AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Rishab Shetty- Rashmika: కాంతార హీరోకు రష్మికకు మధ్య గొడవైందా..? రిషబ్ శెట్టి కామెంట్స్‌కు కారణం అదేనా.?

16కోట్లతో తెరకెక్కిన ఈ సినిమా ఏకంగా400కోట్లకు పైగా వసూల్ చేసింది. ఇక ఈ సినిమాతో ఓవర్ నైట్ లో స్టార్ గా ఎదిగారు రిషబ్ శెట్టి.

Rishab Shetty- Rashmika: కాంతార హీరోకు రష్మికకు మధ్య గొడవైందా..? రిషబ్ శెట్టి కామెంట్స్‌కు కారణం అదేనా.?
Rishab Shetty Rashmika
Rajeev Rayala
|

Updated on: Nov 23, 2022 | 4:15 PM

Share

కాంతార సినిమాతో సాలిడ్ హిట్ అందుకున్నారు కన్నడ హీరో రిషబ్ శెట్టి. చిన్న సినిమాగా వచ్చిన ఈ మూవీ భారీ విజయాన్ని అందుకుంది. అంతే కాదు రికార్డ్ స్థాయిలో కలెక్షన్స్ కూడా వసూల్ చేసింది. 16కోట్లతో తెరకెక్కిన ఈ సినిమా ఏకంగా400కోట్లకు పైగా వసూల్ చేసింది. ఇక ఈ సినిమాతో ఓవర్ నైట్ లో స్టార్ గా ఎదిగారు రిషబ్ శెట్టి. కాంతార సినిమా గురించి ఎంత చెప్పిన తక్కువే.. ముఖ్యంగా ఈ సినిమా క్లైమాక్స్ లో హీరో నటన , మ్యూజిక్ సినిమాకే హైలైట్ అని చెప్పాలి. ఇక ఈ సినిమా ఈ నెల 24న ఓటీటీలో రిలీజ్ కానుంది. ప్రముఖ ఓటీటీ సంస్థ అమెజాన్ ప్రైమ్ లో కాంతార సినిమా స్ట్రీమింగ్ కానుంది. ఇదిలా ఉంటే ఇప్పుడు హీరో రిషబ్ శెట్టికి సంబంధించిన ఓ వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఇటీవల ఓ ఇంటర్వ్యలో రిషబ్ మాట్లాడుతూ షాకింగ్ కామెంట్స్ చేశారు.

రష్మిక, రిషబ్ శెట్టి మధ్య బేధాభిప్రాయాలు ఉన్నాయని టాక్ వినిపిస్తోంది. రిషబ్ శెట్టి తెరకెక్కించిన కిరాక్ పార్టీ సినిమాతోనే రష్మిక మందన్న హీరోయిన్ గా మారింది. ఈ సినిమా తర్వాత రష్మికాకు ఫాలోయింగ్ పెరిగింది. అలాగే కాంతారా సినిమాలో నటించే ఛాన్స్ వచ్చిన రష్మిక నో చెప్పిందని కూడా వార్తలు వినిపిస్తున్నాయి. అయితే తాజాగా జరిగిన ఇంటర్వ్యూలో రిషబ్ శెట్టి మాట్లాడుతూ .. రష్మిక గురించి  మాట్లాడటానికి ఇష్టపడలేదు.

అయితే ఏ హీరోయిన్ తోనైనా సినిమా చేస్తా కానీ ఈ యాటిట్యూడ్ ఉన్న ఆమెతో సినిమా చేయను అంటూ రష్మిక చేసే చేతుల సైగలు చేసి చూపించారు. అయితే రష్మిక పేరు మాత్రం డైరెక్ట్ గా చెప్పలేదు రిషబ్. దాంతో ఈ ఇద్దరి మధ్య గొడవ జరిగిందని అర్ధమవుతుంది. ఇక రష్మిక కన్నడ ఇండస్ట్రీకి దూరం కావడంపై కూడా నెగిటివ్ కామెంట్లు వినిపిస్తున్నాయి.మరి ఈవార్తలు పై రష్మిక ఎలా స్పందిస్తుందో చూడాలి.

ఇవి కూడా చదవండి
Follow Us
భర్తను లేపేసింది.. అండమాన్‌లో లవర్‌తో ఎంజాయ్.. చివరకు..
భర్తను లేపేసింది.. అండమాన్‌లో లవర్‌తో ఎంజాయ్.. చివరకు..
సైకాలజిస్ట్‌ను సంప్రదిస్తే ఇన్సూరెన్స్ కవర్ చేస్తుందా?
సైకాలజిస్ట్‌ను సంప్రదిస్తే ఇన్సూరెన్స్ కవర్ చేస్తుందా?
సాయంత్రం పూట ఇవి గుప్పెడు తింటే చాలు.. పొట్టలో గుడ్ బ్యాక్టీరియా
సాయంత్రం పూట ఇవి గుప్పెడు తింటే చాలు.. పొట్టలో గుడ్ బ్యాక్టీరియా
అతను చాలా లవ్లీ బాయ్.. ఒక్క ఫోటో దిగడానికి చాలా కష్టపడ్డా
అతను చాలా లవ్లీ బాయ్.. ఒక్క ఫోటో దిగడానికి చాలా కష్టపడ్డా
ఇంద్రకీలాద్రిసై నేడు శ్రీగాయత్రీ దేవి అలంకారంలో అమ్మవారి దర్శనం
ఇంద్రకీలాద్రిసై నేడు శ్రీగాయత్రీ దేవి అలంకారంలో అమ్మవారి దర్శనం
పెద్ద మ‌న‌సులు.. ర‌హ‌దారి విస్త‌ర‌ణ‌కు రూ.కోట్ల స్థ‌లం అప్ప‌గింత‌
పెద్ద మ‌న‌సులు.. ర‌హ‌దారి విస్త‌ర‌ణ‌కు రూ.కోట్ల స్థ‌లం అప్ప‌గింత‌
దీపికా పదుకొణె ప్లేస్‌లోకి కుర్రాళ్ల ఫేవరెట్ హీరోయిన్
దీపికా పదుకొణె ప్లేస్‌లోకి కుర్రాళ్ల ఫేవరెట్ హీరోయిన్
రాష్ట్ర ప్రజలకు ఏపీ సర్కార్ అదిరిపోయే గుడ్‌న్యూస్..
రాష్ట్ర ప్రజలకు ఏపీ సర్కార్ అదిరిపోయే గుడ్‌న్యూస్..
సిమెంట్, కాంక్రీట్ రెండూ ఒక్కటేనా? ఈ రెండింటిల్లో ఏది బెటర్..?
సిమెంట్, కాంక్రీట్ రెండూ ఒక్కటేనా? ఈ రెండింటిల్లో ఏది బెటర్..?
APPSC సోషల్‌ వెల్ఫేర్‌ ఆఫీసర్‌ ఉద్యోగాలు.. డిగ్రీ పాసైతే చాలు
APPSC సోషల్‌ వెల్ఫేర్‌ ఆఫీసర్‌ ఉద్యోగాలు.. డిగ్రీ పాసైతే చాలు