RRR: చరణ్ అర్థరాత్రి మా ఇంటి ముందుకు వచ్చాడు.. జూనియర్ ఎన్టీఆర్ కామెంట్స్ వైరల్..
మోస్ట్ అవెయిటెడ్ చిత్రం ఆర్ఆర్ఆర్ (RRR). దర్శకధీరుడు రాజమౌళి తెరెక్కెక్కించిన ఈ మూవీ కోసం దేశవ్యాప్తంగా ప్రేక్షకులు ఆత్రుతగా ఎదురుచూస్తున్నారు..
మోస్ట్ అవెయిటెడ్ చిత్రం ఆర్ఆర్ఆర్ (RRR). దర్శకధీరుడు రాజమౌళి తెరెక్కెక్కించిన ఈ మూవీ కోసం దేశవ్యాప్తంగా ప్రేక్షకులు ఆత్రుతగా ఎదురుచూస్తున్నారు.. మెగా పవర్ స్టార్ రామ్ చరణ్.. యంగ్ టైగర్ ఎన్టీఆర్ కలిసి నటిస్తోన్న ఈ సినిమాపై అంచనాలు భారీగానే ఉన్నాయి. చరిత్రలో ఎన్నడు కలవని ఇద్దరు యోదులను వెండితెరపై స్నేహితులుగా చూపించనున్నాడు జక్కన్న. ఇందులో రామ్ చరణ్ అల్లూరి సీతారామరాజుగా… ఎన్టీఆర్ కోమురం భీమ్ పాత్రలో కనిపించనున్నారు. ఇప్పటికే విడుదలైన ఆర్ఆర్ఆర్ ట్రైలర్.. సాంగ్స్ సోషల్ మీడియాను షేక్ చేశాయి.. ఈ సినిమా మార్చి 25న ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఈ క్రమంలో మూవీ ప్రమోషన్స్ షూరు చేశారు జక్కన్న అండ్ టీం.
ఇందులో భాగంగా తాజాగా డైరెక్టర్ అనిల్ రావిపూడి జక్కన్న.. రామ్ చరణ్, ఎన్టీఆర్లను స్పెషల్ ఇంటర్వ్యూ చేశాడు. ఇందులో చెర్రీ.. తారక్ పలు ఆసక్తికర విషయాలను పంచుకున్నారు… తారక్ మాట్లాడుతూ.. మేమిద్దం మంచి ఫ్రెండ్స్.. భిన్న దృవాలు ఆకర్షిస్తాయి అంటారు కదా.. అలాగే మేము కలిసిపోయాం.. మార్చి 26న నా భార్య లక్ష్మీ ప్రణతి బర్త్ డే. 27న చరణ్ బర్త్ డే. మా ఇద్దరి ఇళ్లు ఒకే చోట ఉంటాయి.. అయితే చాలా మందికి తెలియని విషయమేంటంటే.. 26న అర్ధరాత్రి 12 గంటలయ్యిందంటే.. నేను గేటు దగ్గర ఉండేవాడిని.. చరణ్ కారు రాగానే అందులో ఎక్కెసి వెళ్లిపోయేవాడిని. ప్రణతి ఫోన్ చేసి నా పుట్టినరోజు నువ్వెక్కడున్నావ్ అంటే పన్నెండు దాటింది. నీ బర్త్ డే అయిపోయింది అని చెప్పేవాడిని అంటూ చరణ్ పుట్టినరోజు ఎలా సెలబ్రేట్ చేసుకునేవారో చెప్పుకొచ్చాడు తారక్..
Sukumar: డైరెక్టర్ పై అభిమానాన్ని చాటుకున్న యంగ్ హీరో.. ఏకంగా వరిచేనులో అలా.. సుకుమార్ ఎమోషనల్..
Dulquer Salman: స్టార్ హీరోకు షాకిచ్చిన థియేటర్ ఓనర్స్.. అతని సినిమాలపై నిషేదం.. ఎందుకంటే..