AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Jr NTR: ఎన్టీఆర్ సోషల్ మీడియాలో ఫాలో అయ్యే ఒకే ఒక్క పర్సన్ ఎవరో తెల్సా..?

మ్యాన్ ఆఫ్ మాసెస్, స్టార్ హీరో జూనియర్ ఎన్టీఆర్ నేడు (మే 20) తన 41వ పుట్టిన రోజు జరుపుకుంటున్నారు. యాక్టింగ్, యాక్షన్, డ్యాన్స్, డైలాగ్ డెలివరీ, ఫైట్స్... ఇలా అన్ని విషయాల్లోనూ తనదైన ముద్ర వేసి దేశంలో ఒకానొక గొప్ప నటుడిగా ఎన్టీఆర్ పేరు తెచ్చుకున్నారు. అయితే ఎన్టీఆర్ సోషల్ మీడియాలో ఫాలో అయ్యే ఒకే ఒక వ్యక్తి ఎవరో తెల్సా..?

Jr NTR: ఎన్టీఆర్ సోషల్ మీడియాలో ఫాలో అయ్యే ఒకే ఒక్క పర్సన్ ఎవరో తెల్సా..?
Jr NTR
Ram Naramaneni
|

Updated on: May 20, 2024 | 1:01 PM

Share

యంగ్ టైగర్ ఎన్టీఆర్.. తెలుగు తెరపై తిరుగులేని నటుడు.. ఇంకా చెప్పాలంటే.. ఇండియాలోనే ఫైనెస్ట్ యాక్టర్. పాత్ర ఏదైనా ప్రాణం పెట్టడం ఎన్టీఆర్‌కు వెన్నతో పెట్టిన విద్య. తాత నుంచి వారసత్వాన్ని పుణికి పుచ్చుకుని.. జనాల చేత జైజేలు కొట్టించుకుంటున్నాడు ఈ చిన్న ఎన్టీఆర్. ఈ రోజు ఎన్టీఆర్. దీంతో ఫ్యాన్స్ సంబరాలు చేసుకుంటున్నారు. రక్తదానం, అన్నదానం వంటి కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. ఇక ట్విట్టర్ అయితే ఎన్టీఆర్ పోస్టులతో మారుమోగిపోతుంది. చరణ్, బన్నీ లాంటి అగ్రతారలు తారక్‌కు సోషల్ మీడియా వేదికగా విషెస్ చెప్పారు. ఇక కొరటాల శివ దర్శకత్వంలో తారక్ నటిస్తోన్న దేవర సినిమా.. అక్టోబర్ 10న విడుదల కానుంది.  ఈ సినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి. ఇకపోతే ఎన్టీఆర్ సోషల్ మీడియాను పెద్దగా యూజ్ చేయరు. అయినప్పటికీ.. అతన్ని ఫాలో అయ్యేవాళ్ల సంఖ్య మిలియన్లలో ఉంటుంది. తారక్‌కు ఇన్ స్టాలో 7.4 మిలియన్ల మంది ఫాలోవర్స్ ఉన్నారు. కానీ తారక్ ఎవరన్నీ ఫాలో అవ్వడం లేదు.

ఇక ఫేస్‌బుక్ విషయానికి వస్తే… ఎన్టీఆర్‌ను 6.3 మిలియన్ల మంది ఫాలో అవుతనన్నారు. ఫేస్‌బుక్‌లో మాత్రం తారక్  రెండు ఖాతాలను అనుసరిస్తున్నారు. ఎవర్ని అనేది మీకు తెల్సా..? ఆ ఖాతాల్లో ఒకటి దర్శకధీరుడు రాజమౌళిది కాగా.. మరొకటి… ఎన్టీఆర్ ఆర్ట్స్ ప్రొడక్షన్ బ్యానర్. ఇక ట్విటర్‌లో కూడా తారక్‌కు 7.4 మిలియన్ల మంది ఫాలోవర్స్ ఉన్నారు. ట్విటర్‌లో సైతం తారక్ రాజమౌళి ఒక్కడిని మాత్రమే అనుసరిస్తున్నారు.

ఇక తదుపరి సినిమాల విషయానికి వస్తే.. వార్ 2తో బాలీవుడ్‍లోనూ ఎన్టీఆర్ ఎంట్రీ ఇస్తున్నారు. ఈ మూవీలో హృతిక్ రోషన్‍‍తో ఢీ కొట్టనున్నారు మన మ్యాన్ ఆఫ్ మాసెస్. ఇక, స్టార్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్‍తో మరో మూవీ చేయనున్నారు తారక్.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

స్టార్ డైరెక్టర్ అయ్యే ప్రయత్నంలో మృత్యు ఒడికి
స్టార్ డైరెక్టర్ అయ్యే ప్రయత్నంలో మృత్యు ఒడికి
అందాల నాట్య మయూరి.. ఈ స్టార్ హీరో ఎవరో గుర్తుపట్టారా.. ?
అందాల నాట్య మయూరి.. ఈ స్టార్ హీరో ఎవరో గుర్తుపట్టారా.. ?
కడుపునొప్పి వచ్చిందని ఇంజెక్షన్ ఇచ్చిన ఆర్ఎంపీ.. కట్ చేస్తే..
కడుపునొప్పి వచ్చిందని ఇంజెక్షన్ ఇచ్చిన ఆర్ఎంపీ.. కట్ చేస్తే..
ఇదెక్కడి ట్విస్ట్ భయ్యా.. బిగ్‏బాస్ ఓటింగ్ దెబ్బకు గల్లంతు..
ఇదెక్కడి ట్విస్ట్ భయ్యా.. బిగ్‏బాస్ ఓటింగ్ దెబ్బకు గల్లంతు..
పట్ట పగలు నడి రోడ్డుపై దారుణ హత్య.. బైక్ తగిలిందని గ్యాంగ్‌వార్‌!
పట్ట పగలు నడి రోడ్డుపై దారుణ హత్య.. బైక్ తగిలిందని గ్యాంగ్‌వార్‌!
సెలబ్రెటీల అడ్డాలో ఏకంగా రూ. 10 కోట్లతో పృథ్వీ షా డ్రీమ్ హౌస్
సెలబ్రెటీల అడ్డాలో ఏకంగా రూ. 10 కోట్లతో పృథ్వీ షా డ్రీమ్ హౌస్
హైదరాబాద్‌కు దగ్గర్లో స్వర్గాన్ని తలపించే 100 డెస్టినేషన్లు..
హైదరాబాద్‌కు దగ్గర్లో స్వర్గాన్ని తలపించే 100 డెస్టినేషన్లు..
మరో 2 రోజుల్లో శ్రేష్ఠ 2026 రాత పరీక్ష.. అడ్మిట్‌ కార్డుల లింక్‌
మరో 2 రోజుల్లో శ్రేష్ఠ 2026 రాత పరీక్ష.. అడ్మిట్‌ కార్డుల లింక్‌
శ్రీలంకలో రష్మిక బ్యాచిలరేట్ పార్టీ.. ఫొటోస్ వైరల్
శ్రీలంకలో రష్మిక బ్యాచిలరేట్ పార్టీ.. ఫొటోస్ వైరల్
CCTVలు ఉన్నాయన్న భయమే లేదు.. బంగారు షాపుల్లో చేతివాటం.. చివరకు
CCTVలు ఉన్నాయన్న భయమే లేదు.. బంగారు షాపుల్లో చేతివాటం.. చివరకు