Maname OTT: ఎట్టకేలకు ఓటీటీలోకి వచ్చేస్తోన్న శర్వానంద్ మనమే.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే..
విభిన్నమైన చిత్రాలను ఎంచుకుంటూ తెలుగు ప్రేక్షకులకు దగ్గరయ్యాడు శర్వానంద్. హిట్టు, ప్లాపులతో సంబంధం లేకుండా బ్యాక్ టూ బ్యాక్ చిత్రాల్లో నటిస్తూ తనకంటూ మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. ఇటీవల ఈ హీరో ప్రధాన పాత్రలో నటించిన సినిమా మనమే. రొమాంటిక్ కామెడీ డ్రామాగా రూపొందించిన ఈ సినిమాకు శ్రీరామ్ ఆదిత్య దర్శకత్వం వహించారు
విభిన్నమైన చిత్రాలను ఎంచుకుంటూ తెలుగు ప్రేక్షకులకు దగ్గరయ్యాడు శర్వానంద్. హిట్టు, ప్లాపులతో సంబంధం లేకుండా బ్యాక్ టూ బ్యాక్ చిత్రాల్లో నటిస్తూ తనకంటూ మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. ఇటీవల ఈ హీరో ప్రధాన పాత్రలో నటించిన సినిమా మనమే. రొమాంటిక్ కామెడీ డ్రామాగా రూపొందించిన ఈ సినిమాకు శ్రీరామ్ ఆదిత్య దర్శకత్వం వహించారు. ఇందులో శర్వానంద్ సరసన ఉప్పెన ఫేమ్ కృతి శెట్టి కథానాయికగా నటించింది. జూన్ 7న అడియన్స్ ముందుకు వచ్చిన ఈ సినిమా పర్వాలేదనిపించుకుంది. కానీ ఆశించిన స్థాయిలో కలెక్షన్స్ మాత్రం రాబట్టలేకపోయింది. రొటిన్ స్టోరీ అయినా శర్వానంద్, కృతి శెట్టి కెమిస్ట్రీ ప్రేక్షకులకు తెగ నచ్చేసింది. అలాగే ఇందులో వీరిద్దరి యాక్టింగ్ ఆకట్టుకుంది. కేవలం రూ. 15 కోట్లతో తెరకెక్కించిన ఈ సినిమా దాదాపు 22 కోట్ల వరకు వసూళ్లు రాబట్టింది.
ఇక ఇప్పుడు ఎట్టకేలకు ఈ సినిమా ఓటీటీలోకి రాబోతుంది. ప్రముఖ ఓటీటీ ప్లాట్ ఫామ్ అమెజాన్ ప్రైమ్ వీడియోలో ఈ సినిమా ఆగస్ట్ 15 నుంచి స్ట్రీమింగ్ కానున్నట్లు టాక్ వినిపిస్తుంది. త్వరలోనే ఈ విషయాన్ని అమెజాన్ ప్రైమ్ వీడియో అధికారికంగా ప్రకటించనున్నట్లు తెలుస్తోంది. విడుదలైన రెండు నెలల తర్వాత ఈ సినిమా ఓటీటీలోకి రాబోతుంది.
కథ విషయానికి వస్తే.. శర్వానంద్, కృతి శెట్టి పెళ్లి కాకుండానే ఓ బిడ్డకు తల్లిదండ్రులుగా మారతారు. అనుకోని ప్రమాదంలో శర్వానంద్ స్నేహితుడు చనిపోవడంతో అతడి కొడుకును చూసుకునే బాధ్యత శర్వానంద్ పై పడుతుంది. పెళ్లి కాకుండానే బిడ్డకు తల్లిదండ్రులుగా మారడం.. ఆ ప్రయాణంలో శర్వానంద్, కృతి శెట్టి మధ్య ఎలాంటి పరిస్థితులు ఎదురయ్యాయి.. ? చివరకు వారిద్దరి జీవితంలో ఏం జరిగిందనేది సినిమా. ఈ మూవీ ఇప్పుడు అమెజాన్ ప్రైమ్ వీడియోలోకి రాబోతుంది.
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.