అలాంటి వాడినే పెళ్లి చేసుకుంటా.. మనసులో మాట బయటపెట్టిన నిధి పాప

08  July 2026

Basha Shek

అందం, అభినయం ఉన్నా అదృష్టం కలిసి రాని హీరోయిన్లలో ఇస్మార్ట్ బ్యూటీ నిధి అగర్వాల్ ఒకరని చెప్పవచ్చు. 

 ఇప్పటివరకు ఈమె నటించిన సినిమాల్లో ఇస్మార్ట్ శంకర్ మాత్రమే బ్లాక్ బస్టర్ గా నిలిచింది. మిగిలినవన్నీ ఓ మోస్తరుగా ఆడినవే.

 స్టార్ హీరోల సరసన భారీ ప్రాజెక్టుల్లో హీరోయిన్ గా అవకాశాలు వచ్చినప్పటికీ  ఈ నిధి పాపకు సరైన హిట్ మాత్రం పడటం లేదు. 

ఇటీవల కాలంలో నిధి హీరోయిన్ గా నటించిన ‘హరి హర వీరమల్లు’, ‘ది రాజా సాబ్’ వంటి భారీ చిత్రాలు బాక్సాఫీస్ వద్ద  పెద్దగా ఆకట్టుకోలేకపోయాయి.

ప్రస్తుతం తెలుగుతో పాటు తమిళంలోనూ సినిమాలు చేస్తోన్న ఈ ముద్దుగుమ్మ తాజాగా తిరుమల శ్రీవారిని దర్శించుకుంది.

ఈ సందర్భంగా జరిగిన ఓ కార్యక్రమంలో మాట్లాడుతూ తన పెళ్లి, కాబోయే భర్త గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది నిధి అగర్వాల్.

'నాకు ఇంకా సరైన వరుడు దొరకలేదు. మంచి సంబంధం వస్తే కచ్చితంగా పెళ్లి చేసుకుంటా' అని నిధి అగర్వాల్ చెప్పుకొచ్చింది.

ఇక ఎవరిని పెళ్లి చేసుకుంటావన్న ప్రశ్నకు..  తనకు సౌత్ ఇండియన్ అంటే ఇష్టమని, ఇక్కడి అబ్బాయినే పెళ్లి చేసుకుంటానంది నిధి పాప.

అందం, అభినయం ఉన్నా అదృష్టం కలిసి రాని హీరోయిన్లలో ఇస్మార్ట్ బ్యూటీ నిధి అగర్వాల్ ఒకరని చెప్పవచ్చు. 

పేరుకు కన్నడ హీరోయినే అయినా తన అందం, అభినయంతో తెలుగు ఆడియెన్స్ కు బాగా చేరువైపోయిందీ అందాల తార.

సమంత ప్రధాన పాత్రలో నటించిన మా ఇంటి బంగారం సినిమా సూపర్ హిట్ టాక్ తో దూసుకెళ్లిపోతోంది. జున్ 19న విడుదలైన ఈ సినిమా ఇప్పటివరకు రూ. 70 కోట్లకు పైగా వసూళ్లు సాధించింది.

జయపజయాలతో సంబంధం లేకుండా వరుసగా సినిమాలు చేస్తోంది టాలీవుడ్ స్టార్ హీరోయిన్ శ్రీలీల.

పవర్ స్టార్ పవన్ కల్యాణ్ ఇప్పుడు ఏపీ డిప్యూటీ సీఎంగా కీలక భాద్యతలు నిర్వర్తిస్తున్నారు. ఇప్పుడాయన సినిమాలకు కాస్త బ్రేక్ ఇచ్చారు.

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్  ప్రస్తుతం 'పెద్ది'  సినిమా షూటింగ్ పనుల్లో బిజీ బిజీగా ఉంటున్నాడు. బుచ్చిబాబు ఈ మూవీని తెరకెక్కిస్తున్నారు.

మా ఊరి పొలిమేర సినిమాతో తెలుగు ఆడియెన్స కు బాగా దగ్గరైపోయింది కామాక్షి భాస్కర్ల. ఇందులో ఆమె అభినయం అందరినీ ఆకట్టుకుంది.

సినిమా ఇండస్ట్రీలో అతి సుదీర్ఘ కాలం పాటు హీరోయిన్ గా చేస్తోన్న ముద్దుగుమ్మల్లో మిల్కీ బ్యూటీ తమన్నా భాటియా ఒకరు.