Jr NTR: మాటలు రాని అభిమానికి మర్చిపోలేని జ్ఞాపకం.. ఎన్టీఆర్ ఏం చేశారో తెలుసా? వీడియో ఇదిగో
మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఇప్పుడు ఆయనకు ప్రపంచ వ్యాప్తంగా అభిమానులు ఉన్నారు. ఈ నేపథ్యంలో తనను కలిసేందుకు ఎప్పటి నుంచో ఎదురు చూస్తోన్న ఒక అభిమానికి మర్చిపోలేని గిఫ్ట్ ఇచ్చారు తారక్. ఇందుకు సంబంధించిన వీడియో ఇప్పుడు నెట్టింట వైరల్ గా మారింది.

మలయాళం స్టార్ హీరో ఫహద్ ఫాజిల్ నటిస్తోన్న లేటెస్ట్ సినిమా డోంట్ ట్రబుల్ ది ట్రబుల్. ఆర్కా మీడియా వర్క్స్, షోయింగ్ బిజినెస్ బ్యానర్ల మీద శోభు యార్లగడ్డ, ప్రసాద్ దేవినేని, ఎస్ఎస్ కార్తికేయ (రాజమౌళి కుమారుడు) నిర్మించిన ఈ చిత్రానికి శశాంక్ ఏలేటి దర్శకత్వం వహించారు. ఇప్పటికే అన్ని హంగులు పూర్తి చేసుకున్న ఈ సినిమా అక్టోబర్ 2న గ్రాండ్ గా రిలీజ్ కానుంది. ఈ నేపథ్యంలో మంగళవారం ( సెప్టెంబర్ 29) హైదరాబాద్‌లో గ్రాండ్ ప్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వహించారు.ఈ వేడుకకు అభిమానులు భారీగా తరలివచ్చారు. దీనికి కారణమేంటో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ విషయం తెలుసుకున్న ఎన్టీఆర్ ఫ్యాన్స్ కూడా మూవీ ఈవెంట్ కు భారీగా తరలివచ్చారు. అందులో మూగ, వినికిడి శక్తి లేని ఓ అభిమాని కూడా ఉన్నాడు. అతను ఎప్పటి నుంచో ఎన్టీఆర్ ను కలవాలని అనుకుంటున్నారు. ఈ విషయం తెలుసుకున్న ఎన్టీఆర్ సదరు అభిమానిని నేరుగా తన క్యారవాన్ లోకి పిలిపించుకున్నారు. ఈ సందర్భంగా ఎన్టీఆర్ అని రాసి ఉన్న టీ షర్ట్ వేసుకు వచ్చిన అభిమానిని దానిని ఎన్టీఆర్ కు చూపించారు. దీనికి మురిసిపోయిన ఎన్టీఆర్ ఆఅభిమానికి మర్చిపోలేని గిఫ్ట్ ఇచ్చారు. అదేంటంటే.. ఇటీవల డ్రాగన్ షూటింగ్ లో గాయపడిన ఎన్టీఆర్ చేతికి ఆపరేషన్ చేయించుకున్న సంగతి తెలిసిందే. ఇప్పుడు చేతికి సపోర్టుగా బెల్ట్ పౌచ్ ను కూడా ధరిస్తున్నారు తారక్. అయితే అభిమాని ఎన్టీఆర్ ని హగ్ చేసుకుందామని అడగ్గా వెంటనే తన చేతికి ఉన్న ఆ బెల్ట్ పౌచ్ తీసేశారు ఎన్టీఆర్. సదరు అభిమానిని దగ్గరకు తీసుకుని హగ్ ఇచ్చారు.
ఎన్టీఆర్ అభిమానికి సంబంధించిన వీడియో ఇప్పుడు నెట్టింట వైరల్ గా మారింది. దీనిని చూసిన నెటిజన్లు ఎన్టీఆర్ పై ప్రశంసలు కురిపిస్తున్నారు. ఎన్టీఆర్ గోల్డ్ అహే.. మా అన్న మంచి మనసు’ అంటూ మ్యాన్ ఆఫ్ మాసెస్ కు కాంప్లిమెంట్స్ ఇస్తున్నారు. ఇక సినిమాల విషయానికి వస్తే.. ప్రస్తుతం డ్రాగన్ సినిమా చేస్తున్నారు ఎన్టీఆర్. కేజీఎఫ్, సలార్ సినిమాలతో పాన్ ఇండియా రేంజ్ లో ఫేమస్ అయిన కన్నడ దర్శకుడు ప్రశాంత్ నీల్ ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు. హై ఓల్టేజ్ యాక్షన్ ఎంటర్ టైనర్ గా రూపొందుతోన్న ఈ సినిమాలో లేటెస్ట్ సెన్సేషన్ రుక్మిణీ వసంత్ హీరోయిన్ గా నటిస్తోంది. అలాగే నేషనల్ క్రష్ రష్మిక మందన్నా కూడా నటిస్తోందని ప్రచారం జరుగుతోంది.
వీడియో ఇదిగో..
Tarak met the same ardent fan who was seen at the #Devara re release ❤️
The fan is deaf and mute, and @tarak9999 personally met him yesterday at the #DontTroubleTheTrouble Pre Release Event, making the moment truly special for him 🥹❤️#NTR pic.twitter.com/kPy5yTFMwY
— Milagro Movies (@MilagroMovies) September 30, 2026
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.




