Serial Actress : ఆ స్టార్ హీరో నా తోడపై చేసి వేసి.. దారుణంగా ప్రవర్తించారు.. హీరోయిన్ సంచలన కామెంట్స్..
సాధారణంగా సినీరంగంలో మహిళలు ఎదుర్కొనే సమస్యల గురించి చెప్పక్కర్లేదు. ఇప్పటికే చాలా మంది హీరోయిన్స్ కెరీర్ తొలినాళ్లల్లో ఎదురైన చేదు అనుభవాలను బయటపెట్టారు. ప్రతిభ ఉన్నప్పటికీ అవకాశాల కోసం ఎన్నో కష్టాలు భరించాలని.. అలాగే విమర్శలతోపాటు క్యాస్టింగ్ కౌచ్ సవాళ్లను సైతం దాటుకుని సక్సెస్ కావాల్సి ఉంటుందని చెప్పుకొచ్చారు.

సినీ పరిశ్రమలో హీరోయిన్స్ ఎన్నో సవాళ్లను ఎదుర్కుంటారు. అందం, టాలెంట్ ఉన్నప్పటికీ ఒక్కో అవకాశం కోసం ఎంతో ఎదురుచూడాల్సి ఉంటుంది. అలాగే వచ్చిన ప్రతి ఛాన్స్ సక్సెస్ కావాలంటే అనేక విమర్శలు, అవమానాలు వస్తుంటాయని అన్నారు. ఇప్పటికే చాలా మంది సినిమా ప్రపంచంలో తమకు ఎదురైన ప్రతి చేదు అనుభవాన్ని బయటపెట్టారు. తాజాగా ఓ సీనియర్ హీరోయిన్ తన కెరీర్ మొదట్లో పడిన కష్టాలను గుర్తుచేసుకున్నారు. ఆమె మరెవరో కాదు.. సీనియర్ నటి పూజిత. తెలుగు, తమిళం భాషలో కలిపి దాదాపు 138కు పైగా సినిమాల్లో నటించారు. తెలుగులో ఇద్దరి పెళ్లాల ముద్దుల మొగుడు సినిమాతో గుర్తింపు తెచ్చుకున్నారు. ఒకప్పుడు వరుస విజయాలతో తనకంటూ మంచి గుర్తింపు తెచ్చుకున్నారు.
ఇవి కూడా చదవండి : Bigg Boss : నా బట్టలు నా ఇష్టం.. నాకు నచ్చినట్లు నేనుంటా.. బిగ్‌బాస్ బ్యూటీ సంచలన కామెంట్స్..
చాలా సంవత్సరాలపాటు సినిమాలకు దూరంగా ఉన్న ఆమె.. ఇప్పుడిప్పుడే బుల్లితెరపైకి ఎంట్రీ ఇచ్చారు. ఇప్పుడు స్మాల్ స్క్రీన్ పై ఓ సీరియల్లో నటిస్తున్నారు. ఈ క్రమంలోనే తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న ఆమె పలు విషయాలు పంచుకున్నారు. ఇండస్ట్రీకి వచ్చిన కొత్తలో ఓ చేదు అనుభవం ఎదురైందని అన్నారు. “ఇండస్ట్రీలోకి వచ్చిన కొత్తలో ఒక పెద్ద హీరో కారులో ఎక్కాను. ఇప్పుడు అతడు లేడు. చనిపోయారు. అందుకే పేరు చెప్పడం ఇష్టం లేదు. కారులో ఆయనతో వెళ్తున్నప్పుడు తొడపై చేయి వేసి గోకడం స్టార్ట్ చేశారు. ఎన్నిసార్లు తీసేసినా మళ్లీ చేశారు. నేను ఆ విషయాన్ని మా నాన్నకు చెప్పాను. ఎలాంటి ప్రశ్నలు వేయకుండా స్నానం చేసి నిద్రపో అన్నాడు. అలా చెప్పడంతో ఇంట్లో వాళ్లంతా షాకయ్యారు. ఆ తర్వాత రోజు మా ఇంటి ముందుకు ఓ కారు వచ్చింది. ఇకపై ఎవరినీ ఆ కారులో ఎక్కించకూడదని మా నాన్న చెప్పారు” అంటూ చెప్పుకొచ్చారు.
ఇవి కూడా చదవండి : Serial Actress : షూటింగ్ కోసం వెళ్తే అసభ్యకరమైన ఫోటో చూపించిన పెద్ద హీరో.. సీరియల్ బ్యూటీ సంచలన కామెంట్స్..
ప్రస్తుతం పూజిత చేసిన కామెంట్స్ నెట్టింట వైరలవున్నాయి. ఇండస్ట్రీలోకి వచ్చే అమ్మాయిలు ఏం జరుగుతుందో తెలియకుండానే వచ్చేస్తారని.. సమస్యలు వచ్చినప్పుడు నిలబడే అవకాశం వాళ్లకు ఉండదని అన్నారు. క్యాస్టింగ్ కౌచ్ గురించి మాట్లాడుతూ మహిళలు ఎంతో జాగ్రత్తగా ఉండాలని సూచించారు. ఇవి కూడా చదవండి : Sairat : వాటే ఛేంజ్ అమ్మడు.. బాక్సాఫీస్ సెన్సేషన్.. సైరత్ హీరోయిన్ గుర్తుందా.. ? ఇప్పుడేలా ఉందంటే..

Actress Poojitha
ఇవి కూడా చదవండి : Tollywood : ఒకప్పుడు కుర్రాళ్ల డ్రీమ్ గర్ల్.. ఇప్పటికీ సినిమాల్లో బిజీ.. 52 ఏళ్ల వయసులో ఒంటరిగా..








