AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

OTT Movies: ఈవారం ఓటీటీలోకి సూపర్ హిట్ మూవీస్.. మొత్తం 5 సినిమాలు ఎక్కడ చూడొచ్చంటే..

కొన్ని రోజులుగా ఓటీటీలో హారర్, మర్డరీ మిస్టరీస్, సస్పెన్స్ థ్రిల్లర్ మూవీస్ సినీ ప్రియులను ఆకట్టుకుంటున్నాయి. మరోవైపు ఇప్పుడు అడియన్స్ ఎప్పుడెప్పుడా అని ఆసక్తిగా ఎదురుచూస్తున్న సినిమా దేవర. సెప్టెంబర్ 27న ప్రపంచవ్యాప్తంగా విడుదల చేయనున్నారు. కొరటాల శివ, ఎన్టీఆర్ కాంబోలో వస్తోన్న ఈ మూవీపై అంచనాలు భారీగానే ఉన్నాయి. ఈ క్రమంలోనే తాజాగా ఈవారం మరో ఐదు సినిమాలు డిజిటల్ ప్లాట్ ఫామ్ లోకి రాబోతున్నాయి.

OTT Movies: ఈవారం ఓటీటీలోకి సూపర్ హిట్ మూవీస్.. మొత్తం 5 సినిమాలు ఎక్కడ చూడొచ్చంటే..
Ott Movies
Rajitha Chanti
|

Updated on: Sep 25, 2024 | 8:20 AM

Share

ప్రస్తుతం అనేక చిత్రాలు థియేటర్లలో విడుదలైన నెల రోజులకే ఓటీటీలోకి అడుగుపెడుతున్నాయి. లవ్ స్టోరీస్ మాత్రమే కాదు.. డిఫరెంట్ జానర్ సినిమాలు ఓటీటీ ప్రేక్షకులను ఆకట్టుకునేందుకు రాబోతున్నాయి. కొన్ని రోజులుగా ఓటీటీలో హారర్, మర్డరీ మిస్టరీస్, సస్పెన్స్ థ్రిల్లర్ మూవీస్ సినీ ప్రియులను ఆకట్టుకుంటున్నాయి. మరోవైపు ఇప్పుడు అడియన్స్ ఎప్పుడెప్పుడా అని ఆసక్తిగా ఎదురుచూస్తున్న సినిమా దేవర. సెప్టెంబర్ 27న ప్రపంచవ్యాప్తంగా విడుదల చేయనున్నారు. కొరటాల శివ, ఎన్టీఆర్ కాంబోలో వస్తోన్న ఈ మూవీపై అంచనాలు భారీగానే ఉన్నాయి. ఈ క్రమంలోనే తాజాగా ఈవారం మరో ఐదు సినిమాలు డిజిటల్ ప్లాట్ ఫామ్ లోకి రాబోతున్నాయి.

ఈవారం మొత్తం 24 సినిమాలు, వెబ్ సిరీస్ లు ఓటీటీలోకి రానున్నాయి. వాటిలో టాప్ 5 మూవీస్, వెబ్ సిరీస్ పై ఆసక్తి నెలకొంది. న్యాచురల్ స్టార్ నాని, ప్రియాంక అరుళ్ మోహన్ కాంబోలో వచ్చిన చిత్రం సరిపోదా శనివారం. బాక్సాఫీస్ వద్ద మంచి విజయాన్ని అందుకున్న ఈ సినిమా సెప్టెంబర్ 26 నుంచి ప్రముఖ ఓటీటీ ప్లాట్ పామ్ లో స్ట్రీమింగ్ కానుంది.

ఈ సినిమాతోపోటాు తాజా ఖబర్ సీజన్ 2 కూడా రాబోతుంది. భవిష్యత్తును అంచనా వేసే ఓ వ్యక్తి చుట్టూ కథ తిరుగుతుంది. ఇందులో భువన్ బామ్, శ్రియా పిల్గావ్కర్, జెడీ చక్రవర్తి, దేవన్ భోజని, ప్రథమ్ పరాబ్, నిత్యా మాథుర్, శిల్పా శుక్లా కీలకపాత్రలు పోషించారు. ఈ సీజన్ 2 సెప్టెంబర్ 27 నుంచి డిస్నీ ప్లస్ హాస్ట్ లో స్ట్రీమింగ్ కానుంది.

ఇవి కూడా చదవండి

అలాగే శోభితా ధూళిపాళ్ల ప్రధాన పాత్రలో నటించిన లవ్ సితార మూవీ కూడా నేరుగా ఓటీటీలో స్ట్రీమింగ్ కానుంది. సెప్టెంబర్ 27 నుంచి ఈ మూవీ జీ5లో అందుబాటులోకి రానున్నట్లు ఇదివరకే మేకర్స్ ప్రకటించారు. ఈ చిత్రానికి వందనా కటారియా దర్శకత్వం వహించారు. ఈ సినిమానే కాకుండా బాక్సాఫఈస్ వద్ద మంచి విజయాన్ని అందుకున్న వాళ్లై మూవీ కూడా సెప్టెంబర్ 27 నుంచి ప్రముఖ ఓటీటీ ప్లాట్ ఫామ్ హాట్ స్టార్ లో స్ట్రీమింగ్ కానుంది. గతంలో కరణం, మామన్నన్ చిత్రాలకు దర్శకత్వం వహించిన డైరెక్టర్ మారి సెల్వరాజ్ ఈ చిత్రానికి దర్శకత్వం వహించారు. హారర్ థ్రిల్లర్ మూవీ డెమోంటీ కాలనీ 2 సెప్టెంబర్ 27న జీ5 ఓటీటీలో స్ట్రీమింగ్ కానుంది.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Follow Us
IND vs WI: ఇండోర్‌లో టీమిండియాదే విక్టరీ.. సిరీస్‌లో ఆధిక్యం..
IND vs WI: ఇండోర్‌లో టీమిండియాదే విక్టరీ.. సిరీస్‌లో ఆధిక్యం..
రాజు మరణిస్తే సేవకులనూ చంపారు.. పురాతన ఈజిప్టులో మారణకాండ?
రాజు మరణిస్తే సేవకులనూ చంపారు.. పురాతన ఈజిప్టులో మారణకాండ?
టీ20 క్రికెట్ హిస్టరీలోనే తొలి టీంగా వెస్టిండీస్ భారీ రికార్డ్..
టీ20 క్రికెట్ హిస్టరీలోనే తొలి టీంగా వెస్టిండీస్ భారీ రికార్డ్..
కరివేపాకుకు నిజంగా అంత శక్తి ఉందా..
కరివేపాకుకు నిజంగా అంత శక్తి ఉందా..
చిన్న సాయం.. పెద్ద మార్పు! స్కూళ్ల నిర్మాణానికి జాకీ చాన్‌ విరాళం
చిన్న సాయం.. పెద్ద మార్పు! స్కూళ్ల నిర్మాణానికి జాకీ చాన్‌ విరాళం
2027 వన్డే ప్రపంచకప్ గెలవాలంటే ఇదే కీలకం.. సెహ్వాగ్ సూచన
2027 వన్డే ప్రపంచకప్ గెలవాలంటే ఇదే కీలకం.. సెహ్వాగ్ సూచన
ఇంట్లో స్నేక్ ప్లాంట్ పెంచుతున్నారా? ఆరోగ్యం, వాస్తు పరంగా కలిగే
ఇంట్లో స్నేక్ ప్లాంట్ పెంచుతున్నారా? ఆరోగ్యం, వాస్తు పరంగా కలిగే
ఈ ఒక్క ముక్కతో కంటిచూపు, పొట్ట సమస్యలు మాయం..
ఈ ఒక్క ముక్కతో కంటిచూపు, పొట్ట సమస్యలు మాయం..
టీమిండియాలో రీఎంట్రీకి షమీ రెడీ.. విమర్శలకు ఇచ్చిపడేశాడుగా..!
టీమిండియాలో రీఎంట్రీకి షమీ రెడీ.. విమర్శలకు ఇచ్చిపడేశాడుగా..!
భారత్‌లో కొత్త గ్యాస్‌ కనెక్షన్లను ఎందుకు నిలిపివేశారు? కారణమిదే!
భారత్‌లో కొత్త గ్యాస్‌ కనెక్షన్లను ఎందుకు నిలిపివేశారు? కారణమిదే!