Ghani Trailer: ఈ సోసైటీ గెలిచినవాడి మాటే నమ్ముతుంది.. అదిరిపోయిన ‘గని’ ట్రైలర్..
మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ (Varun Tej) ప్రధాన పాత్రలో నటిస్తోన్న లేటేస్ట్ చిత్రం గని (Ghani). డైరెక్టర్ కిరణ్ కొర్రపాటి దర్శకత్వం వహిస్తున్నా

మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ (Varun Tej) ప్రధాన పాత్రలో నటిస్తోన్న లేటేస్ట్ చిత్రం గని (Ghani). డైరెక్టర్ కిరణ్ కొర్రపాటి దర్శకత్వం వహిస్తున్నా ఈ సినిమాలో వరుణ్ సరసన బాలీవుడ్ బ్యూటీ సాయి మంజ్రేకర్ హీరోయిన్గా నటిస్తోంది. బాక్సింగ్ నేపథ్యంలో రాబోతున్న ఈ మూవీలో వరుణ్ ప్రొఫెషనల్ బాక్సర్‌గా కనిపించనున్నాడు. ఈ చిత్రాన్ని అల్లు అరవింద్ సమర్పణలో సిద్దు , అల్లు బాబీలు సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదలైన పోస్టర్లు, టీజర్లు, పాటలకు అభిమానులు, సినీ ప్రేక్షకుల నుంచి మంచి స్పందన వచ్చింది.ఈ సినిమాను ఏప్రిల్ 8న విడుదల చేయనున్నారు. ఈ క్రమంలో తాజాగా గని ట్రైలర్ రిలీజ్ చేసింది చిత్రయూనిట్.
తాజాగా విడుదలైన ట్రైలర్ యాక్షన్ సీన్స్‌తో హైలెట్ అయ్యాయి. ప్రపంచం చూస్తుంది డాడ్ గెలవాలి.. ఆట గెలవాలంటే నేను గెలవాలి.. ఎందుకంటే ఈ సోసైటీ గెలిచిన వాడి మాటే నమ్ముతుంది.. అంటూ చెప్పే డైలాగ్స్ ఆకట్టుకుంటున్నాయి. ఈ సినిమాలో నదియా.. జగపతిబాబు.. సునీల్ శెట్టి.. ఉపేంద్ర కీలకపాత్రలో నటిస్తున్నారు . సిక్స్ ప్యాక్ లుక్‌లో వరుణ్ అదిరగొట్టాడు. ప్రొఫెషనల్ బాక్సర్ అయ్యేందుకు గని ఎంతగా కష్టపడ్డాడో చూడొచ్చు.. మొత్తానికి తాజాగా విడుదలైన ట్రైలర్‌కు సినిమాపై అంచనాలు పెంచేశారు మేకర్స్.
Here you go, #GhaniTrailer ???https://t.co/pmEAw2J1BB
It’s just a glimpse of the hard work we put in..hope you’ll like it!#Ghani is Coming to Deliver the knockout Punch on 8th April 2022!#GhaniFromApril8th @dir_kiran @MusicThaman @RenaissanceMovi pic.twitter.com/4YNpmgR0TK
— Varun Tej Konidela ? (@IAmVarunTej) March 17, 2022
Sukumar: డైరెక్టర్ పై అభిమానాన్ని చాటుకున్న యంగ్ హీరో.. ఏకంగా వరిచేనులో అలా.. సుకుమార్ ఎమోషనల్..
Dulquer Salman: స్టార్ హీరోకు షాకిచ్చిన థియేటర్ ఓనర్స్.. అతని సినిమాలపై నిషేదం.. ఎందుకంటే..