Bigg Boss : బిగ్‌బాస్ వల్లే నా కెరీర్ నాశనమైంది.. సినిమా అవకాశాలు రావడం లేదు.. టాలీవుడ్ నటి..
ప్రస్తుతం బిగ్‌బాస్ సీజన్ 9 బుల్లితెర ప్రేక్షకులను అలరిస్తుంది. ఇప్పుడు ఈ షో గ్రాండ్ ఫినాలే మరికొన్ని రోజుల్లో జరగనుంది. మరోవైపు ఇప్పటికే ఈ షోలో పాల్గొన్న మాజీ కంటెస్టెంట్స్ బిగ్‌బాస్ పై సంచలన కామెంట్స్ చేస్తున్నారు. తాజాగా ఓ టాలీవుడ్ నటి బిగ్‌బాస్ షో గురించి సంచలన కామెంట్స్ చేసింది. ఈ షో వల్లే తన కెరీర్ నాశనమైందని అన్నారు.

బుల్లితెరపై అతిపెద్ద రియాల్టీ షో బిగ్‌బాస్ షో. తెలుగులో ఇప్పటికే 8 సీజన్స్ విజయవంతంగా పూర్తికాగా.. ఇప్పుడు సీజన్ 9 రన్ అవుతుంది. ఈ సీజన్ సైతం మరికొన్ని రోజుల్లో ముగియనుంది. ప్రస్తుతం సుమన్ శెట్టి, భరణి, సంజన, తనూజ, కళ్యాణ్ పడాల, డీమాన్ పవన్, ఇమ్మాన్యుయేల్ హౌస్ లో ఉన్నారు. వీరిలో ఈ సీజన్ టైటిల్ విజేత ఎవరనేది మరికొన్ని రోజుల్లో తెలియనుంది. అయితే బిగ్‌బాస్ షో ఛాన్స్ కోసం సెలబ్రెటీలు ఎంత ఆసక్తిగా ఎదురుచూస్తుంటారో చెప్పక్కర్లేదు. మరోవైపు ఈ షోపై ఎన్నో విమర్శలు వస్తుంటాయి. నిజానికి ఈ షోలో పాల్గొన్న పలువురు కంటెస్టెంట్స్ ఇప్పుడు బిగ్‌బాస్ పై సంచలన కామెంట్స్ చేస్తున్నారు. ఒకప్పుడు హౌస్ లో కొన్ని వారాలు ఉన్నవారు ఈ షో గురించి పలు విషయాలు పంచుకుంటున్నారు. తాజాగా ఈ షో గురించి షాకింగ్ కామెంట్స్ చేసింది టాలీవుడ్ నటి. ఆమె మరెవరో కాదు కరాటే కల్యాణి.
ఇవి కూడా చదవండి : Tollywood : ఒకప్పుడు కుర్రాళ్ల డ్రీమ్ గర్ల్.. ఇప్పటికీ సినిమాల్లో బిజీ.. 52 ఏళ్ల వయసులో ఒంటరిగా..
కరాటే కల్యాణి తెలుగు సినీప్రియులకు ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. చాలా సంవత్సరాలుగా సినిమాల్లో నటిస్తూ ప్రేక్షకులను అలరిస్తుంది. కానీ కొన్నాళ్లుగా ఆమె సినిమాలు తగ్గించేసింది. ఎప్పుడూ ఏదోక వివాదంతో వార్తలలో నిలుస్తుంటుంది. అయితే సినిమాల్లో వచ్చిన పాపులారిటీతో బిగ్ బాస్ హౌస్ లోకి అడుగుపెట్టింది. కానీ తక్కువ సమయంలోనే హౌస్ నుంచి బయటకు వచ్చింది. ఇటీవల ఓ ఇంటర్వ్యూలో పాల్గొ్న్న ఆమె బిగ్‌బాస్ షో కారణంగా తాను ఎంతో నష్టాపోయానని అన్నారు.
ఇవి కూడా చదవండి : Serial Actress : షూటింగ్ కోసం వెళ్తే అసభ్యకరమైన ఫోటో చూపించిన పెద్ద హీరో.. సీరియల్ బ్యూటీ సంచలన కామెంట్స్..
“నేను బిగ్‌బాస్ షోలోకి వెళ్లడం వల్ల జరిగిన లాభం కంటే నష్టమే ఎక్కువ. అక్కడ వచ్చిన దానికంటే రెండింతలు నష్టపోయాను. ఆ షో అగ్రిమెంట్ కారణంగా అన్ని అవకాశాలు తగ్గిపోయాయి. సినిమాలు లేవు, ఛాన్సులు లేవు. అందుకు కారణం నేను బిగ్‌బాస్ షోకు వెళ్లడమే. ఆ షోలోకి వెళ్తే సినిమా అవకాశాలు ఇస్తామన అంటారు. కానీ తర్వాత పట్టించుకోరు. అది చాలా బాధగా అనిపించింది. ఈ షో వల్ల నేను పూర్తిగా ఇండస్ట్రీకి దూరమయ్యాను ” అని అన్నారు. ప్రస్తుతం కరాటే కల్యాణి చేసిన కామెంట్స్ నెట్టింట వైరలవుతున్నాయి.
ఇవి కూడా చదవండి : Bigg Boss : నా బట్టలు నా ఇష్టం.. నాకు నచ్చినట్లు నేనుంటా.. బిగ్‌బాస్ బ్యూటీ సంచలన కామెంట్స్..

Karate Kalyani
ఇవి కూడా చదవండి : Sairat : వాటే ఛేంజ్ అమ్మడు.. బాక్సాఫీస్ సెన్సేషన్.. సైరత్ హీరోయిన్ గుర్తుందా.. ? ఇప్పుడేలా ఉందంటే..








