AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

అరటిపండు vs ఆరెంజ్.. ఉదయం శక్తి కోసం ఏది తినడం మంచిది? ఈ పండుతో అలసటకు చెక్ పెట్టండి..

Banana vs Orange: మనం ఉదయం తీసుకునే మొదటి ఆహారం ఆ రోజంతా మన శరీరం ఎంత ఉత్సాహంగా ఉండాలనే విషయాన్ని నిర్ణయిస్తుంది. చాలా మంది ఉదయాన్నే కాఫీతో రోజును ప్రారంభిస్తే.. మరికొందరు తేలికగా జీర్ణమయ్యే, సహజసిద్ధమైన పండ్లను ఇష్టపడతారు. బ్రేక్‌ఫాస్ట్‌లో పండ్లు అనగానే అరటిపండు, నారింజ ముందుంటాయి. ఇవి రెండు పోషకాలతో నిండినవే అయినప్పటికీ, మన శరీరంపై చూపే ప్రభావం మాత్రం వేరువేరుగా ఉంటుంది. మరి ఈ రెండింటిలో ఉదయపు సమయానికి ఏది బెస్ట్‌ అనేది తెలుసుకుందాం..

Krishna S
|

Updated on: Jul 09, 2026 | 7:37 AM

Share
అరటిపండు: అరటిపండ్లలో గ్లూకోజ్, ఫ్రక్టోజ్, సుక్రోజ్ వంటి కార్బోహైడ్రేట్లు చాలా ఎక్కువగా ఉంటాయి. ఇవి శరీరానికి తక్షణ శక్తిని అందిస్తాయి. ప్రముఖ సైన్స్ జర్నల్ ప్లోస్ వన్‌లో ప్రచురితమైన ఒక అధ్యయనం ప్రకారం.. ఎక్కువ సమయం శారీరక శ్రమ లేదా వ్యాయామం చేసేవారికి అరటిపండు ఒక అద్భుతమైన ఇంధనంగా పనిచేస్తుంది. అరటిపండులో ఉండే పీచుపదార్థం రక్తంలో చక్కెర స్థాయిలు అకస్మాత్తుగా పెరగకుండా చూస్తుంది.

1 / 5
అరటిపండు జీర్ణక్రియను కాస్త నెమ్మదింపజేసి, గ్లూకోజ్‌ను క్రమక్రమంగా విడుదల చేయడం వల్ల శరీరానికి స్థిరమైన, ఎక్కువసేపు ఉండే శక్తి లభిస్తుంది. అరటిపండు గ్లైసిమిక్ ఇండెక్స్ కూడా మోడరేట్‌గా ఉంటుంది. కాబట్టి ఉదయం తిన్న తర్వాత మళ్లీ మధ్యాహ్నం భోజనం వరకు ఆకలి వేయకుండా, నీరసం రాకుండా ఉండాలంటే అరటిపండు బెస్ట్ ఛాయిస్.

2 / 5
నారింజ: నారింజ పండ్లలో క్యాలరీలు, కార్బోహైడ్రేట్లు తక్కువగా ఉంటాయి.. కానీ, నీటి శాతం చాలా ఎక్కువగా ఉంటుంది. దీనిలో దాదాపు 85-87శాతం వరకు నీరే ఉంటుంది. ఇది ఉదయాన్నే శరీరానికి కావలసిన హైడ్రేషన్‌ను అందించి, అలసటను దూరం చేస్తుంది మరియు మిమ్మల్ని మరింత అలర్ట్‌గా ఉంచుతుంది. పబ్లిక్ హెల్త్ న్యూట్రిషన్ పరిశోధనల ప్రకారం.. నారింజను క్రమం తప్పకుండా తీసుకోవడం వల్ల శరీరంలో ఎనర్జీ బ్యాలెన్స్, డైటరీ ప్యాటర్న్స్ మెరుగ్గా ఉంటాయి. ఇవి చాలా తేలికగా, వేగంగా జీర్ణమవుతాయి. కాబట్టి ఉదయాన్నే ఎక్కువ ఆకలి లేని వారికి, లైట్ ఎనర్జీ బూస్ట్ కావాలనుకునే వారికి నారింజ పండు చాలా మంచిది.

3 / 5
ఎలక్ట్రోలైట్స్ - పోషకాల పాత్ర: అరటిపండులో పొటాషియం అత్యధికంగా ఉంటుంది. ఇది కండరాల పనితీరుకు, ఎనర్జీ మెటబాలిజానికి ఎంతో అవసరమైన ముఖ్యమైన ఖనిజం. ఇక నారింజలో విటమిన్ సి, వాటర్ కంటెంట్ ఎక్కువ. ఇది డీహైడ్రేషన్ వల్ల వచ్చే అలసటను తగ్గిస్తుంది. మొత్తంగా చూస్తే.. ఒకటి శరీరానికి కావలసిన ఇంధనాన్ని  ఇస్తే, మరొకటి బాడీ ఫ్లూయిడ్స్ బ్యాలెన్స్‌ను కాపాడుతుంది.

4 / 5
మీ బ్రేక్‌ఫాస్ట్‌కు ఏది సెట్ బెస్ట్?: మీకు ఎక్కువ సమయం పాటు ఎనర్జీ కావాలన్నా లేదా ఉదయాన్నే ఆఫీస్ పనులతో విపరీతమైన బిజీ షెడ్యూల్ ఉన్నా అరటిపండు బెస్ట్. ఉదయాన్నే హెవీగా కాకుండా తేలికగా, రీఫ్రెషింగ్‌గా, హైడ్రేటింగ్‌గా ఉండాలనుకుంటే నారింజను ఎంచుకోండి. ఈ రెండింటినీ కలిపి తీసుకోవడం వల్ల శరీరానికి అటు హైడ్రేషన్, ఇటు నిరంతర శక్తి.. రెండు ఒకేసారి అందుతాయి.

5 / 5
Follow Us
డీమార్ట్‌కు రెగ్యులర్‌గా వెళ్లే వారికి కూడా తెలియని ట్రిక్

తెలుగు పద్యానికి తొలి పునాదిగా అద్దంకి శాసనం

రైల్వే ఉద్యోగులు అన్ని రైళ్లలోనూ ఉచితంగా ప్రయాణించవచ్చా? నియమాలు

సామాన్యులకు బిగ్‌ రిలీఫ్.. భారీగా తగ్గిన కూరగాయల ధరలు

సూర్యగ్రహణం.. వీరి జీవితంలో భారీ మార్పులు చేయబోతున్న సూర్యుడు..

4 తరాలుగా వాడుతున్న ప్రొడక్ట్స్.. తగ్గని డిమాండ్! ఆ సీక్రెట్ ఇదే

బాకీ తీర్చమంటే బంగారం ఇచ్చాడు.. తీరా చూస్తే షాక్!

అరుదైన ఘనత సాధించేందుకు సిద్ధమైన కేఎల్ రాహుల్

మందులకు గుడ్ బై చెప్పి ఇది కప్పు తింటే .. దెబ్బకు షుగర్ పరార్..

ప్రెషర్‌ కుక్కర్‌తో జాగ్రత్త.. ఇలా చేస్తే బాంబులా పేలే ప్రమాదం!