Kalki 2898 AD: పేరు మార్చుకున్న ప్రభాస్.. కల్కి టైటిల్ కార్డ్స్ లో ఏం వేశారో తెలుసా? ఇకపై అలానే పిలవాలట
సాధారణంగా మన హీరోల ముందు చాలా ట్యాగ్ లుంటాయి. మెగా, పవర్, సూపర్, ఐకాన్ స్టార్ వంటి, మెగా ప్రిన్స్, ఛాలెంజింగ్.. ఇలా చాలానే బిరుదులు ఉంటాయి. ఇటీవలే శర్వానంద్ ఛార్మింగ్ స్టార్ గా కూడా మారిపోయాడు. అంతకు ముందు సుధీర్ బాబు కు నైట్రో స్టార్ అని ట్యాగ్ తగిలించారు.
సాధారణంగా మన హీరోల ముందు చాలా ట్యాగ్ లుంటాయి. మెగా, పవర్, సూపర్, ఐకాన్ స్టార్ వంటి, మెగా ప్రిన్స్, ఛాలెంజింగ్.. ఇలా చాలానే బిరుదులు ఉంటాయి. ఇటీవలే శర్వానంద్ ఛార్మింగ్ స్టార్ గా కూడా మారిపోయాడు. అంతకు ముందు సుధీర్ బాబు కు నైట్రో స్టార్ అని ట్యాగ్ తగిలించారు. అలా పాన్ ఇండియా సూపర్ స్టార్ ప్రభాస్ కు యంగ్ రెబల్ స్టార్ అనే ట్యాగ్ ఉంది. ఇదివరకు ప్రభాస్ సినిమాల్లో కూడా ఇదే పేరు టైటిల్ కార్డ్స్ గా పడేది. అయితే కల్కి 2898 ఏడీ సినిమాలో మాత్రం రెబల్ స్టార్ అని ట్యాగ్ పడలేదు. దీనికి కారణమేంటంటే.. ప్రభాస్ ఇప్పుడు పేరు మార్చుకున్నాడు. ఇకపై ప్రభాస్ ను శ్రీ ప్రభాస్ అని పిలవాలి. కల్కి టైటిల్ కార్డ్స్ లో కూడా శ్రీ ప్రభాస్ అనే వేశారు. ప్రస్తుతం ఈ విషయం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఇక ప్రభాస్ ను అతని అభిమానులు ప్రేమతో డార్లింగ్ అని పిలుస్తారు. మొత్తానికి డార్లింగ్, రెబల్ స్టార్ కాస్తా ఇప్పుడు శ్రీ ప్రభాస్‌గా మారాడు. ఇది కాస్త ఆశ్చర్యకరంగా ఉంది. మరి అభిమానులు ఈ కొత్త ట్యాగ్‌ను ఆమోదిస్తారో లేదో చూడాలి.
ఇక ప్రభాస్ అభిమానులు ఎంతగానో ఎదురుచూస్తోన్న కల్కి 2898 ఏడీ సినిమా గురువారం (జూన్ 27) ప్రేక్షకుల ముందుకు వచ్చింది. నాగ్ అశ్విన్ తెరకెక్కించిన ఈ మైథాలజీ అండ్ సైన్స్ ఫిక్షన్ థ్రిల్లర్ లో బాలీవుడ్ అందాల తార దీపికా పదుకొణె హీరోయిన్ గా నటించింది. అలాగే బాలీవుడ్ బిగ్ బీ అమితాబ్ బచ్చన్, లోక నాయకుడు కమల్ హాసన్, మాళవికా నాయర్, శోభన, దిశా పటానీ, విజయ్ దేవరకొండ, దుల్కర్ సల్మాన్, రామ్ గోపాల్ వర్మ, అన్నాబెన్, బ్రహ్మానందం, రాజేంద్ర ప్రసాద్ తదితరులు ఈ సినిమాలో సందడి చేశారు. వైజయంతీ మూవీస్ బ్యానర్ పై అశ్వినీదత్ భారీ బడ్జెట్ తో అత్యంత ప్రతిష్ఠాత్మకంగా ఈ సినిమాను నిర్మించారు. అందుకు తగ్గట్టే మొదటి షో నుంచే కల్కి సినిమాకు పాజిటివ్ టాక్ వస్తోంది. అప్పుడే ప్రభాస్ అభిమానులు రికార్డుల గురించి మాట్లాడుకుంటున్నారు. ప్రస్తుతం థియేటర్ల వద్ద ఈ సందడి చూస్తుంటే మొదటి రోజు రికార్డుల పరంగా ఆర్ఆర్ఆర్ ను కల్కి సినిమా బీట్ చేస్తుందంటున్నారు ట్రేడ్ నిపుణులు.
E #Kalki2898AD cinema ni hit chesina @PawanKalyan fans ki thanks – uppalapati syamala garu ❤️ pic.twitter.com/YTlFGta3aX
— Bhimavaram PawanKalyan FC™ (@BhimavaramPKFC) June 27, 2024
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.