Sivaji Raja: ‘ముప్ఫై ఏళ్లలో అలాంటోడిని చూడలేదు’.. సీనియర్ నటుడిపై శివాజీరాజా సంచలన కామెంట్స్
కాంట్రవర్సీల్లో ఎప్పుడు దూరకుండా ఆచితూచి మాట్లాడే శివాజీ రాజా.. తాజాగా ఒక నటుడి పై విమర్శలు చేయడం హాట్ టాపిక్ గా మారింది.
క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా రాణిస్తున్న నటులలో తనకంటూ ప్రత్యేకత సంపాదించుకున్న నటుడు శివాజీరాజా. చాలా సినిమాల్లో శివాజీ రాజా క్యరెక్టర్ ఆర్టిస్ట్ గా నటించి మెప్పించారు. అలాగే మా అసౌసియేషన్ ప్రసిడెంట్ గాను పనిచేశారు శివాజీ రాజా. ఈ మధ్య కాలంలో ఆయన అడపాదడపా సినిమాల్లో కనిపిస్తున్నారు. ఇదిలా ఉంటే తాజాగా ఓ ఇంట్రవ్యూలో శివాజీ రాజా మాట్లాడుతూ ఒక నటుడి పై తీవ్రస్థాయిలో విమర్శలు చేశారు. శివాజీ రాజా వివాదాలకు మొదటి నుంచి దూరంగా ఉంటూనే వచ్చారు. కాంట్రవర్సీల్లో ఎప్పుడు దూరకుండా ఆచితూచి మాట్లాడే శివాజీ రాజా.. తాజాగా ఒక నటుడి పై విమర్శలు చేయడం హాట్ టాపిక్ గా మారింది. ఏకంగా అతడి గురించి మాట్లాడుతూ..’ ఒరేయ్ నీలాంటి బొగడా గాళ్ళను చాలామందిని చూశా’ అంటూ ఫైర్ అయ్యారు. ఇంతకు శివాజీ రాజాకు ఎందుకు కోపం వచ్చింది ఆయన ఎవరిని ఉద్దేశించి మాట్లాడారు అంటే..
తాజాగా ఓ యూట్యూబ్ ఛానల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో శివాజీ రాజా మాట్లాడుతూ.. నేను ఎప్పుడు ఇండస్ట్రీలో ఎవరికీ భయపడలేదు.. ఆ అవసరం కూడా నాకు లేదు. తప్పుడు నా కొడుకులు భయపడాలి కానీ, నేనెందుకు భయపడాలి? అని అన్నారు. నన్ను ఇండస్ట్రీలో ఓ మాట అనేవారు లేరు. ఎందుకంటే నేను తప్పు చేయను. షూటింగ్‌కి లేటుగా వెళ్లను. ఇంకొకడి క్యారెక్టర్స్ కొట్టేయ్యను. ఎవరి కాళ్లా వేళ్లా పడను. నాకొచ్చిన క్యారెక్టర్స్ చేస్తా, లేదంటే కామ్‌గా కూర్చుంటా అన్నారు. అయితే తాను ఈ కామెంట్స్ ఒక వ్యక్తిని ఉద్దేశించి అంటున్నానని.. కానీ అతడి పేరు చెప్పానని అన్నారు శివాజీ రాజా.
‘ఈ మాటలు వీడు నా గురించే అన్నాడని వాడికి తెలియాలి. ఒరేయ్ నీలాంటి బొగడా గాళ్ళను చాలామందిని చూశా.. నా బ్యాగ్రౌండ్స్ తెలియకుండా పిచ్చి పిచ్చిగా మాట్లాడుతున్నావ్.. ఎందుకు తిడుతున్నానంటే.. నా మాటలు విని, వీడు నా గురించే అన్నాడని తెలుసుకుంటాడు అన్నారు. ఆ తర్వాత యాంకర్ మీరు తిడుతున్న వ్యక్తి గొప్పవాడా.? ఇండస్ట్రీ వ్యక్తేనా..? అని ప్రశ్నించగా.. ‘వాడంతా గొప్పోడేమీ కాదు.. అందుకే మేటర్ ఇంకా పెద్దది చేయడం లేదు. లైఫ్‌లో చాలామంది వెధవలు ఉంటారు. మన పక్కనే ఉంటూ.. మనం ఓడిపోతే వేరేవాళ్ళ టీమ్‌లో చేరి డ్యాన్స్ చేస్తుంటారు. ఈ ముప్ఫై ఏళ్లలో ఎంతోమంది వెధవలను చూశాను. ఎన్నో డక్కా మొక్కీలు తింటే గాని ఈ స్టేజీకి వస్తాను అని చెప్పుకొచ్చారు శివాజీ రాజా. ఇంతకు ఆయన అంతగా తిట్టిన వ్యక్తి ఎవరు అని నెటిజన్లు ఆలోచిస్తున్నారు.
మరిన్ని ఎంటర్టైన్మెంట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.