Nag Ashwin: మంచి మనసు చాటుకున్న కల్కి డైరెక్టర్.. సొంతూరులో పిల్లల చదువుల కోసం ఏం చేశారో తెలుసా?

'కల్కి 2898 ఏడీ' సినిమాతో స్టార్ డైరెక్టర్ల లిస్టులో చేరిపోయాడు నాగ్ అశ్విన్. మొదటి షో నుంచే సూపర్ పాజిటివ్​ టాక్​ సొంతం చేసుకున్న ఈ సినిమా ఏకంగాక.. రూ.1,100 కోట్లకు పైగా వసూళ్లతో బాక్సాఫీస్ వద్ద ప్రభంజంనం సృష్టించింది. జూన్ 27న విడుదలైన ఈ సినిమా ఇప్పటికీ చాలా చాట్ల థియేటర్లలో ఆడుతోంది. కల్కి బ్లాక్ బస్టర్ తో ఫుల్ జోష్ లో ఉన్నారు డైరెక్టర్ నాగ్ అశ్విన్.

Nag Ashwin: మంచి మనసు చాటుకున్న కల్కి డైరెక్టర్.. సొంతూరులో పిల్లల చదువుల కోసం ఏం చేశారో తెలుసా?
Nag Ashwin
Follow us
Basha Shek

|

Updated on: Aug 10, 2024 | 4:39 PM

‘కల్కి 2898 ఏడీ’ సినిమాతో స్టార్ డైరెక్టర్ల లిస్టులో చేరిపోయాడు నాగ్ అశ్విన్. మొదటి షో నుంచే సూపర్ పాజిటివ్​ టాక్​ సొంతం చేసుకున్న ఈ సినిమా ఏకంగాక.. రూ.1,100 కోట్లకు పైగా వసూళ్లతో బాక్సాఫీస్ వద్ద ప్రభంజంనం సృష్టించింది. జూన్ 27న విడుదలైన ఈ సినిమా ఇప్పటికీ చాలా చాట్ల థియేటర్లలో ఆడుతోంది. కల్కి బ్లాక్ బస్టర్ తో ఫుల్ జోష్ లో ఉన్నారు డైరెక్టర్ నాగ్ అశ్విన్. గత కొన్నేళ్లుగా తన సమాయాన్ని ప్రభాస్ సినిమాకే వెచ్చించిన ఆయన ఇప్పుడు కాస్త విరామం తీసుకుంటున్నారు. తన కుటుంబంతో సమయాన్ని గడుపుతున్నారు. అలాగే కొన్ని సామాజిక సేవా కార్యక్రమాల్లోనూ నిమగ్నమవుతున్నారు. తాజాగా తన సొంత గ్రామమైన ఐతోలులోని సర్కారు బడిలో అదనపు గదుల నిర్మాణానికి డైరెక్టర్ ఆర్థిక సాయం అందించారు. తాజాగా నాగ్ అశ్విన్ నాగర్ కర్నూలు జిల్లా తాడూరు మండలంలోని తన సొంతూరు ఐతోలులో పర్యటించారు. అక్కడ ప్రభుత్వ పాఠశాలలో తన సొంత డబ్బులతో నిర్మించిన అదనపు గదులను డైరెక్టర్ ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో నాగ్ అశ్విన్ తో పాటు స్థానిక ఎమ్మెల్యే రాజేశ్, కలెక్టర్ సంతోష్ తదితర ప్రజా ప్రతినిధులు, అధికారులు పాల్గొన్నారు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన ఫొటోలు సామాజిక మాధ్యమాల్లో వైరలవుతున్నాయి.

నాగ్ అశ్విన్ చేసిన పనిని అందరూ మెచ్చుకుంటున్నారు. ప్రభుత్వ పాఠశాల బాగు కోసం డైరెక్టర్ ముందుకు రావడం ప్రశంసనీయమని కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు. నాగీ మరిన్ని సేవా కార్యక్రమాలను చేపట్టాలని కోరుతున్నారు. ఇక కల్కి తర్వాత ప్రభాస్ తోనే కల్కి సీక్వెల్ తీయనున్నాడు నాగ్ అశ్విన్. మొదటి పార్ట్ కు మించి సెకెండ్ పార్ట్ ఉంటుందని, ఇందుకోసం మరిన్ని ప్రపంచాలు సృష్టించనున్నట్లు ఆయన ఇటీవల ఒక ఇంటర్వ్యూలో తెలిపారు. అయితే కల్కి సీక్వెల్ రిలీజ్ ఎప్పుడు ఉంటుందన్నది మాత్రం రివీల్ చేయలేదీ ట్యాలెంటెడ్ డైరెక్టర్.

ఇవి కూడా చదవండి

సొంత డబ్బులతో అదనపు గదుల నిర్మాణం..

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.