సోషల్ మీడియా ద్వారా  శ్రీలీల ఎంత సంపాదిస్తుందంటే..

Rajitha Chanti

Pic credit - Instagram

08  July 2026

టాలీవుడ్‌లో అతి తక్కువ కాలంలోనే స్టార్ హీరోయిన్‌గా ఎదిగిన ముద్దుగుమ్మ శ్రీలీల. పెళ్ళి సందD, ధమాకా చిత్రాలతో తెలుగు ప్రేక్షకులకు దగ్గరైంది.

తనదైన నటనతో.. ముఖ్యంగా అదిరిపోయే డ్యాన్స్ స్టెప్పులతో యూత్‌లో విపరీతమైన క్రేజ్ సంపాదించుకుంది. ఆమె సాంగ్స్ సోషల్ మీడియాను ఊపేశాయి.

కేవలం సినిమాల్లోనే కాకుండా, సోషల్ మీడియా వేదికగా కూడా శ్రీలీల భారీ స్థాయిలో పాపులారిటీని, సంపాదనను సొంతం చేసుకుంటోంది ఈ ముద్దుగుమ్మ. 

ప్రస్తుతం శ్రీలీలకు ఇన్‌స్టాగ్రామ్‌లో 6.4 మిలియన్లకు పైగా (64 లక్షలు) ఫాలోవర్స్ ఉన్నారు. ఈ అమ్మడు అనేక బ్రాండ్స్ ప్రమోట్ చేస్తూ పోస్టులు చేస్తుంది.

తాజా నివేదికల ప్రకారం శ్రీలీల తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో చేసే ఒక్కో బ్రాండ్ ప్రమోషన్ లేదా స్పాన్సర్డ్ పోస్ట్‌కు లక్షల్లో రెమ్యునరేషన్ అందుకుంటున్నట్లు సమాచారం

నెలకు కేవలం సోషల్ మీడియా ప్రమోషన్స్ ద్వారానే ఆమె దాదాపు సుమారు 7 నుండి 10 లక్షల రూపాయల వరకు సంపాదిస్తున్నట్లు టాక్ వినిపిస్తుంది.

కేవలం అందం, అభినయమే కాకుండా సోషల్ మీడియాలో అభిమానులతో నిరంతరం టచ్‌లో ఉండటం, ట్రెండింగ్ రీల్స్ చేయడం ఆమెకు ప్లస్ పాయింట్‌గా మారింది.

సినిమాలకు కోట్లలో రెమ్యునరేషన్ తీసుకునే ఈ భామ, బ్రాండ్ ఎండార్స్‌మెంట్ల విషయంలో చాలా సెలెక్టివ్‌గా ఉంటారు. శ్రీలీల ఆస్తి విలువ రూ.15 కోట్లు అని టాక్.