Bhaje Vaayu Vegam Review: భజే వాయువేగం మూవీ రివ్యూ.. సినిమా ఎలా ఉందంటే..

ఓ పర్ఫెక్ట్ హిట్‌ కోసం చాన్నాళ్లుగా వెయిట్‌ చేస్తున్నారు హీరో కార్తికేయ గుమ్మకొండ. భజే వాయువేగం ఆయనకు అలాంటి సినిమానే అవుతుందా? యువీ కాన్సెప్ట్స్ కి లాభాలు తెచ్చిపెడుతుందా? ప్రశాంత్‌ రెడ్డి చంద్రపు టేకింగ్‌ జనాలను మెప్పిస్తుందా? శుక్రవారం విడుదలైన భజే వాయు వేగం ఇంతకీ ఎలా ఉంది? ....

Bhaje Vaayu Vegam Review: భజే వాయువేగం మూవీ రివ్యూ.. సినిమా ఎలా ఉందంటే..
Bhaje Vayu Vegam Movie
Follow us
Dr. Challa Bhagyalakshmi - ET Head

| Edited By: Rajeev Rayala

Updated on: May 31, 2024 | 6:14 PM

ఓ పర్ఫెక్ట్ హిట్‌ కోసం చాన్నాళ్లుగా వెయిట్‌ చేస్తున్నారు హీరో కార్తికేయ గుమ్మకొండ. భజే వాయువేగం ఆయనకు అలాంటి సినిమానే అవుతుందా? యువీ కాన్సెప్ట్స్ కి లాభాలు తెచ్చిపెడుతుందా? ప్రశాంత్‌ రెడ్డి చంద్రపు టేకింగ్‌ జనాలను మెప్పిస్తుందా? శుక్రవారం విడుదలైన భజే వాయు వేగం ఇంతకీ ఎలా ఉంది? ….

సినిమా: భజే వాయువేగం

నటీనటులు: కార్తికేయ గుమ్మకొండ, ఐశ్వర్య మీనన్‌, రాహుల్‌ టైసన్‌, తనికెళ్ల భరణి, రవిశంకర్‌, శరత్‌ లోహితస్వ, రూపలక్ష్మి తదితరులు

మాటలు: మధు శ్రీనివాస్‌

ఆర్ట్: గాంధీ నడికుడికర్‌

ఎడిటర్‌: సత్య జి

సినిమాటోగ్రఫీ: ఆర్‌.డి.రాజశేఖర్‌

సంగీతం: రథన్‌

బ్యాక్‌ గ్రౌండ్‌ స్కోర్‌: కపిల్‌ కుమార్‌

సహ నిర్మాత: అజయ్‌ కుమార్‌ రాజు. పి.,

నిర్మాత: యూవీ కాన్సెప్ట్స్

దర్శకుడు: ప్రశాంత్‌ రెడ్డి చంద్రపు

కథ వెంకట్‌ (కార్తికేయ) క్రికెటర్‌ కావాలని అనుకుంటాడు. మంచి ఇల్లు, పొలం అన్నీ ఉన్న బాల్యం అతనిది. కానీ ఆస్తికి మించిన అప్పులు ఉండటంతో అతని తల్లిదండ్రులు ఆత్మహత్య చేసుకుంటారు. తండ్రి స్నేహితుడు లక్ష్మయ్య (తనికెళ్ల భరణి) ఫ్యామిలీ ఆదుకుంటుంది. ఇంకో బిడ్డ పుడితే పోషించగలమో, లేమోనని ఆలోచించే ఆ కుటుంబం… వెంకట్‌ బరువు బాధ్యతలను మాత్రం ఇష్టంగానే తీసుకుంటుంది. వెంకట్‌ క్రికెటర్‌ కావాలనుకుంటున్నాడని తెలిసి ప్రోత్సహిస్తుంది. పెద్దోడు (రాహుల్‌ టైసన్‌) సాఫ్ట్ వేర్‌ ఉద్యోగం చేయాలనుకుంటాడు. వెంకట్‌ నేషనల్స్ కి సెలక్ట్ కావాలనుకుంటాడు. ఇద్దరికీ ప్రతిభ ఉన్నా, లంచం అనే రక్కసి కోరలకు బలైపోతారు. కానీ ఆ విషయం తండ్రికి తెలియకుండా జాగ్రత్తపడతారు. పెద్దోడికి పెళ్లి సంబంధం మాట్లాడుతున్నప్పుడు కొడుకుల గురించి విషయం తెలుస్తుంది లక్ష్మయ్యకు. దాన్ని తట్టుకోలేకపోయిన ఆయనకు ఊపిరితిత్తుల సమస్య ఉందన్న విషయం బయటపడుతుంది. ఇదంతా ఓ వైపు జరుగుతుంటే హైదరాబాద్‌ మేయర్‌ (శరత్‌ లోహితస్వ) తమ్ముడు (రవిశంకర్‌)తో ఈ అన్నదమ్ములకు చెడుతుంది. మేయర్‌ కొడుకు శవం, అతని తమ్ముడు కారులో తేలుతుంది. దీనికీ వెంకట్‌కీ సంబంధం ఏంటి? అసలు మేయర్‌ కొడుకుతో వెంకట్‌కి ఎక్కడ చెడింది? క్రికెటర్‌ కావాలనుకున్న కుర్రాడు.. క్రికెట్‌ బెట్టింగులకు ఎందుకు అలవాటుపడ్డాడు? వెంకట్‌ని ప్రేమించిన అమ్మాయికీ, మేయర్‌ తమ్ముడితో ఉన్న సంబంధం ఏంటి? ఇలాంటి ఎన్నో ప్రశ్నలకు సమాధానం తెలియాలంటే భజే వాయువేగం చూడాల్సిందే.

విశ్లేషణ వినగానే ఆకట్టుకునే టైటిల్‌ భజే వాయువేగం. దానికి తగ్గట్టే ట్రైలర్‌ని కూడా క్రిస్పీగా కట్‌ చేసి అట్రాక్ట్ చేశారు. చాన్నాళ్ల తర్వాత అన్నదమ్ముల కథ తెరమీదకు వస్తుందనే ఇంట్రస్ట్ కూడా క్రియేట్‌ అయింది. రామలక్ష్మణుల లాంటి అన్నదమ్ముళ్లు దేవుళ్లు కాకుండా రాక్షసులైతే… వాళ్లే ఈ సినిమాలో విలన్లు. ఒక తల్లికి పుట్టని అన్నదమ్ములు వెంకట్‌, రాహుల్‌. వారిద్దరికీ, వీరిద్దరితో ఎక్కడ కలిసింది? ఎక్కడ చెడింది? అనేదే కథ… అని చెప్పుకోవడానికి ఇంట్రస్టింగ్‌గానే ఉంది. కానీ తెరమీదకు వచ్చేసరికే అసలు ఇబ్బంది కనిపిస్తుంది. పోలీస్‌ స్టేషన్‌లో కూర్చున్న హీరోతో మొదలయ్యే కథ చాలా ఇంట్రస్టింగ్‌గా అనిపిస్తుంది. ఎఫ్‌ ఐ ఆర్‌ మీద సంతకం పెట్టాల్సిన కుర్రాడికి పోలీస్‌ ఆఫీసర్‌ టీ ఎందుకు ఇప్పించాడనేది కూడా ఆసక్తిని క్రియేట్‌ చేసింది. కథగా మొదలైనప్పుడు బావున్నా అడుగడుగునా స్పీడ్‌ బ్రేకర్లు తగిలినట్టే సాగింది స్క్రీన్‌ప్లే. సూపర్బ్ టేకాఫ్‌ అనుకున్న ప్రతిసారీ పంటికింద రాయిలా ఏదో ఒక అడ్డంకి ఇబ్బంది పెట్టింది. అధికారం కోసం అన్నకు వెన్నుపోటు పొడిచే తమ్ముడి కథలు మనకు కొత్తకాదు. పవర్‌ కోసం ప్రాణాలు తీసే రక్తసంబంధాలూ తెరమీద కొత్తకాదు. అనాథ పిల్లాడిని అక్కున చేర్చుకుని ఆదరించిన కుటుంబాల సంగతులూ కొత్తేం కాదు. షరా మామూలుగా కనిపించే ఇలాంటి కథలో ఇంట్రస్టింగ్‌గా ఎన్నో విషయాలను చొప్పించే ప్రయత్నం చేశారు డైరక్టర్‌. కానీ అవి అందం తీసుకురావాల్సినదానికి బదులు అతుకులు బొతుకులుగా కనిపించడమే పెద్ద సమస్యగా కనిపించింది. ఇంటర్వెల్‌ బ్యాంగ్‌లో కనిపించిన సస్పెన్స్ సెకండ్‌ హాఫ్‌లో సస్టయిన్‌ అయి ఉంటే సినిమాకు మంచి మార్కులు పడేవి. ఫస్టాఫ్‌ లో అయినా కాస్త కామెడీని చొప్పించి ఉంటే ప్లస్‌ అయ్యేది. ఇవేమీ లేకుండా ఫ్లాట్‌గా సాగడం అనేది జనాలను ఎంత వరకు మెప్పిస్తుందో చూడాలి. వెంకట్‌ కేరక్టర్‌లో కార్తికేయ గుమ్మకొండ నటన బావుంది. హ్యాపీడేస్‌కి రాహుల్‌ బాడీ లాంగ్వేజ్‌ సూట్‌ అయింది కానీ, ఈ సినిమాలో కృతకంగా అనిపించింది. హీరో, హీరోయిన్ల మధ్య డ్యూయట్‌ బావుంది కానీ, సన్నివేశాల్లో ఎక్కడో కెమిస్ట్రీ మిస్‌ అయింది. ఆర్ట్, విజువల్స్ ని బట్టి మేకర్స్ బాగా ఖర్చు పెట్టారనే విషయం అర్థమవుతుంది.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

టమాటా మసాలా కర్రీ.. ఎందులోకైనా అదుర్స్ అంతే..
టమాటా మసాలా కర్రీ.. ఎందులోకైనా అదుర్స్ అంతే..
ఉపేంద్ర UI బ్యూటీని శ్రీలీలతో పోలుస్తున్న నెటిజన్స్.. ఎందుకంటే..
ఉపేంద్ర UI బ్యూటీని శ్రీలీలతో పోలుస్తున్న నెటిజన్స్.. ఎందుకంటే..
ఇంట్లో పనిచేసే వారితో రామ్ చరణ్- ఉపాసన క్రిస్మస్ వేడుకలు.. ఫొటోస్
ఇంట్లో పనిచేసే వారితో రామ్ చరణ్- ఉపాసన క్రిస్మస్ వేడుకలు.. ఫొటోస్
ప్రఖ్యాత రచయిత వాసుదేవన్ నాయర్ కన్నుమూత
ప్రఖ్యాత రచయిత వాసుదేవన్ నాయర్ కన్నుమూత
నితీష్, నవీన్ పట్నాయక్‌కు భారతరత్న.. తెరమీదకు కొత్త డిమాండ్
నితీష్, నవీన్ పట్నాయక్‌కు భారతరత్న.. తెరమీదకు కొత్త డిమాండ్
శివన్న ఆరోగ్యంపై అప్డేట్ ఇచ్చిన కూతురు.. ఎమోషనల్ పోస్ట్
శివన్న ఆరోగ్యంపై అప్డేట్ ఇచ్చిన కూతురు.. ఎమోషనల్ పోస్ట్
మల్లారెడ్డా మజాకా.. జిమ్‌లో అదరగొట్టిన మాజీ మంత్రి
మల్లారెడ్డా మజాకా.. జిమ్‌లో అదరగొట్టిన మాజీ మంత్రి
స్మార్ట్ వాచ్‌లు పెట్టుకుంటున్నారా.. ఈ వ్యాధులు రావడం ఖాయం!
స్మార్ట్ వాచ్‌లు పెట్టుకుంటున్నారా.. ఈ వ్యాధులు రావడం ఖాయం!
ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలుకలిగిన క్యాబేజీ..వారానికి ఒక్కసారైనా తింటే
ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలుకలిగిన క్యాబేజీ..వారానికి ఒక్కసారైనా తింటే
శ్రీతేజ్‌ను పరామర్శించిన జానీ మాస్టర్.. బన్నీ గురించి ఏమన్నాడంటే?
శ్రీతేజ్‌ను పరామర్శించిన జానీ మాస్టర్.. బన్నీ గురించి ఏమన్నాడంటే?