Kajal Agarwal: సినిమాల కోసం షాకింగ్ నిర్ణయం తీసుకున్న చందమామ.. కుమారుడి బాగోగులు ఆమెకు!
అమ్మతనాన్ని పూర్తిగా ఆస్వాదించేందుకు సుమారు ఏడాది కాలంగా సినిమాలకు దూరంగా ఉంది కాజల్. ఇక తల్లైన తర్వాత తన పూర్తి సమయాన్ని తన బిడ్డ నీల్ కీచ్లూకే కేటాయించింది.
టాలీవుడ్ చందమామ కాజల్ అగర్వాల్ మళ్లీ సినిమాల్లో బిజీ అయ్యేందుకు ప్రయత్నిస్తోంది. ఈ ఏడాది జూన్ 19న పండంటి మగబిడ్డకు జన్మినిచ్చిన ఈ ముద్దుగుమ్మ త్వరలోనే సినిమా షూట్‌లకు హాజరయ్యేందుకు రెడీ అవుతోంది. కాగా అమ్మతనాన్ని పూర్తిగా ఆస్వాదించేందుకు సుమారు ఏడాది కాలంగా సినిమాలకు దూరంగా ఉంది కాజల్. ఇక తల్లైన తర్వాత తన పూర్తి సమయాన్ని తన బిడ్డ నీల్ కీచ్లూకే కేటాయించింది . ఎప్పటికప్పుడు తన కుమారుడి ఫొటోలు, విశేషాలను సోషల్ మీడియా ద్వారా అభిమానులతో పంచుకుంటోన్న ఈ అందాల తార సినిమాల కోసం ఓ షాకింగ్ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం ఈ బ్యూటీ కమల్ హాసన్, శంకర్ కాంబోలో తెరకెక్కుతున్న ఇండియన్-2 సినిమాలో నటిస్తోంది. ఈ సినిమా షూటింగ్ కోసం చెన్నైలోనే ఎక్కువ సమయం గడపాల్సి వస్తుందట. దీంతో కుమారుడి బాగోగులు, బాధ్యతలను తన చెల్లి నిషా అగర్వాల్‌కు అప్పజెప్పినట్లు పుకార్లు వినిపిస్తున్నాయి. నిషాతో పాటు ఆమె తల్లి కూడా నీల్ కిచ్లూ బాగోగులు చూసుకుంటున్నారని తెలుస్తోంది.
కాగా సినామిక అనే సినిమాలో చివరిసారిగా సిల్వర్‌స్ర్కీన్‌పై కనిపించింది కాజల్. ఈ ఏడాది మార్చి3న ఈ సినిమా విడుదలైంది. ఆ తర్వాత ఆచార్యలో నటించినా కొన్ని కారణాలతో ఆమె సీన్లకు కత్తెర పడింది. దీంతో వెండితెరపై కాజల్‌ను చూసేందుకు ఆమె అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఇందులో భాగంగానే ఇండియాన్ 2 సినిమాను త్వరగా పూర్తి చేయాలని భావిస్తుందట. అదే సమయంలో తన కుమారుడి బాధ్యతలను తన చెల్లికి అప్పగించిందట. ప్రస్తుతానికి ఇండియన్2తో పాటు రెండు తమిళ్ సినిమాలు, మరో హిందీ సినిమాలకు ఈ ముద్దుగుమ్మ కమిటైంది.
మరిన్ని సినిమా వార్తల కోసం క్లిక్ చేయండి..