AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Alia Bhatt: పండంటి పాపకు జన్మనిచ్చిన ఆలియా.. విషెస్ చెబుతున్న సినీ ప్రముఖులు..

బాలీవుడ్ స్టార్ హీరోయిన్ ఆలియా భట్ పండింటి పాపకు జన్మనిచ్చారు. ఆదివారం ఉదయం భర్త రణబీర్ కపూర్‏తో కలిసి ముంబైలోని ప్రముఖ ఆసుపత్రిలో చేరిన ఆలియా..

Alia Bhatt: పండంటి పాపకు జన్మనిచ్చిన ఆలియా.. విషెస్ చెబుతున్న సినీ ప్రముఖులు..
Alia Bhatt, Ranbir Kapoor
Rajitha Chanti
|

Updated on: Nov 06, 2022 | 1:27 PM

Share

బాలీవుడ్ స్టార్ హీరోయిన్ ఆలియా భట్ పండింటి పాపకు జన్మనిచ్చారు. ఆదివారం ఉదయం భర్త రణబీర్ కపూర్‏తో కలిసి ముంబైలోని ప్రముఖ ఆసుపత్రిలో చేరిన ఆలియా.. మధ్యాహ్నం సమయంలో ఆడపిల్లకు జన్మనిచ్చారు. ప్రస్తుతం తల్లీబిడ్డా ఇద్దరూ క్షేమంగానే ఉన్నారని కపూర్ కుటుంబసభ్యులు తెలిపారు. రణబీర్‏తోపాటు సోనీ రజ్దాన్, నీతూ కపూర్ ఆసుపత్రిలో అలియాతో ఉన్నారు. పాప రాకతో కపూర కుటుంబంలో సందడి వాతావరణం నెలకొంది. మరోవైపు సోషల్ మీడియా వేదికగా సినీ ప్రముఖులు ఆలియా దంపతులకు శుభాకాంక్షలు తెలుపుతున్నారు.

గత కొన్నేళ్లుగా ప్రేమలో ఉన్న అలియా భట్, రణబీర్ కపూర్ ఈ ఏడాది ఏప్రిల్ 14న వివాహ బందంలోకి అడుగుపెట్టారు. ఇరువురి కుటుంబసభ్యులు, సన్నిహితుల సమక్షంలో అంగరంగా వైభవంగా వీరి వివాహం జరిగింది. పెళ్లైన రెండు నెలలకే ప్రెగ్నెన్సీని వెల్లడించింది ఆలియా. గర్భిణీగా ఉన్న సమయంలోనూ షూటింగ్స్, ప్రమోషన్లలో పాల్గోంటూ యాక్టివ్‏గా ఉంది.

ఇవి కూడా చదవండి

ఆలియా చివరగా.. డైరెక్టర్ అయాన్ ముఖర్జీ తరెకెక్కించిన బ్రహ్మాస్త్ర సినిమాలో కనిపించింది. ఇందులో రణబీర్, ఆలియా జంటగా నటించగా.. అమితాబ్, మౌనీరాయ్, అక్కినేని నాగార్జున కీలకపాత్రలలో నటించారు.

Alia

Alia

మరిన్ని ఎంటర్టైన్మెంట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.