Sanjjanaa Garlrani: డ్రగ్స్ కేసులో బుజ్జిగాడు హీరోయిన్‌కు రిలీఫ్.. హైకోర్టు ఏం చెప్పిందంటే..
నటి సంజనా గల్రానీ, నిర్మాత శివప్రకాష్ చిప్పీలు ఈ కేసు నుంచి ఉపశమనం లభించింది. శాండల్ వుడ్ ఇండస్ట్రీలో డ్రగ్స్ కేసు తెరపైకి రావడంతో.. డ్రగ్స్ నెట్‌వర్క్‌తో సంబంధాలు కలిగి ఉన్నారనే ఆరోపణలతో హీరోయిన్ సంజనా గల్రానీతోపాటు హీరోయిన్ రాగిణి ద్వివేది, నిర్మాత శివప్రకాష్ చిప్పి సెప్టెంబర్ 2020లో బెంగుళూరు పోలీసులు అరెస్ట్ చేశారు. కొన్నాళ్లపాటు జైలులో ఉన్న సంజన ఆ తర్వాత అనారోగ్య సమస్యలతో డిసెంబర్ లో బెయిల్ పై విడుదలయ్యారు.
కొన్నాళ్ల క్రితం శాండల్‌వుడ్‌లో డ్రగ్స్ కేసు పెను సంచలనం సృష్టించిన సంగతి తెలిసిందే. ఈ కేసులో హీరోయిన్ నటి సంజ్జనా గల్రానీ, శివప్రకాష్ చిప్పీల పేర్లు ప్రముఖంగా వినిపించాయి. తాజాగా ఈ కేసులో వీరిద్దరికి పెద్ద ఊరట లభించింది. వీరిద్దరిపై నమోదు చేసిన ఎఫ్‌ఐఆర్‌ను కర్ణాటక హైకోర్టు రద్దు చేసింది. అంతేకాకుండా నటి సంజనా గల్రానీ, నిర్మాత శివప్రకాష్ చిప్పీలు ఈ కేసు నుంచి ఉపశమనం లభించింది. శాండల్ వుడ్ ఇండస్ట్రీలో డ్రగ్స్ కేసు తెరపైకి రావడంతో.. డ్రగ్స్ నెట్‌వర్క్‌తో సంబంధాలు కలిగి ఉన్నారనే ఆరోపణలతో హీరోయిన్ సంజనా గల్రానీతోపాటు హీరోయిన్ రాగిణి ద్వివేది, నిర్మాత శివప్రకాష్ చిప్పి సెప్టెంబర్ 2020లో బెంగుళూరు పోలీసులు అరెస్ట్ చేశారు. కొన్నాళ్లపాటు జైలులో ఉన్న సంజన ఆ తర్వాత అనారోగ్య సమస్యలతో డిసెంబర్ లో బెయిల్ పై విడుదలయ్యారు.
ఆ తర్వాత తమపై ఉన్న ఎఫ్‌ఐఆర్‌ను రద్దు చేయాలని కోరుతూ సంజన, శివప్రకాష్‌లు హైకోర్టును ఆశ్రయించారు. ఈ పిటిషన్‌పై హైకోర్టు సింగిల్ సభ్య ధర్మాసనం ఈరోజు (జూన్ 24) విచారణ జరిపి ఎఫ్‌ఐఆర్‌ను రద్దు చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. బెంగళూరులోని కళ్యాణ నగర్‌లోని రాయల్ సూట్స్ హోటల్‌లో సినీ నటీనటులు, వ్యాపారవేత్తల పిల్లలు డ్రగ్స్ పార్టీ చేసుకుంటున్నారనే సమాచారంతో 2020 ఆగస్టు 26న ఎన్‌సీబీ అధికారులు దాడులు చేశారు. ఆ పార్టీలో పెద్ద మొత్తంలో డ్రగ్స్ స్వాధీనం చేసుకున్నారు పోలీసులు.
అప్పట్లో ఈ కేసు కన్నడ సినీ ఇండస్ట్రీలో పెను దుమారం రేపింది. అలాగే ఈ కేసులో డ్రగ్స్ సప్లైయర్స్ తోపాటు హీరోయిన్ సంజనా గల్రానీతోపాటు హీరోయిన్ రాగిణి ద్వివేది, నిర్మాత శివప్రకాష్ చిప్పిలను అదుపులోకి తీసుకున్నారు. ఆ తర్వాత ఈ కేసులో చాలా మందిని అరెస్ట్ చేశారు. దాదాపు నాలుగేళ్ల తర్వాత ఈ కేసుపై విచారణ జరిపిన హైకోర్టు సంజనాపై ఉన్న ఎఫ్ఐఆర్ రద్దు చేసింది.
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.