Nishad Yusuf: సినీ ఇండస్ట్రీలో విషాదం.. కంగువ ఎడిటర్ కన్నుమూత

కొచ్చిలోని పనంపల్లి నగర్‌లోని ఓ ఫ్లాట్‌లో నిషాద్ యూసుఫ్ శవమై కనిపించాడు. బుధవారం తెల్లవారుజామున 2 గంటల ప్రాంతంలో అతడు శవమై కనిపించాడు.

Nishad Yusuf: సినీ ఇండస్ట్రీలో విషాదం.. కంగువ ఎడిటర్ కన్నుమూత
Nishadh Yusuf
Follow us

|

Updated on: Oct 30, 2024 | 10:09 AM

సినీ ఇండస్ట్రీలో విషాదం నెలకొంది. కంగువ మూవీ ఎడిటర్ నిషాద్ యూసుఫ్ కన్నుమూశారు. ఆయన మరణ వార్తతో సినీ ఇండస్ట్రీలో విషాద ఛాయలు నెలకొన్నాయి. కొచ్చిలోని పనంపల్లి నగర్‌లోని ఓ ఫ్లాట్‌లో నిషాద్ యూసుఫ్ శవమై కనిపించాడు. బుధవారం తెల్లవారుజామున 2 గంటల ప్రాంతంలో అతడు శవమై కనిపించాడు. కాగా నిషాద్ యూసుఫ్ ఆత్మహత్య చేసుకున్నాడని పోలీసులు అనుమానిస్తున్నారు. విషయం తెలుకున్న వెంటనే పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని విచారణ ప్రారంభించారు. నిషాద్ స్వస్థలం హరిపాడు.

మలయాళంలో ఎన్నో సినిమాలకు ఎడిటర్ గా పని చేశాడు నిషాద్ యూసుఫ్. అలాగే సూర్య హీరోగా నటిస్తున్న కంగువ సినిమాకు కూడా నిషాద్ యూసుఫ్ ఎడిటర్ గా చేశారు. ఈ సినిమానే కాదు సూర్య హీరోగా నటిస్తున్న నెక్స్ట్ సినిమాకు కూడా నిషాద్ యూసుఫ్ నే ఎడిటర్ గా పని చేస్తున్నారు.

కాగా నిషాద్ యూసుఫ్ ది ఆత్మహత్యేనా..? అసలు అతను ఆత్మహత్య చేసుకోవాల్సిన అవసరం ఏంటి.? అన్నది తెలియాల్సి ఉంది. కాగా కంగువ ప్రీ రిలీజ్ ఈవెంట్ లో హీరో సూర్య, బాబీ డియోల్ తో నిషాద్ యూసుఫ్ దిగిన సెల్ఫీ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.  తల్లుమల చిత్రానికి ఎడిటింగ్ చేసినందుకు గాను నిషాద్ ఉత్తమ ఎడిటర్‌గా కేరళ రాష్ట్ర చలనచిత్ర అవార్డును కూడా గెలుచుకున్నాడు.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

మతిపోయే థ్రిల్లర్ మూవీ.! శవంతో రొమాన్స్.! ఇదేం అరాచకం..
మతిపోయే థ్రిల్లర్ మూవీ.! శవంతో రొమాన్స్.! ఇదేం అరాచకం..
తప్పుడు కేసులో దొరికి.. చేజేతులారా కెరీర్‌ను నాశనం చేసుకుంది.!
తప్పుడు కేసులో దొరికి.. చేజేతులారా కెరీర్‌ను నాశనం చేసుకుంది.!
నాదే లేట్‌.! అయినా ప్రభాస్‌ అర్థరాత్రి వరకు నా కోసం వెయిట్ చేశాడు
నాదే లేట్‌.! అయినా ప్రభాస్‌ అర్థరాత్రి వరకు నా కోసం వెయిట్ చేశాడు
బంగారం.. ఎప్పుడు కొంటే మంచిది.? పక్క దేశాల ప్రభావం మన దగ్గర కూడా.
బంగారం.. ఎప్పుడు కొంటే మంచిది.? పక్క దేశాల ప్రభావం మన దగ్గర కూడా.
హీరో 100 కోట్ల కల.. నెరవేరితే ఆ తెలుగు ప్రొడ్యూసర్ ఫోటో ఆయన ఇంట్ల
హీరో 100 కోట్ల కల.. నెరవేరితే ఆ తెలుగు ప్రొడ్యూసర్ ఫోటో ఆయన ఇంట్ల
AA చేతిలో చరణ్ గేమ్‌ ఛేంజర్‌ మూవీ.! చెర్రీ కెరియర్ లో హయ్యస్ట్..
AA చేతిలో చరణ్ గేమ్‌ ఛేంజర్‌ మూవీ.! చెర్రీ కెరియర్ లో హయ్యస్ట్..
దర్శన్‌కు బెయిల్‌.! రేణుకా స్వామి తండ్రి షాకింగ్ రియాక్షన్..
దర్శన్‌కు బెయిల్‌.! రేణుకా స్వామి తండ్రి షాకింగ్ రియాక్షన్..
దుల్కర్ సల్మాన్‌పై బాలయ్య జోకులు, ఫన్నీ పంచులు.! వీడియో..
దుల్కర్ సల్మాన్‌పై బాలయ్య జోకులు, ఫన్నీ పంచులు.! వీడియో..
నాగచైతన్య-శోభిత పెళ్లి డేట్ ఫిక్స్| కటౌట్ అదిరింది. ఆల్ ది బెస్ట్
నాగచైతన్య-శోభిత పెళ్లి డేట్ ఫిక్స్| కటౌట్ అదిరింది. ఆల్ ది బెస్ట్
లక్షల దీపాలతో దేదీప్యమానంగా వెలిగిపోతున్న అయోధ్య
లక్షల దీపాలతో దేదీప్యమానంగా వెలిగిపోతున్న అయోధ్య