AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

సరుగుడు తోటల్లో ఏదో జరుగుతుంది.. అనుమానంతో సీక్రెట్ ఆపరేషన్.. కనిపించిన సీన్‌ చూసి షాక్!

అనకాపల్లి జిల్లాలోని సరుగుడు తోటలు.. గుట్టుచప్పుడు కాకుండా కొంతమంది లోపలికి వెళ్తూ వస్తున్నారు. వాళ్లకు తప్ప.. మిగతావారు ఎవ్వరికి అక్కడ ఏం జరుగుతుందో తెలియకుండా జాగ్రత్త పడుతున్నారు. వెళ్తున్నారు.. పని పూర్తి చేసుకుని వచ్చేస్తున్నారు. ఎవరికో చిన్న ఉప్పందింది. అటువైపుగా కొంతమంది యువకులు వెళుతున్నారు.. ఘాటైన వాసన వస్తోంది. ఈ విషయాన్ని పోలీసులకు సమాచారం అందించారు. రంగంలోకి దిగిన పోలీసులు దాడులు చేస్తే.. రెడ్ హ్యాండెడ్ గా దొరికిపోయారు.

సరుగుడు తోటల్లో ఏదో జరుగుతుంది.. అనుమానంతో సీక్రెట్ ఆపరేషన్.. కనిపించిన సీన్‌ చూసి షాక్!
Casuarina Plantation
Maqdood Husain Khaja
| Edited By: |

Updated on: Jul 09, 2026 | 12:12 PM

Share

అనకాపల్లి జిల్లాలోని సరుగుడు తోటలు.. గుట్టుచప్పుడు కాకుండా కొంతమంది లోపలికి వెళ్తూ వస్తున్నారు. వాళ్లకు తప్ప.. మిగతావారు ఎవ్వరికి అక్కడ ఏం జరుగుతుందో తెలియకుండా జాగ్రత్త పడుతున్నారు. వెళ్తున్నారు.. పని పూర్తి చేసుకుని వచ్చేస్తున్నారు. ఎవరికో చిన్న ఉప్పందింది. అటువైపుగా కొంతమంది యువకులు వెళుతున్నారు.. ఘాటైన వాసన వస్తోంది. ఈ విషయాన్ని పోలీసులకు సమాచారం అందించారు. రంగంలోకి దిగిన పోలీసులు దాడులు చేస్తే.. రెడ్ హ్యాండెడ్ గా దొరికిపోయారు.

అనకాపల్లి జిల్లా మునగపాక పోలీస్ స్టేషన్ నాగులపల్లి శివారు సరుగుడు తోటలు అవి. మునగపాక పోలీసులకు కీలక సమాచారం అందింది. ప్రత్యేక బృందంగా రంగంలోకి దిగి పకడ్బందీగా నిఘా పెట్టారు. కొంతమంది యువకులు లోపలికి వెళ్తున్నట్టు గుర్తించి కాసేపటి తర్వాత ఒక్కసారిగా దాడులు చేశారు. దీంతో అసలు విషయం బయటపడింది. దీంతో యువకులను అదుపులోకి తీసుకున్న పోలీసులు విచారణ చేపట్టడంతో సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి.

కొంతమంది యువకులు ముఠాగా ఏర్పడి సరగుడు తోటలోకి వెళ్లి గంజాయి సేవిస్తున్నారు. అంతేకాదు చిన్న చిన్న ప్యాకెట్లుగా రెడీ చేసి అమాయక యువతకు విక్రయించేందుకు సిద్ధం చేస్తున్నారు. అందుకోసం చిన్న కుటీర పరిశ్రమ లాంటి ఏర్పాట్లు కూడా సరుకుడు తోటలోనే చేసుకున్నారు. వేయింగ్ మిషన్‌తో గంజాయి తూకం వేసి.. 20 గ్రాముల చొప్పున చిన్న ప్యాకెట్లుగా తయారు చేస్తున్నారు. పోలీసుల ఈ వ్యవహారం చూసి అవాక్కయ్యారు. వెంటనే వారిని రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు. కాండ్రేగుల జై వినయ్, దుర్గా సాయి అలియాస్ సాయినాథ్, వెదురుపర్తి జయరాం, బండారు వరుణ్ కుమార్, మిథున్ కుమారులను అరెస్టు చేశారు పోలీసులు. వారి నుంచి 3.310 కిలో గ్రాముల గంజాయి, ఓ ఎలక్ట్రానిక్ వేయింగ్ మిషన్, మూడు మొబైల్ ఫోన్లు, నాలుగు బైకులు సీజ్ చేశారు.

మునగపాక పోలీస్ స్టేషన్లో కేసు నమోదు చేసి ఐదుగురు నిందితులను న్యాయస్థానంలో హాజరు పరిచారు. న్యాయస్థానం ఐదుగురు నిందితులకు 14 రోజుల రిమాండ్ విధించిందని తెలిపారు ఎలమంచిలి రూరల్ సిఐ ధనుంజయరావు అత్యంత చాకచక్యంగా గంజాయి ముఠాను అరెస్టు చేసిన పోలీసు సిబ్బందికి జిల్లా ఎస్పీ సిన్హా అభినందించారు. గంజాయి మత్తు బజారుల అక్రమ రవాణా విక్రయాలు వినియోగానికి సంబంధించి ఎలాంటి సమాచారం ఉన్న భయపడకుండా సమీప పోలీస్ స్టేషన్ లో కానీ 112 గాని ఈగల్ టోల్ ఫ్రీ హెల్ప్ లైన్ నెంబర్ 1972 గాని సమాచారం అందించాలని కోరారు. సమాచారం ఇచ్చిన వారి వివరాలు గోప్యంగా ఉంచుతామని హామీ ఇస్తున్నారు పోలీసులు.

మరిన్ని క్రైమ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Follow Us
అక్టోబర్‌లో నిప్పులే.. వానలు లేవు.. వాతావరణ శాఖ బిగ్ అలర్ట్..
అక్టోబర్‌లో నిప్పులే.. వానలు లేవు.. వాతావరణ శాఖ బిగ్ అలర్ట్..
టీవీలు, ల్యాప్‌టాప్‌లు, సోలార్ ప్యానెళ్లు.. భారీగా కార్గో స్కామ్!
టీవీలు, ల్యాప్‌టాప్‌లు, సోలార్ ప్యానెళ్లు.. భారీగా కార్గో స్కామ్!
WhatsApp వాడే వారికి బిగ్ షాక్.. ఈ మెసేజ్‌లు ఆగిపోవచ్చు..
WhatsApp వాడే వారికి బిగ్ షాక్.. ఈ మెసేజ్‌లు ఆగిపోవచ్చు..
124 పరుగుల భారీ తేడాతో భారత్ ఘన విజయం.. పాక్‌తో తుదిపోరు..
124 పరుగుల భారీ తేడాతో భారత్ ఘన విజయం.. పాక్‌తో తుదిపోరు..
15 లక్షలు తీసుకున్నాక బిగ్ బాస్ టీం నాతో ఏం చెప్పారంటే..
15 లక్షలు తీసుకున్నాక బిగ్ బాస్ టీం నాతో ఏం చెప్పారంటే..
రాఖీ కట్టిన వ్యక్తినే పెళ్లి చేసుకుంది.. చివరికి..!
రాఖీ కట్టిన వ్యక్తినే పెళ్లి చేసుకుంది.. చివరికి..!
అమ్మ చేతి రుచిని గుర్తు చేసే ములక్కాడ పచ్చిరొయ్యల కూర
అమ్మ చేతి రుచిని గుర్తు చేసే ములక్కాడ పచ్చిరొయ్యల కూర
కొత్త బట్టల రంగు వెలిసిపోతోందా? ఈ చిట్కాలతో మెరుపును కాపాడుకోండి!
కొత్త బట్టల రంగు వెలిసిపోతోందా? ఈ చిట్కాలతో మెరుపును కాపాడుకోండి!
9/11 తరహా విపత్తును అడ్డుకున్న పైలట్ స్మిత్‌కు సెల్యూట్..
9/11 తరహా విపత్తును అడ్డుకున్న పైలట్ స్మిత్‌కు సెల్యూట్..
రూ.1,499 రీఛార్జ్‌తో 300 రోజుల వ్యాలిడిటీ.. మతిపోగొట్టే ప్లాన్‌!
రూ.1,499 రీఛార్జ్‌తో 300 రోజుల వ్యాలిడిటీ.. మతిపోగొట్టే ప్లాన్‌!