AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Karthika Deepam 2: కార్తీక దీపం 2లోకి పవర్ ఫుల్ విలన్.. అసలు ఎవరీ మాలిని.. ? ఆమె బ్యాగ్రౌండ్ ఇదే..

ఒకప్పుడు బుల్లితెరపై సంచలనం సృష్టించిన సీరియల్ కార్తీక దీపం. దాదాపు ఏడు సంవత్సరాలు ఈ సీరియల్ తెలుగు ప్రేక్షకులను అలరించింది. ఇక ఇప్పుడు ఆ ధారవాహికకు సీక్వెల్ గా వచ్చింది కార్తీక దీపం 2. అయితే ఇప్పుడు ఈ సీరియల్ మలుపులు తిరుగుతుంది. అలాగే కొత్త కొత్త క్యారెక్టర్స్ ఎంట్రీ ఇస్తున్నాయి. తాజాగా మరో పవర్ ఫుల్ లేడీ విలన్ అందరి దృష్టిని ఆకర్షించింది.

Karthika Deepam 2: కార్తీక దీపం 2లోకి పవర్ ఫుల్ విలన్.. అసలు ఎవరీ మాలిని.. ? ఆమె బ్యాగ్రౌండ్ ఇదే..
Tejaswini Prakash
Rajitha Chanti
|

Updated on: Jul 09, 2026 | 12:13 PM

Share

మలుపుల మయం.. ట్విస్ట్‌ల వలయంగా సాగుతున్న సీరియల్. ప్రస్తుతం బుల్లితెర ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంటుంది ‘కార్తీకదీపం 2’ . ఇప్పటికే ఈ సీరియల్ దాదాపు 700కు పైగా ఎపిసోడ్‌లను పూర్తి చేసుకుని విజయవంతంగా దూసుకుపోతోంది. వంటలక్క, కార్తీక్ బాబు, జ్యోత్స్న, పారిజాతం పాత్రలతోపాటు.. ఇప్పుడు సరికొత్తగా ఎంట్రీ ఇచ్చిన సూరజ్ పాత్ర జనాలను మెప్పిస్తుంది. అయితే.. ఇప్పుడు ఈ కథలో కార్తీక్ పాత్ర కంటే కొత్తగా ఎంట్రీ ఇచ్చిన సూరజ్ పాత్ర చుట్టూ కథ నడుస్తోంది. ఈ క్రమంలోనే శివన్నారాయణ హోటల్ సామ్రాజ్యాన్ని కూల్చడానికి, దీపతో సవాల్‌కి సిద్ధమంటూ కథలోకి మరో లేడీ విలన్ ఎంట్రీ ఇచ్చింది. శివనారాయణ శత్రువు.. సుమిత్ర తండ్రి దక్షణమూర్తి కోడలిగా ‘మాలిని’ అనే పవర్‌ఫుల్ లేడీ విలన్ పాత్ర రంగంలోకి దిగింది. రావడంతో తన నడక, నటనతో కార్తీక దీపం సీరియల్ సౌందర్యను గుర్తు చేసింది.

ఎక్కువ మంది చదివినవి : Athadu Movie : అతడు సినిమా హిట్ అవ్వడానికి కారణం ఆయనే.. నాజర్ కామెంట్స్..

కార్తీకదీపం పార్ట్ 1లో కార్తీక్ తల్లి ‘సౌందర్య’ పాత్ర ఎంత పవర్‌ఫుల్‌గా సాగిందో.. అదే రేంజ్‌లో నెగిటివ్ షేడ్స్‌తో ఈ ‘మాలిని’ పాత్ర ఉండబోతోందని ఆమెను చూస్తే తెలుస్తోంది. అప్పట్లో తెలుగు ప్రేక్షకులను అలరించిన సౌందర్య పాత్రను మించి మాలిని పాత్ర ఉంటుందని తెలుస్తోంది. ఇదిలా ఉంటే.. ఇప్పుడు మాలిని పాత్రలో ఎంట్రీ ఇచ్చిన నటి ఎవరు.. ? ఆమె గురించి తెలుసుకోవడానికి జనాలు తెగ ఆసక్తి చూపిస్తున్నారు. మాలిని పాత్రలో నటిస్తున్న నటి అసలు పేరు తేజస్విని ప్రకాష్ (Tejaswini Prakash). ఈమెకు కన్నడ చిత్ర పరిశ్రమలో బలమైన నేపథ్యం ఉంది. కన్నడ ఇండస్ట్రీలో పాపులర్ స్టంట్ మాస్టర్ అయిన ప్రకాష్ కూతురే ఈ తేజస్విని. ఈమె తల్లి వినయ కూడా కన్నడ బుల్లితెరపై నటిగా మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. ‘నిహారిక’, ‘నన్నరసి రాధే’ వంటి ఫేమస్ సీరియల్స్‌లో నటించడమే కాకుండా, కన్నడ బిగ్ బాస్ సీజన్ 5లో కంటెస్టెంట్‌గా కూడా అలరించారు. ఎక్కువ మంది చదివినవి : Aamir Khan: 61 ఏళ్ల వయసులో మూడో పెళ్లి.. ఆమీర్ ఖాన్ తన మొదటి ఇద్దరు భార్యలకు ఎందుకు విడాకులు ఇచ్చారో తెలుసా.. ?

తేజస్విని పుట్టి పెరిగింది కర్ణాటకలోనే అయినప్పటికీ.. ఆమె నిజ జీవితంలో మన తెలుగింటి కోడలే కావడం విశేషం. ఫణివర్మ అనే తెలుగు వ్యక్తిని వివాహం చేసుకున్న ఈమెకు ఒక పాప కూడా ఉంది. తేజస్విని కేవలం సీరియల్స్ మాత్రమే కాకుండా కన్నడ వెండితెరపై స్టార్ హీరోల సరసన హీరోయిన్‌గా నటించింది. కన్నడలో ‘గూలిహట్టి’, ‘మాసనద మక్కలు’, ‘గజ’, ‘అంబుట్టు ఇంబుట్టు ఎంబుట్టు’ వంటి చిత్రాల్లో నటించి మెప్పించింది. కన్నడ, తమిళ చిత్రాలతో పాటు తెలుగు సినిమాల్లోనూ ఈమె అదృష్టాన్ని పరీక్షించుకుంది. తెలుగు ప్రేక్షకులకు ఈమె ముందే పరిచయం. టాలీవుడ్‌లో ఈమె తన పేరును ‘తనీష్క’ (Tanishka)గా మార్చుకుని సినిమాలు చేసింది. ‘ప్రతిక్షణం’, ‘కట్ చేస్తే’, ‘సినిమా మహల్ – రోజుకి 4 ఆటలు’ వంటి చిత్రాలలో నటించింది. ఇప్పుడు మళ్లీ చాలా కాలం తర్వాత ‘కార్తీకదీపం 2’ సీరియల్‌లో ‘మాలిని’గా పవర్‌ఫుల్ విలనిజం పండించడానికి సిద్ధమైంది. ఇప్పటివరకు దీప వర్సెస్ జ్యోత్స్నగా సాగిన ఈ సీరియల్ పోరు.. ఇకపై దీప వర్సెస్ మాలిని (తేజస్విని) మధ్య రణరంగంగా మారబోతోంది.

ఎక్కువ మంది చదివినవి : Murali Mohan: అన్నయ్య నాకోసం ఫ్యాన్స్ వస్తారా అని అడిగాడు.. ఇప్పుడు ఇండస్ట్రీకే మొగుడయ్యాడు.. మురళి మోహన్..

తేజస్వి ప్రకాష్..

ఎక్కువ మంది చదివినవి : Cinema: ఫస్ట్ సినిమా చూసి ప్లాప్ అన్నారు.. కట్ చేస్తే.. 26 ఏళ్లుగా తగ్గని క్రేజ్.. ఇప్పటికీ టీవీలకు అతుక్కుపోతారు..

Follow Us