Jr.NTR: రండి.. నాతో చేతులు కలపండి.. యువతకు ఎన్టీఆర్ పిలుపు.. ప్రత్యేక వీడియో..

డ్రగ్స్ రహిత తెలంగాణ పై యాంటీ నార్కోటిక్ టీంకు సహకరిస్తూ తనవంతు బాధ్యతగా ట్విట్టర్ వేదికగా ప్రత్యేకంగా ఓ వీడియోను విడుదల చేశారు తారక్. దేశ భవిష్యత్తు యువత చేతుల్లోనే ఉందని.. క్షణికమైన ఒత్తిడి, సహచరుల ప్రభావం వల్ల డ్రగ్స్ కు బానిసలు కావొద్దని అన్నారు. డ్రగ్స్ రహతి సమాజం కోసం అందరూ కలిసికట్టుగా పోరాడాలని సూచించారు.

Jr.NTR: రండి.. నాతో చేతులు కలపండి.. యువతకు ఎన్టీఆర్ పిలుపు.. ప్రత్యేక వీడియో..
Jr.ntr
Follow us

|

Updated on: Sep 25, 2024 | 9:43 AM

తాత్కాలిక ఆనందాలు, క్షణకాలపు ఒత్తిడి నుంచి బయటపడేందుకు డ్రగ్స్ బారిన పడి యువత తమ జీవితాలను నాశనం చేసుకోవద్దని అన్నారు యంగ్ టైగర్ ఎన్టీఆర్. ఈ నేపథ్యంలోనే డ్రగ్స్ రహిత సమాజమే లక్ష్యంగా కృషి చేస్తున్న తెలంగాణ ప్రభుత్వానికి యువత సహకరించాలని ఎన్టీఆర్ పిలుపునిచ్చారు. డ్రగ్స్ కు ఆకర్షితులై ఎంతో మంది యువత తమ జీవితాలను నాశనం చేసుకుంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ క్రమంలోనే డ్రగ్స్ రహిత తెలంగాణ పై యాంటీ నార్కోటిక్ టీంకు సహకరిస్తూ తనవంతు బాధ్యతగా ట్విట్టర్ వేదికగా ప్రత్యేకంగా ఓ వీడియోను విడుదల చేశారు తారక్. దేశ భవిష్యత్తు యువత చేతుల్లోనే ఉందని.. క్షణికమైన ఒత్తిడి, సహచరుల ప్రభావం వల్ల డ్రగ్స్ కు బానిసలు కావొద్దని అన్నారు. డ్రగ్స్ రహతి సమాజం కోసం అందరూ కలిసికట్టుగా పోరాడాలని సూచించారు.

“మన దేశ భవిష్యత్తు యువత చేతుల్లోనే ఉంది. కానీ కొంతమంది తాత్కాలిక ఆనందం కోసమో.. క్షణికమైన ఒత్తిడి నుంచి బయటపడడం కోసమే లేదంటే సహచరుల ప్రభావం వల్లనో, స్టైల్ కోసమే.. మాదక ద్రవ్యాలకు ఆకర్షితులు కావడం చాలా బాధాకరం. జీవితం చాలా విలువైనది. రండి నాతో చేతులు కలపండి. డ్రగ్స్ రహిత సమాజమే లక్ష్యంగా కృషి చేస్తోన్న తెలంగాణ ప్రభుత్వ సంకల్పంలో భాగస్వాములు అవ్వండి. రాష్ట్రంలో ఎవరైనా డ్రగ్స్ విక్రయిస్తున్నా.. కొనుగోలు చేస్తున్నా.. వినియోగిస్తున్నా.. వెంటనే యాంటీ నార్కోటిక్స్ బ్యూరోకు సమాచారం అందించండి” అంటూ ఆ వీడియోలో చెప్పుకొచ్చారు ఎన్టీఆర్.

ప్రస్తుతం ఎన్టీఆర్ ప్రధాన పాత్రలలో నటించిన దేవర చిత్రం మరో రెండు రోజుల్లో అడియన్స్ ముందుకు రానుంది. భారీ అంచనాల మధ్య తెరకెక్కించిన ఈ చిత్రాన్ని సెప్టెంబర్ 27న తెలుగుతోపాటు హిందీ, తమిళం, కన్నడ, మలయాళం భాషలలోనూ రిలీజ్ చేయనున్నారు. కొద్ది రోజులుగా దేవర చిత్రయూనిట్ వరుస ఇంటర్వ్యూలలో పాల్గొంటున్నా్రు. ఇందులో జాన్వీ కపూర్, సైఫ్ అలీ ఖాన్ కీలకపాత్రలు పోషిస్తుండగా.. అనిరుధ్ సంగీతం అందిస్తున్నారు. ఈ చిత్రానికి కొరటాల శివ దర్శకత్వం వహిస్తున్నారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.