Kantara Movie: దూసుకుపోతోన్న కాంతార.. నాలుగు రోజులకు ఎంత వసూల్ చేసిందంటే
ఈ క్రమంలోనే ఇటీవల ప్రేక్షకుల ముందుకు వచ్చి మంచి విజయాన్ని అందుకున్న సినిమా కాంతార. కన్నడ హీరో రిషబ్ శెట్టి నటించిన ఈ సినిమా మంచి విజయాన్ని సొంతం చేసుకుంది.

ప్రస్తుతం సినిమా ఇండస్ట్రీలో కంటెంట్ ఉన్న సినిమాల హావ నడుస్తోంది. బడ్జెట్ తో పనిలేకుండా కథలో బలం ఉంటే చాలు సినిమాలు మంచి విజయాలను అందుకుంటున్నాయి. ఈ క్రమంలోనే ఇటీవల ప్రేక్షకుల ముందుకు వచ్చి మంచి విజయాన్ని అందుకున్న సినిమా కాంతార. కన్నడ హీరో రిషబ్ శెట్టి నటించిన ఈ సినిమా మంచి విజయాన్ని సొంతం చేసుకుంది. అలాగే ఈ సినిమా విడుదలైన అన్ని భాషల్లోనువు పాజిటివ్ టాక్ ను సొంతం చేసుకుంది. ప్రపంచవ్యాప్తంగా ఉన్న సినిమా అభిమానులను విశేషంగా ఆకట్టుకుంటున్న ఈ చిత్రాన్ని తెలుగులో గీతా ఆర్ట్స్ సంస్థ అనువాదరూపంలో విడుదల చేసింది. ఇక ఈ సినిమానా తెలుగు ప్రేక్షకులను కూడా విపరీతంగా ఆకట్టుకుంది. ఇక ఈ సినిమా ఈ నెల 15న తెలుగుతో పాటు పలు భాషల్లో ప్రేక్షకుల ముందుకు వచ్చింది.
30 కోట్లతో నిర్మితమైన ఈ సినిమా క్రితం నెల 30వ తేదీన కన్నడలో విడుదలై 150 కోట్ల క్లబ్ లోకి చేరిపోయింది. ఇక ఈ సినిమా అన్ని భాషల్లోలానే తెలుగులోనూ మంచి కలెక్షన్స్ ను రాబడుతోంది. ఇక నాలుగు రోజులకు గాను కాంతార సినిమా ఎంత కలెక్ట్ చేసిందంటే..నైజాం 3.57 కోట్లు, సీడెడ్ 1.07 కోట్లు, ఉత్తరాంధ్ర 1.05 కోట్లు, ఈస్ట్ 0.70 కోట్లు, వెస్ట్ 0.42 కోట్లు, గుంటూరు 0.52 కోట్లు, కృష్ణా 0.46 కోట్లు,నెల్లూరు 0.32 కోట్లు, ఏపీ – తెలంగాణ (టోటల్) 8.11కోట్లు, రెస్ట్ ఆఫ్ ఇండియా ,ఓవర్సీస్ 0.13కోట్లు, వరల్డ్ వైడ్ (టోటల్) 8.24 కోట్లు (షేర్) రాబట్టింది కాంతారా సినిమా.
ఈ సినిమా పై మొదటి నుంచి మంచి బజ్ ఉంది. దాంతోనే ఈ సినిమా మొదటి షో నుంచి పాజిటివ్ టాక్ ను సొంతం చేసుకుంది. దాంతోనే ఈ ‘కాంతార’ చిత్రానికి రూ.1.65 కోట్ల థియేట్రికల్ బిజినెస్ జరిగింది. మొదటి రోజే బ్రేక్ ఈవెన్ సాధించిన ఈ మూవీ 4 రోజులు పూర్తయ్యేసరికి రూ.8.24 కోట్ల షేర్ ను రాబట్టింది. రానున్న రోజుల్లో కూడా ఈ సినిమా మంచి కలెక్షన్స్ రాబట్టే అవకాశాలు ఉన్నాయి. మరి ఈ సినిమా ఇంకెన్ని రికాదులు క్రియేట్ చేస్తుందో చూడాలి..
మరిన్ని ఎంటర్టైన్మెంట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.







