Kamal Haasan: మీరు ఇంకా క్షమాపణ చెప్పలేదా? కమల్ పై హైకోర్టు ప్రశ్నల వర్షం..
కమల్ హాసన్ ఇటీవల థగ్ లైఫ్ ప్రమోషన్లలో చేసిన కామెంట్స్ తీవ్ర వివాదానికి దారి తీసిన సంగతి తెలిసిందే. తమిళం నుంచే కన్నడ భాష పుట్టిందని కమల్ చెప్పడంతో కన్నడిగులు ఆగ్రహం వ్యక్తం చేశారు. కర్ణాటకలో థగ్ లైఫ్ సినిమాను సైతం బ్యాన్ చేశారు. దీంతో తన సినిమా విడుదల కోసం కోర్టును ఆశ్రయించారు కమల్. ప్రస్తుతం ఈ కేసుపై విచారణ జరుగుతుంది.

డైరెక్టర్ మణిరత్నం దర్శకత్వంలో కమల్ హాసన్ నటించిన లేటేస్ట్ మూవీ థగ్ లైఫ్. నాయగన్ వంటి సూపర్ హిట్ తర్వాత దాదాపు 30 ఏళ్లకు వీరిద్దరి కాంబో రిపీట్ అయ్యింది. భారీ అంచనాల మధ్య విడుదలైన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద మిక్స్డ్ టాక్ అందుకుంది. జూన్ 5న విడుదలైన ఈ సినిమాకు అడియన్స్ నుంచి రెస్పాన్స్ వచ్చింది. ఇందులో త్రిష, శింబు, అభిరామి కీలకపాత్రలు పోషించారు. అయితే ఈ సినిమా విడుదలకు ముందు కన్నడ భాష గురించి కమల్ చేసిన కామెంట్స్ కన్నడిగులకు కోపం తెప్పించింది. తమిళం నుంచే కన్నడ భాష పుట్టిందని కమల్ చెప్పడంతో కర్ణాటక రాష్ట్రవ్యాప్తంగా నిరసనలు వ్యక్తమయ్యాయి. దీంతో కర్ణాటకలో ఈ సినిమా విడుదలను సైతం బ్యాన్ చేశారు. ఒకవేళ కర్ణాటకలో ఎక్కడైనా థగ్ లైఫ్ సినిమాను రిలీజ్ చేస్తే థియేటర్లు తగలబెట్టేస్తామని వార్నింగ్ సైతం ఇచ్చాయి పలు సంస్థలు.
థగ్ లైఫ్ సినిమా విడుదలకు భద్రత కల్పించాలని కోరుతూ కమల్ హాసన్ కర్ణాటక హైకోర్టులో రిట్ పిటిషన్ దాఖలు చేసిన సంగతి తెలిసిందే. ఈ పిటిషన్ పై గతంలోనే విచారణ జరిగింది. ఆ సమయంలో కన్నడిగులకు క్షమాపణ చెప్పి సమస్యను పరిష్కరించుకోవాలని కోర్టు పరోక్షంగా కోరింది. తాజాగా ఈరోజు మరోసారి ఈ కేసుపై విచారణ జరిగింది. ఈ క్రమంలో మీరు ఇంకా క్షమాపణ చెప్పలేదా ? అంటూ కమల్ పై ప్రశ్నల వర్షం కురిపించింది. ఈ కేసులో కన్నడ సాహిత్య పరిషత్ ఒక పిటిషన్ దాఖలు చేసింది. పిటిషన్‌లో తమ వాదనలు వినాలని అభ్యర్థించారు. ఆ సమయంలో హైకోర్టు ఏకసభ్య ధర్మాసనం న్యాయమూర్తి ఎం. నాగ ప్రసన్న, ‘మీరు ఇంకా క్షమాపణ చెప్పలేదా?’ అని అడిగారు.
దీనిపై కన్నడ సాహిత్య పరిషత్ తరపున వాదిస్తున్న సీనియర్ న్యాయవాది ఎస్. బసవరాజ్ స్పందిస్తూ, ‘లేదు, కమల్ హాసన్ తెలివితక్కువ ప్రకటన చేశారు. కన్నడ ఇతిహాసాలలో కూడా కర్ణాటక అనే పదాన్ని ఉపయోగిస్తారు’ అని అన్నారు. ప్రస్తుతం ఈ కేసు విచారణ జూన్ 20కి వాయిదా పడింది. కమల్ హాసన్ ఫిల్మ్స్ గతంలో ఈ సినిమాను ప్రస్తుతానికి విడుదల చేయబోమని ప్రకటించింది. జూన్ 20 వరకు ఈ సినిమా కర్ణాటకలో విడుదల కావడం సందేహమే.
ఇవి కూడా చదవండి :
Tollywood: హీరోయిన్ దొరికేసిందిరోయ్.. నెట్టింట గత్తరేపుతోన్న టాలీవుడ్ చైల్డ్ ఆర్టిస్ట్..
Tollywood: సీరియల్లో పవర్ ఫుల్ విలన్.. నెట్టింట గ్లామర్ బ్యూటీ.. ఫోటోస్ చూస్తే..
Manasantha Nuvve : మరీ ఇంత అందంగా ఉందేంట్రా.. మతిపోగొట్టేస్తోన్న మనసంతా నువ్వే చైల్డ్ ఆర్టిస్ట్..
Tollywood : అమ్మాయిల డ్రీమ్ బాయ్.. 30 ఏళ్లకే సినిమాలకు దూరం.. కట్ చేస్తే.. ఇప్పుడు ఇలా..
