Jr. NTR BirthDay: ఇది క్రేజ్ అంటే.. ఎన్టీఆర్ బర్త్ డే.. దుమ్మురేపిన జపాన్ ఫ్యాన్స్..
మ్యాన్ ఆఫ్ మాసెస్ బర్త్ డే నేడు. ప్రపంచవ్యాప్తంగా ఉన్న తారక్ ఫ్యాన్స్ ఆయన బర్త్ డేను గ్రాండ్ గా సెలబ్రేట్ చేసుకుంటున్నారు. ఆర్ఆర్ఆర్ సినిమా పాన్ ఇండియా హిట్ సాధించడంతో ప్రపంచవ్యాప్తంగా ఎన్టీఆర్ క్రేజ్ మరింత పెరిగింది. నిజానికి పాన్ ఇండియా సినిమాలకంటే ముందే ఎన్టీఆర్ కు ఇతర దేశాల్లోనూ ఫ్యాన్స్ ఉన్నారు. ముఖ్యంగా జపాన్ లో తారక్ కు మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. జపాన్ ఫ్యాన్స్ తారక్ పాటలకు డాన్స్ చేయండం..
తారక్ అంటే మొన్నటివరకు టాలీవుడ్ హీరో మాత్రమే కానీ ఇప్పుడు పాన్ ఇండియా స్టార్.. ఇండియా ఏంటి.. ప్రపంచం మొత్తం ఎన్టీఆర్ కు ఫ్యాన్స్ ఉన్నారు. మ్యాన్ ఆఫ్ మాసెస్ బర్త్ డే నేడు. ప్రపంచవ్యాప్తంగా ఉన్న తారక్ ఫ్యాన్స్ ఆయన బర్త్ డేను గ్రాండ్ గా సెలబ్రేట్ చేసుకుంటున్నారు. ఆర్ఆర్ఆర్ సినిమా పాన్ ఇండియా హిట్ సాధించడంతో ప్రపంచవ్యాప్తంగా ఎన్టీఆర్ క్రేజ్ మరింత పెరిగింది. నిజానికి పాన్ ఇండియా సినిమాలకంటే ముందే ఎన్టీఆర్ కు ఇతర దేశాల్లోనూ ఫ్యాన్స్ ఉన్నారు. ముఖ్యంగా జపాన్ లో తారక్ కు మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. జపాన్ ఫ్యాన్స్ తారక్ పాటలకు డాన్స్ చేయండం.. తారక్ డైలాగ్స్ కు వీడియోలు చేసి సోషల్ మీడియాలో షేర్ చేస్తూ ఉంటారు. ఇక నేడు తారక్ పుట్టిన రోజు.
సోషల్ మీడియా వేదికగా అభిమానులు, సినీ ప్రేముకులు తారక్ కు సోషల్ మీడియా వేదికగా అభినందనలు తెలుపుతున్నారు. ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ తారక్ కు స్పెషల్ విషెస్ తెలిపారు ట్విట్టర్ వేదికగా బర్త్ డే విషెస్ తెలుపుతూ.. హ్యాపీ బర్త్ డే బావా .. ఫీయార్ ఈస్ ఫైర్ అని రాసుకొచ్చాడు. ఈ పోస్ట్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గ మారింది. అలాగే మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కూడా తారక్ కు విషెస్ తెలిపాడు. హ్యాపీ బర్త్ డే మై డియరెస్ట్ తారక్ అని చరణ్ రాసుకొచ్చారు. అలాగే ఆర్ఆర్ఆర్ సినిమాలోని ఫోటోను కూడా షేర్ చేశారు చరణ్.
ఇదిలా ఉంటే సోషల్ మీడియాలో తారక్ ఫ్యాన్స్ సందడి చేస్తున్నారు. తాజాగా ఓ వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది. ఈ వీడియోలో జపాన్ ఫ్యాన్స్ తారక్ బర్త్ డేను సెలబ్రేట్ చేశారు. ఎన్టీఆర్ కటౌట్ ను ఏర్పాటు చేసి తారక్ మేడలో మల వేసి పూలు చల్లుతూ డాన్స్ చేశారు. ఎన్టీఆర్ బృందావనం సినిమాలోని చిన్నదో వైపు పెద్దోవైపు సాంగ్ కు డాన్స్ చేస్తూ ఎన్టీఆర్ కు బర్త్ డే విషెస్ తెలిపారు. ఈ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఈ వీడియోను ఎన్టీఆర్ అభిమానులు తెగ షేర్ చేస్తున్నారు. ఇక ఎన్టీఆర్ కు సోషల్ మీడియాలో విషెస్ తెలుపుతున్నారు.
జపాన్ ఫ్యాన్స్ ఎన్టీఆర్ బర్త్ డే సెలబ్రేషన్స్..
Japan Fan Girl’s Celebrating #JrNTR‘s 41st Birthday Celebrations & Showing Their Love And Affection Towards @tarak9999 Anna ♥️👌👌🥳🤩. #HappyBirthdayNTR #Devara #ManOfMassesNTR #JrNTR #FearSong pic.twitter.com/1LmBtoKu2S
— Sai Mohan ‘NTR’ (@Sai_Mohan_999) May 20, 2024
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.