AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Vijay Deverakonda: సంక్రాంతి బరిలో విజయ్ దేవరకొండ.. ‘ఫ్యామిలీ స్టార్’ గ్లింప్స్ అదిరింది..

ప్రస్తుతం ఆయన డైరెక్టర్ పరశురామ్ దర్శకత్వంలో ఓ కొత్త ప్రాజెక్ట్ చేస్తున్నారు. ఈ సినిమాకు "ఫ్యామిలీ స్టార్" టైటిల్ ఖరారు చేశారు. ఇందులో విజయ్ జోడిగా మృణాల్ ఠాకూర్ కథానాయికగా నటిస్తుంది. ఈ చిత్రాన్ని శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ పై నిర్మాత దిల్ రాజు, శిరీష్ నిర్మిస్తున్నారు. బుధవారం సాయంత్రం ఫ్యామిలీ స్టార్ మూవీ టైటిల్ టీజర్ ను రిలీజ్ చేశారు మేకర్స్. తాజాగా విడుదలైన వీడియో చూస్తుంటే.. ఈ సినిమాలో విజయ్ సరికొత్త పాత్రలో కనిపించనున్నట్లు తెలుస్తోంది.

Vijay Deverakonda: సంక్రాంతి బరిలో విజయ్ దేవరకొండ.. 'ఫ్యామిలీ స్టార్' గ్లింప్స్ అదిరింది..
Family Star Glimpse
Rajitha Chanti
|

Updated on: Oct 18, 2023 | 8:12 PM

Share

ఇటీవలే ఖుషి సినిమాతో సూపర్ హిట్ ఖాతాలో వేసుకున్నారు రౌడీ హీరో విజయ్ దేవరకొండ. సమంత, విజయ్ కలిసి నటించిన ఈ సినిమాకు మంచి రెస్పాన్స్ వచ్చింది. దీంతో తన నెక్ట్స్ మూవీస్ పై మరింత స్పెషల్ ఫోకస్ పెట్టారు. ప్రస్తుతం ఆయన డైరెక్టర్ పరశురామ్ దర్శకత్వంలో ఓ కొత్త ప్రాజెక్ట్ చేస్తున్నారు. ఈ సినిమాకు “ఫ్యామిలీ స్టార్” టైటిల్ ఖరారు చేశారు. ఇందులో విజయ్ జోడిగా మృణాల్ ఠాకూర్ కథానాయికగా నటిస్తుంది. ఈ చిత్రాన్ని శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ పై నిర్మాత దిల్ రాజు, శిరీష్ నిర్మిస్తున్నారు. బుధవారం సాయంత్రం ఫ్యామిలీ స్టార్ మూవీ టైటిల్ టీజర్ ను రిలీజ్ చేశారు మేకర్స్. తాజాగా విడుదలైన వీడియో చూస్తుంటే.. ఈ సినిమాలో విజయ్ సరికొత్త పాత్రలో కనిపించనున్నట్లు తెలుస్తోంది.

వీడియో ప్రారంభంలో.. ఇంట్లో పనులు చేసే ఫ్యామిలీ మ్యాన్ గా.. బయట రౌడీల బెండు తీసే పవర్ ఫుల్ మ్యాన్ గా విజయ్ దేవరకొండ కనిపించారు. లైన్ లో నిలబడి ఉల్లిపాయలు తేవడాలు, టైమ్ కు లేచి పిల్లల్ని రెడీ చేసి స్కూల్ కు పంపించడాలు అనుకున్నావా సెటిల్మెంటే అంటే అని విలన్ ఎగతాళిగా మాట్లాడగా… ‘భలే మాట్లాడతారన్నా మీరంతా…ఉల్లిపాయలు కొంటే ఆడు మనిషి కాదా…పిల్లల్ని రెడీ చేస్తే ఆడు మగాడు కాదా… ఐరనే వంచాలా ఏంటి అంటూ పవర్ ఫుల్ డైలాగ్ చెబుతూ.. విలన్ గ్యాంగ్ లోని ఒకడి తల పగలగొట్టేస్తాడు విజయ్. ఆ తర్వాత వెంటనే.. సారీ బాబాయ్…కంగారులో కొబ్బరికాయ తేవడం మర్చిపోయా.. తలకాయ కొట్టేశా అంటూ తన స్టైల్లో విజయ్ డైలాగ్ చెప్పడంతో విలన్ షాకవుతాడు. ఈ వీడియోలో విజయ్ కూల్ హీరోయిజం చూపించింది. టీజర్ చివరలో బ్యూటిఫుల్ యంగ్ కపుల్ గా విజయ్, మృణాల్ మధ్య ఎమోషనల్ బాండింగ్ రివీల్ చేశారు.

ఇక తాజాగా విడుదలైన టీజర్ తో ఫ్యామిలీ స్టార్ ఒక కూల్ ఫ్యామిలీ యాక్షన్ ఎంటర్ టైనర్ గా ప్రేక్షకులను అలరించబోతున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న ఈ సినిమా వచ్చే ఏడాది సంక్రాంతికి తెలుగు, తమిళంలో విడుదల కాబోతుంది. త్వరలోనే రిలీజ్ డేట్ అనౌన్స్ చేయనున్నారు.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Follow Us
సగ్గుబియ్యం వడలు.. ఇలా చేస్తే తింటే వంద రోగాలు మాయం!
సగ్గుబియ్యం వడలు.. ఇలా చేస్తే తింటే వంద రోగాలు మాయం!
ఈ ఒక్కటి వేసి పెరుగు పులుసు చేయండి.. అబ్బో అద్భుతం.. అమోఘం
ఈ ఒక్కటి వేసి పెరుగు పులుసు చేయండి.. అబ్బో అద్భుతం.. అమోఘం
వానాకాలంలో ఈ ఆకు కూరల జోలికి అస్సలు వెళ్లకండి..
వానాకాలంలో ఈ ఆకు కూరల జోలికి అస్సలు వెళ్లకండి..
స్విగ్గీ, జొమాటోలకు పోటీగా.. ఫ్లిప్‌కార్ట్‌లో ఫుడ్ డెలివరీ..!
స్విగ్గీ, జొమాటోలకు పోటీగా.. ఫ్లిప్‌కార్ట్‌లో ఫుడ్ డెలివరీ..!
ఆరోగ్యానికి మేలు చేసే... టేస్టీ హెల్దీ రాగి వెజిటెబుల్ సూప్!
ఆరోగ్యానికి మేలు చేసే... టేస్టీ హెల్దీ రాగి వెజిటెబుల్ సూప్!
అన్నంలోకి సూపర్ గా ఉండే మీల్ మేకర్ ఫ్రై!
అన్నంలోకి సూపర్ గా ఉండే మీల్ మేకర్ ఫ్రై!
నెలకు రూ.25,000 జీతం ఉంటే.. చివరికి PF ఎంత వస్తుందో తెలిస్తే..
నెలకు రూ.25,000 జీతం ఉంటే.. చివరికి PF ఎంత వస్తుందో తెలిస్తే..
అరటిపండు తింటే కలిగే ఈ 5 ఆరోగ్య ప్రయోజనాల గురించి మీకు తెలుసా..?
అరటిపండు తింటే కలిగే ఈ 5 ఆరోగ్య ప్రయోజనాల గురించి మీకు తెలుసా..?
మందుబాబులపై ఉక్కుపాదం.. హైదరాబాద్‌లో పోలీసుల ప్రత్యేక డ్రైవ్‌లు
మందుబాబులపై ఉక్కుపాదం.. హైదరాబాద్‌లో పోలీసుల ప్రత్యేక డ్రైవ్‌లు
శ్రీరాంసాగర్ ప్రాజెక్ట్‌లో తీవ్ర విషాదం.. నీటిలో పడి నలుగురు మృతి
శ్రీరాంసాగర్ ప్రాజెక్ట్‌లో తీవ్ర విషాదం.. నీటిలో పడి నలుగురు మృతి