అనే దొంగ.. రూ.200 కోట్ల విలువైన నగలు దొంగిలిస్తాడు. అతడిపై అప్పటికే దాదాపు 182 కేసులు ఉంటాయి. మొత్తం నాలుగు రాష్ట్రాల పోలీసులు అతడిని వెతుకుతుంటారు. అమ్మాయిలు, బంగారం అంటే ఇష్టమున్న ఆ దొంగ చివరకు పోలీసులకు దొరికిపోతాడు. ఆ తర్వాత ఏం జరిగిందనేదే కథ. జివి ప్రకాష్ ఈ చిత్రానికి సంగీతం అందించారు. ఆయన సంగీతం సినిమాకు అదనపు బలం అని తెలుస్తోంది. ఈ సినిమాను తమిళం, మలయాళం, తెలుగు, కన్నడ భాషల్లో రిలీజ్ చేయనున్నారు.

తమిళనాడులో జరిగిన ఓ యదార్థ సంఘటన ఆధారంగా రాజు మురుగన్ ఈ చిత్రాన్ని తెరకెక్కించినట్లు సమాచారం. ఇదిలా ఉంటే.. కార్తీ 25వ చిత్రం జపాన్‌ని పురస్కరించుకుని ఆయన అభిమానులు 25 రోజుల పాటు 25 వేల మందికి భోజనం పెడుతున్నారు. రోజుకు వెయ్యి మంది చొప్పున కార్తీ పీపుల్స్ వెల్ఫేర్ ఫోరం ఈ కార్యక్రమాన్ని ప్రారంభించింది. చిత్ర నిర్మాత ఎస్.ఆర్. ప్రభు, దర్శకుడు రాజు మురుగన్‌ కలిసి దీన్ని ప్రారంభించారు. అక్టోబర్ 17 నుంచి నవంబర్ 10 వరకు ఫుడ్ డ్రైవ్ నిర్వహించనున్నారు.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Latest Articles
పెళ్లిలో నవ వధువరులు చేసిన పనికి అంతా షాక్‌' వీడియో
పెళ్లిలో నవ వధువరులు చేసిన పనికి అంతా షాక్‌' వీడియో
బెంగళూరు ప్లేఆఫ్ చేరాలంటే.. ఆ జట్లు ఓటమిని కానుకగా ఇవ్వాల్సిందే..
బెంగళూరు ప్లేఆఫ్ చేరాలంటే.. ఆ జట్లు ఓటమిని కానుకగా ఇవ్వాల్సిందే..
అమృతం తాగిన దేవతలా.. నిత్య యవ్వనంగా మెరిసిపోతున్న రమ్యకృష్ణ.
అమృతం తాగిన దేవతలా.. నిత్య యవ్వనంగా మెరిసిపోతున్న రమ్యకృష్ణ.
అక్కా భయమేస్తుందే.. భారీ అనకొండలతో సయ్యాటలు.. వీడియో చూస్తే షాకే.
అక్కా భయమేస్తుందే.. భారీ అనకొండలతో సయ్యాటలు.. వీడియో చూస్తే షాకే.
ఓరి దేవుడా..! ఏంటి.. ఈ హీరోయిన్ ఆమేనా..!!
ఓరి దేవుడా..! ఏంటి.. ఈ హీరోయిన్ ఆమేనా..!!
పోటెత్తుతున్న ఓటర్లు.. ఏపీ, తెలంగాణలో నమోదైన పోలింగ్ శాతం.. ఇలా..
పోటెత్తుతున్న ఓటర్లు.. ఏపీ, తెలంగాణలో నమోదైన పోలింగ్ శాతం.. ఇలా..
ఆయిల్ ఫుడ్ తిన్నాక ఈ పదార్ధాలు తీసుకోండి.. లేదంటే ఆరోగ్యం
ఆయిల్ ఫుడ్ తిన్నాక ఈ పదార్ధాలు తీసుకోండి.. లేదంటే ఆరోగ్యం
మనీ ట్రీ అంటే ఏంటో తెలుసా? వీటిని సాగు చేస్తే లక్షల్లో లాభం..
మనీ ట్రీ అంటే ఏంటో తెలుసా? వీటిని సాగు చేస్తే లక్షల్లో లాభం..
క్యూలో నిల్చుని తారక్, బన్నీ, చిరు.. ఓటు హక్కు వినియోగించుకున్న..
క్యూలో నిల్చుని తారక్, బన్నీ, చిరు.. ఓటు హక్కు వినియోగించుకున్న..
గ్యాస్‌ లైటర్‌ మోరాయిస్తుందా..? ఈ సింపుల్‌ ట్రిక్స్‌ ట్రై చేయండి!
గ్యాస్‌ లైటర్‌ మోరాయిస్తుందా..? ఈ సింపుల్‌ ట్రిక్స్‌ ట్రై చేయండి!