AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Hyderabad: న్యూయర్ ఫీవర్.. మీటర్ దాటితే జైలుకే..! వాహనదారులకు మాస్ వార్నింగ్!

న్యూయర్ వేడుకల పేరుతో రోడ్లపై హంగామా సృష్టిస్తూ, హద్దు మీరితే కఠిన చర్యలు తప్పవని వాహనదారులకు హైదరాబాద్ సీపీ వీసీ సజ్జనర్‌ హెచ్చిరకలు జారీ చేశారు. తాగి వాహనాలు నడుపుతూ పట్టుబడితే.. వాహనాన్ని సీజ్‌ చేయడంతో పాటు రూ.10 వేల జరిమానా, ఆరు నెలల జైలు శిక్ష తప్పదన్నారు. కేసు తీవ్రతను బట్టి డ్రైవింగ్‌ లైసెన్స్‌ను శాశ్వతంగా రద్దు చేసేలా రవాణా శాఖకు సిఫార్సు చేస్తామన్నారు

Hyderabad: న్యూయర్ ఫీవర్.. మీటర్ దాటితే జైలుకే..! వాహనదారులకు మాస్ వార్నింగ్!
Drunk Drive Test Hyderabad (1)
Anand T
|

Updated on: Dec 25, 2025 | 11:10 AM

Share

హైదరాబాద్‌లో న్యూయర్ ఫీవర్ స్టార్ట్ అయింది. కొత్త సంవత్సరం వేడుకల సందర్భంగా నగరంలో ఎలాంటి అవాంచనీయ సంఘటనలు చోటుచేసుకోకుండా ఇప్పటి నుంచే చర్యలు చేపట్టారు నగర పోలీసులు. ఈ నేపథ్యంలో నగరవ్యాప్తంగా కీలక కూడళ్లలో డ్రంక్‌ అండ్ డ్రైవ్‌లు ఏర్పాటు చేసి.. పట్టుబడిన వారికి హెచ్చరికలు జారీ చేస్తున్నారు. ఈ నేపథ్యంలో బుధవారం బంజారాహిల్స్‌లోని టీజీ స్టడీ సర్కిల్‌ వద్ద నిర్వహించిన డ్రంకెన్‌ డ్రైవ్‌ తనిఖీలను అర్ధరాత్రి హైదరాబాద్‌ పోలీస్‌ కమిషనర్‌ వీసీ సజ్జనర్‌, ఐపీఎస్ క్షేత్రస్థాయిలో పర్యవేక్షించారు. తనిఖీలు జరుగుతున్న విధానాన్ని, సిబ్బంది పనితీరును పరిశీలించి వారికి పలు సూచనలు చేశారు.

120 ప్రాంతాల్లో తనిఖీలు

డ్రంకెన్‌ డ్రైవ్‌లో పట్టుబడిన వారితో మాట్లాడి.. మద్యం తాగి వాహనాలు నడపడం వల్ల కలిగే అనర్థాలను వారికి వివరించారు. నూతన సంవత్సర వేడుకల నేపథ్యంలో నగరంలో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకోకుండా పటిష్ట చర్యలు చేపట్టినట్లు సీపీ తెలిపారు. డిసెంబరు 31 రాత్రి వరకు నగరవ్యాప్తంగా ‘స్పెషల్‌ ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డ్రైవ్‌’ నిర్వహిస్తున్నట్లు పేర్కొన్నారు. ఏడు ప్లాటూన్ల అదనపు బలగాలతో హైదరాబాద్‌ కమిషనరేట్‌ పరిధిలోని 120 ప్రాంతాల్లో ముమ్మరంగా తనిఖీలు చేపడుతున్నట్లు వెల్లడించారు.

ఇవి కూడా చదవండి

మీటర్ దాటితే జైలుకే

మోతాదుకు మించి మద్యం సేవించి వాహనాలు నడిపితే ఉపేక్షించే ప్రసక్తే లేదని స్పష్టం చేశారు. తనిఖీల్లో పట్టుబడితే వాహనాన్ని సీజ్‌ చేయడంతో పాటు రూ.10 వేల జరిమానా, ఆరు నెలల జైలు శిక్ష తప్పదని హెచ్చరించారు. తీవ్రతను బట్టి డ్రైవింగ్‌ లైసెన్స్‌ను శాశ్వతంగా రద్దు చేసేలా రవాణా శాఖకు సిఫార్సు చేస్తామన్నారు.

వీడియో చూడండి..

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.