Harsha sai: యూట్యూబర్ హర్షసాయిపై రేప్ కేసు.. సినీ నటి ఫిర్యాదులో ఏముందంటే..?
ఫేమ్ అండ్ నేమ్ వచ్చినంత మాత్రాన కొమ్ములు వచ్చేస్తాయా? ఇది పబ్లిక్ డొమైన్‌లో ట్రెండింగ్ మ్యాటర్. యూ ట్యూబర్ హర్ష సాయి డర్టీ పిక్చర్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఓ యువతి ఫిర్యాదుతో హర్షసాయిపై రేప్ సహా పలు సెక్షన్ల కింద కేసుఫైలయింది. బాధితురాలి కంప్లైంట్ మేరకు ఎంక్వయిరీ మొదలైంది. మరి అతని వెర్షన్ ఏంటీ? వివాదం వెనుక లింకులేంటి?

రోడ్డపై కరెన్సీ వెదజల్లుతూ.. జనాల్ని పిచ్చోల్ని చేస్తూ ఒక యూట్యూబర్ జైలుకెళ్లాడు. తాజాగా క్రైమ్ ఫ్రేమ్‌లోకి మరొకరు. కరెన్సీ గాల్లోకి వెదజల్లి న్యూసెన్స్ ఒకరిది. సర్‌ప్రైజ్ క్యాష్ గిఫ్ట్‌తో సెన్సేషన్ మరొకరిది. ఇద్దరూ యూట్యూబర్లే. క్రేజీగా ఇంచుమించు ఇద్దరి పేర్లు ఒకటే. క్యాష్‌ను రోడ్లపై వెదజల్లిన హర్ష కటకటాలపాలయ్యాడు. ఇక యూట్యూబర్ కమ్ ఇన్‌ఫ్లూయన్సర్‌గా పాపులార్టీ కొట్టేసి.. పాన్ ఇండియా మూవీలో నటించే స్థాయికి ఎదిగిన హర్షసాయిపై నార్సింగి పీఎస్‌లో రేప్ సహా పలు సెక్షన్ల కింద కేసు నమోదయింది.
పాన్ ఇండియా మూవీలో లీడ్ రోల్ సంగతేమో కానీ..నార్సింగ్ పీఎస్‌లో కంప్లైంట్‌తో హర్ష సాయి డర్టీ పిక్చర్ రోడ్డెక్కిందిప్పుడు. హర్షసాయి తనను పెళ్లి చేసుకుంటానని నమ్మించి మోసం చేశాడని బిగ్ బాస్ ఓటీటీ మాజీ కంటెస్టెంట్ నార్సింగ్ పోలీసులను ఆశ్రయించారు. తన దగ్గర 2 కోట్ల రూపాయిలు తీసుకున్నాడని.. ఇప్పుడు ముఖం చేస్తున్నాడని అడ్వొకేట్‌తో కలిసి నార్సింగి పీఎస్‌లో కంప్లేంట్ చేశారామె. తమ పర్సనల్ ఫోటోలను, వీడియోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తానంటూ బ్లాక్ మెయిల్ చేస్తున్నారని హర్షసాయి, అతని తండ్రి రాధాకృష్ణపై ఆమె ఇచ్చిన ఫిర్యాదు మేరకు 376, 354 సెక్షన్ల కింద కేసు నమోదు చేశామన్నారు రాజేంద్రనగర్ డీసీపీ శ్రీనివాస్. అలాగే ఆధారాలు సమర్పించాలని బాధితురాలికి నోటీస్ ఇచ్చామన్నారు. వైద్య పరీక్షల కోసం బాధితురాల్ని హాస్పిటల్‌కు తరలించారు. సామాన్యులకు ఆర్ధిక సాయం చేస్తూ మానవత్వం పరిమళించే మార్క్ వీడియోలతో యూట్యూబర్‌గా పాపులార్టీ సంపాదించిన హర్షసాయికి అంత డబ్బు ఎక్కడదనే చర్చతో పాటు అక్రమ బెట్టింగ్ యాప్స్‌ను నిర్వహిస్తాడనే ఆరోపణలతో రచ్చ కూడా జరిగింది. ఇక రీసెంట్‌గా ఓ పాన్ ఇండియా మూవీలో లీడ్ రోల్ చేస్తున్నాడు. ఆ మూవీ టీజర్‌ను రిలీజ్ చేశాడు కూడా.
ఇక కంప్లేంట్ కా ఫీచే అసలు కహానీ ఏంటి? వాళ్లిద్దరికి ఎలా పరిచయం? ఎక్కడ? అనే పాయింట్‌పై సోషల్ మీడియాలో ట్రోల్స్ పోటెత్తుతున్నాయి. ఆ ప్రకారంగా సదరు యువతిది మహారాష్ట్ర అని తెలుస్తోంది. సినిమాలపై ఆసక్తితో హైదరాబాద్‌కు వచ్చిన ఆమె ఒకట్రెండు మూవీస్ కూడా చేశారట. ఓ బిగ్ రియాల్టీ షోలో పార్టిసిపేట్ చేసిన ఆమెకు హర్షసాయి బిగ్ డ్రీమ్ ప్రాజెక్ట్‌లోనూ కీలకంగా వ్యవహరించారట. అతగాడి మూవీ సంగతేమో కానీ తెర వెనుక హర్షసాయి మసాలా పిక్చర్ ఖాకీల దరికి చేరింది. అత్యాచారం.. 2 కోట్లు దగా.. ఫోటోస్.. వీడియోస్‌ను అడ్డం పెట్టుకొని బ్లాక్‌మెయిలింగ్..ఇలా యువతి ఇచ్చిన ఫిర్యాదుతో కేసు ఫైలయింది. అయితే ఈ వ్యవహారంపై ఇంకా స్పందించ లేదు హర్షసాయి. బాధితురాలి ఫిర్యాదు మేరకు వైడ్ యాంగిల్‌లో ఎంక్వయిరీ చేస్తున్నారు నార్సింగ్ పోలీసులు.