Taare Zameen Par: తారే జమీన్ పర్ బుడ్డోడు.. ఇప్పుడు హీరోగా వచ్చాడు తెలుసా.!
తారే జమీన్ పర్ సినిమాలో సన్నగా, ఎత్తు పళ్లతో అమాయకంగా కనిపించిన దర్శిల్ ఇప్పుడు హీరో రేంజ్‌కి ఎదిగిపోయాడు. హ్యాండ్సమ్ హీరోగా అచ్చం అబ్బాస్ ను తలపిస్తున్నాడు. ప్రస్తుతం దర్శిల్ హిందీతో పాటు గుజరాతీ భాషల్లో సినిమాలు చేస్తున్నాడు. ఇటీవలే ఈ హ్యాండ్సమ్ హీరో ప్యార్ నాల్ అనే సినిమాలో నటించాడు. ఇక తన సినిమా ప్రమోషన్ల కోసం ఈ మధ్యన పార్టీలు, సినిమా ఈవెంట్లలో ఎక్కువగా కనిపిస్తున్నాడు దర్శిల్.
బాలీవుడ్ మిస్టర్ పర్ఫెక్షనిస్ట్ ఆమిర్ ఖాన్ నటించిన సూపర్ హిట్ సినిమాల్లో తారే జమీన్ పర్ ఒకటి. పిల్లల పెంపకం, చదువు, తల్లిదండ్రుల పాత్ర వంటి అంశాలను ఎంతో హృద్యంగా చూపించారీ సినిమాలో. ఆమీర్ ఖాన్ ఇందులో నటించడంతో పాటు దర్శకత్వ, నిర్మాణ బాధ్యతలను కూడా భుజానకెత్తుకున్నాడు. ఇక ఈ సినిమాలో ఆమిర్ తో పోటీ పడి నటించాదు దర్శిల్ సఫారీ. . ఈ సినిమాలో నటించేటప్పటికి అతనికి పదేళ్లు కూడా నిండలేదు. కానీ తన అమాయక నటనతో అందరి కళ్లల్లో నీళ్లు తెప్పించాడు దర్శిల్.
డైస్లెక్సియాతో బాధపడుతున్న ఓ పిల్లాడి పాత్రలో దర్శిల్ నటనకు విమర్శకుల ప్రశంసలు దక్కాయి. ఈ సినిమా తర్వాత 2010లో బం బం బోలే అనే చిత్రం, అలాగే 2011లో డిస్నీ జోకోమోన్ చిత్రంలో సూపర్ హీరో పాత్రను పోషించాడు. ఇలా పలు సినిమాల్లో చైల్డ్ ఆర్టిస్ట్‌గా నటించి మెప్పించాడు. అలాగే ‘ఝలక్ దిఖ్లాజా’ వంటి డ్యాన్స్ రియాలిటీ షోల్లో సందడి చేశాడు. అలాగే పలు షార్ట్ ఫిల్మ్స్, మ్యూజిక్ వీడియోల్లో సందడి చేశాడు. వీటితో పాటు మిడ్ నైట్ చిల్ర్డన్ అనే మరో సినిమాలో కూడా దర్శిల్ సఫారీ నటించి మెప్పించాడు.
మరిన్ని వీడియోస్ కోసం:
Videos
Viral: అతను 180 మంది పిల్లలకు తండ్రి.! ఒక్క మహిళ కూడా ప్రేమగా ముద్దివ్వలేదట.!
Copper items: రాగి వస్తువులు ధరించడం వల్ల కలిగే లాభాలు తెలిస్తే బంగారం జోలికి పోరు.!
Leaves: ఉద్యోగులకు బంపర్ ఆఫర్.. మనసు బాలేదా? సెలవు తీసుకోండి.!.
క్యాండీ క్రష్‌లో బీహార్ యువకుడి ప్రపంచ రికార్డ్!
పండగ వేళ గుడ్‌న్యూస్.. యూపీఐ ట్రాన్సాక్షన్ ఛార్జీలు వాయిదా?
విదేశీ విద్యార్థులపై ‘ఓపీటీ’ పిడుగు..ఏకంగా 70 వేల డాలర్ల ఫీజు
వామ్మో గాడ్జిల్లా ఎల్‌నినో.. చేదెక్కిన సీతాఫలం!
దసరా పండుగకు టీజీఎస్ఆర్టీసీ బిగ్ ప్లాన్.. ఫ్రీ టికెట్ ఉంటుందా?
భయపడిన యూట్యూబర్ మధుమిత.. ఫ్యామిలీతో పరార్!
బాబోయ్.. వింతపాము...రెండు తలలు, నాలుగు కాళ్లతో

