AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Chirunavvutho Movie: వేణు చిరునవ్వుతో మూవీ హీరోయిన్ ఇలా మారిందేంటీ..? ఫోటోస్ వైరల్..

ఇప్పటికీ ఈ మూవీలోని సాంగ్స్ ఎక్కడో ఒక చోట వినిపిస్తూనే ఉన్నాయి. ఈ సినిమాలో వేణు సరసన షహీన్ ఖాన్ హీరోయిన్ గా నటించగా.. సీనియర్ హీరోయిన్ ప్రేమ, ప్రకాష్ రాజ్ కీలకపాత్రలు పోషించారు. ఈ మూవీలో నటించిన ప్రతి ఒక్కరు ఇప్పటికీ ఇండస్ట్రీలో కొనసాగుతుండగా.. కథానాయికగా కనిపించిన షహీన్ ఖాన్ మాత్రం సినిమాలకు దూరంగా ఉండిపోయారు. చిరునవ్వుతో సినిమా తర్వాత ఈ బ్యూటీ తెలుగులో అంతగా అవకాశాలు అందుకోలేకపోయింది.

Chirunavvutho Movie: వేణు చిరునవ్వుతో మూవీ హీరోయిన్ ఇలా మారిందేంటీ..? ఫోటోస్ వైరల్..
Chirunavvutho
Rajitha Chanti
|

Updated on: Jun 25, 2024 | 1:22 PM

Share

డైరెక్టర్ త్రివిక్రమ్ శ్రీనివాస్ మాటలు అందించిన చిత్రాల్లో చిరునవ్వుతో ఒకటి. హీరో వేణు తొట్టెంపూడి కెరీర్‏లో వన్ ఆఫ్ ది హిట్ మూవీగా నిలిచిన ఈ సినిమా 2000లో విడుదలై మంచి విజయం సాధించింది. ఈ చిత్రానికి జీ.రాంప్రసాద్ దర్శకత్వం వహించగా.. త్రివిక్రమ అందించిన డైలాగ్స్ మూవీకి హైలెట్ అయ్యాయి. ఇక ఈ సినిమా మ్యూజికల్ హిట్ గా నిలిచింది. ఇప్పటికీ ఈ మూవీలోని సాంగ్స్ ఎక్కడో ఒక చోట వినిపిస్తూనే ఉన్నాయి. ఈ సినిమాలో వేణు సరసన షహీన్ ఖాన్ హీరోయిన్ గా నటించగా.. సీనియర్ హీరోయిన్ ప్రేమ, ప్రకాష్ రాజ్ కీలకపాత్రలు పోషించారు. ఈ మూవీలో నటించిన ప్రతి ఒక్కరు ఇప్పటికీ ఇండస్ట్రీలో కొనసాగుతుండగా.. కథానాయికగా కనిపించిన షహీన్ ఖాన్ మాత్రం సినిమాలకు దూరంగా ఉండిపోయారు. చిరునవ్వుతో సినిమా తర్వాత ఈ బ్యూటీ తెలుగులో అంతగా అవకాశాలు అందుకోలేకపోయింది.

మోడల్ గా కెరీర్ ప్రారంభించిన షహిన్.. వేణు సరసన చిరునవ్వు సినిమాతో తెలుగు తెరకు పరిచమయైంది. ఇక ఇదే సినిమాను తెలుగుతోపాటు కన్నడ, తమిళంలో రీమేక్ చేయగా.. అందులోనూ షహీన్ ఖాన్ నటించింది. చిరునవ్వుతో సినిమాతో మంచి క్రేజ్ సంపాదించుకున్న షహీన్ ఖాన్ ఆ తర్వాత మాత్రం ఆఫర్స్ రాలేదు. కేవలం మూడు సినిమాల్లోనే నటించింది. తెలుగు, తమిళం, కన్నడ భాషలలో ఒక్కో సినిమా చేసిన షహీన్ ఆ తర్వాత ఆఫర్స్ రాకపోవడంతో సినిమాలకు గుడ్ బై చెప్పేసింది.

చిరునవ్వు కాకుండా డార్లింగ్ డార్లింగ్ సినిమాలో నటించింది. కానీ ఈ సినిమాతో అంతగా గుర్తింపు రాలేదు. సినిమాలకు దూరమైన షహీన్ ఓ వ్యాపారవేత్తను పెళ్లి చేసుకుని సెటిల్ అయ్యింది. చాలా కాలం తర్వాత షహీన్ సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ అయ్యింది. ఫ్యామిలీతో ఉన్న ఫోటోస్ షేర్ చేస్తూ ఫాలోవర్లను ఆకట్టుకుంటుంది. అయితే అప్పటికీ, ఇప్పటికీ షహీన్ ఏమాత్రం మారలేదు. ఈ బ్యూటీ లేటేస్ట్ ఫోటోస్ చూసి ఆశ్చర్యపోతున్నారు ఫ్యాన్స్.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Follow Us
ఎల్బీనగర్ పోలీస్ స్టేషన్‌లో ఉరేసుకొని కానిస్టేబుల్ ఆత్మహత్య!
ఎల్బీనగర్ పోలీస్ స్టేషన్‌లో ఉరేసుకొని కానిస్టేబుల్ ఆత్మహత్య!
మనం కట్టిన ప్రీమియం డబ్బులతో ఎల్‌ఐసీ ఏం చేస్తుందో తెలుసా..?
మనం కట్టిన ప్రీమియం డబ్బులతో ఎల్‌ఐసీ ఏం చేస్తుందో తెలుసా..?
డీమార్ట్‌లో కొనడం కాదు.. మీ వస్తువులను అమ్మడం ఎలాగో తెలుసా..?
డీమార్ట్‌లో కొనడం కాదు.. మీ వస్తువులను అమ్మడం ఎలాగో తెలుసా..?
హైదరాబాద్‌లో ట్రంప్ టవర్స్.. ఎన్ని వేల కోట్లతో నిర్మిస్తున్నారంటే
హైదరాబాద్‌లో ట్రంప్ టవర్స్.. ఎన్ని వేల కోట్లతో నిర్మిస్తున్నారంటే
తొలి టెస్టుతోనే కెరీర్ క్లోజ్.. ఈ 5గురి స్టోరీ తెలిస్తే షాకే..!
తొలి టెస్టుతోనే కెరీర్ క్లోజ్.. ఈ 5గురి స్టోరీ తెలిస్తే షాకే..!
సూర్యగ్రహణం సమయంలో ఈ పనులు చేయొద్దు.. గ్రహణం తర్వాత తప్పక ఇలా..
సూర్యగ్రహణం సమయంలో ఈ పనులు చేయొద్దు.. గ్రహణం తర్వాత తప్పక ఇలా..
బుక్ చేసిన 45 గంటల్లోనే ఇంటికి గ్యాస్ సిలిండర్.. సేవలు ప్రారంభం
బుక్ చేసిన 45 గంటల్లోనే ఇంటికి గ్యాస్ సిలిండర్.. సేవలు ప్రారంభం
కూతురిపై అఘాయిత్యానికి తల్లి సపోర్ట్..!
కూతురిపై అఘాయిత్యానికి తల్లి సపోర్ట్..!
బంగాళాఖాతంలో మరో అల్పపీడనం.. ఏ ఏ జిల్లాల్లో వర్షాలు కురుస్తాయంటే?
బంగాళాఖాతంలో మరో అల్పపీడనం.. ఏ ఏ జిల్లాల్లో వర్షాలు కురుస్తాయంటే?
చుక్కల అమావాస్య.. ఈరోజు ఒక్క దీపం వెలిగిస్తే ఇంట్లో చీకట్లు తొలగి
చుక్కల అమావాస్య.. ఈరోజు ఒక్క దీపం వెలిగిస్తే ఇంట్లో చీకట్లు తొలగి