AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Devara Movie: ఎన్టీఆర్ ఫ్యాన్స్‏కు గుడ్ న్యూస్.. ‘దేవర’ బుకింగ్స్ ఓపెన్.. ఫస్ట్ షో ఎప్పుడంటే..

దివంగత హీరోయిన్ శ్రీదేవి తనయ జాన్వీ కపూర్ ఈ మూవీ కథానాయికగా నటిస్తుంది. ఈ సినిమాతోనే తెలుగు తెరకు పరిచయం కాబోతుంది జాన్వీ. అలాగే ఇందులో బాలీవుడ్ స్టార్ సైఫ్ అలీ ఖాన్ ప్రతినాయకుడిగా కనిపించనున్నాడు. ఇదివరకే విడుదలైన పోస్టర్స్, టీజర్, సాంగ్స్ మూవీపై మరింత హైప్ క్రియేట్ చేశాయి. అలాగే ఆర్ఆర్ఆర్ సినిమా తర్వాత తారక్ నటిస్తున్న సినిమా కావడంతో ఈ మూవీపై అభిమానుల్లో ఓ రేంజ్ అంచనాలు నెలకొన్నాయి.

Devara Movie: ఎన్టీఆర్ ఫ్యాన్స్‏కు గుడ్ న్యూస్.. 'దేవర' బుకింగ్స్ ఓపెన్.. ఫస్ట్ షో ఎప్పుడంటే..
Devara
Rajitha Chanti
|

Updated on: Aug 27, 2024 | 10:57 AM

Share

యంగ్ టైగర్ ఎన్టీఆర్ నటిస్తోన్న దేవర సినిమాపై ఇప్పటికే భారీ అంచనాలు నెలకొన్నాయి. డైరెక్టర్ కొరటాల శివ దర్శకత్వం వహిస్తున్న ఈ మూవీ ఎప్పుడెప్పుడు విడుదలవుతుందా అని ఎంతో ఆసక్తిగా వెయిట్ చేస్తున్నారు తారక్ ఫ్యాన్స్. దివంగత హీరోయిన్ శ్రీదేవి తనయ జాన్వీ కపూర్ ఈ మూవీ కథానాయికగా నటిస్తుంది. ఈ సినిమాతోనే తెలుగు తెరకు పరిచయం కాబోతుంది జాన్వీ. అలాగే ఇందులో బాలీవుడ్ స్టార్ సైఫ్ అలీ ఖాన్ ప్రతినాయకుడిగా కనిపించనున్నాడు. ఇదివరకే విడుదలైన పోస్టర్స్, టీజర్, సాంగ్స్ మూవీపై మరింత హైప్ క్రియేట్ చేశాయి. అలాగే ఆర్ఆర్ఆర్ సినిమా తర్వాత తారక్ నటిస్తున్న సినిమా కావడంతో ఈ మూవీపై అభిమానుల్లో ఓ రేంజ్ అంచనాలు నెలకొన్నాయి. ఇదిలా ఉంటే.. ఈ సినిమాను ప్రపంచవ్యాప్తంగా సెప్టెంబర్ 27న విడుదల చేయనున్నారు. తెలుగుతోపాటు ఇతర భాషలలోనూ ఈ చిత్రాన్ని రిలీజ్ చేయనున్నట్లు ఇదివరకే మేకర్స్ ప్రకటించారు.

ప్రస్తుతం ఈ మూవీ షూటింగ్ జోరుగా సాగుతుంది. తెలుగు రాష్ట్రాల్లో ఈ మూవీ థియేట్రికల్ రైట్స్ ను సితార ఎంటర్టైన్మెంట్స్ నిర్మాత నాగవంశీ కొనుగోలు చేశారు. అటు ఓవర్సిస్ లో హంసిని ఎంటర్టైన్మెంట్స్ దక్కించుకుంది. యూకేలోని పికాడిల్లీ సినీ మల్టీప్లెక్స్ లో దేవర అడ్వాన్స్ బుకింగ్స్ స్టార్ట్ అయ్యాయి. టికెట్స్ దక్కించుకున్న ఫ్యాన్స్.. ఫస్ట్ షో టికెట్స్ ఇవే అంటూ సోషల్ మీడియాలో షేర్ చేస్తున్నారు. ఈక్రమంలోనే తాజాగా ఈ మూవీ బెనిఫిట్ షోకు సంబంధించిన ఓ న్యూస్ ఇప్పుడు నెట్టింట వైరలవుతుంది.

ఇవి కూడా చదవండి

అభిమానుల కోసం సెప్టెంబర్ 27న తెల్లవారుజామున 1.08 గంటలకు బెన్ఫిట్ షో వేసేలా చిత్రయూనిట్ సన్నాహాలు చేస్తుంది. అమెరికాతోపాటు రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ ఒకే సమయంలో బెన్ ఫిట్ షోస్ వేయనున్నారని సమాచారం. ఇందుకు సంబంధించిన విషయాన్ని చిత్రయూనిట్ త్వరలోనే వెల్లడించనుంది.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

దేశంలో అత్యంత సంపన్నుడైన చెఫ్‌ ఇతనే నట..ఆయన ఆస్తుల విలువ తెలిస్తే
దేశంలో అత్యంత సంపన్నుడైన చెఫ్‌ ఇతనే నట..ఆయన ఆస్తుల విలువ తెలిస్తే
వందేభారత్ ప్రయాణీకులకు తీపికబురు.. ఇకపై ఆ స్టేషన్‌లోనూ..
వందేభారత్ ప్రయాణీకులకు తీపికబురు.. ఇకపై ఆ స్టేషన్‌లోనూ..
వెజ్‌లో నాన్‌వెజ్‌ రుచి కావాలంటే..ఈ కూరగాయతో రెట్టింపు బలం,టేస్ట్
వెజ్‌లో నాన్‌వెజ్‌ రుచి కావాలంటే..ఈ కూరగాయతో రెట్టింపు బలం,టేస్ట్
ఎన్నో విమర్శలు వచ్చినా.. వాటిని సరిదిద్ధుకుంటాను.. లోకేష్
ఎన్నో విమర్శలు వచ్చినా.. వాటిని సరిదిద్ధుకుంటాను.. లోకేష్
బ్యాటర్లు వచ్చారు..వెళ్ళారు..అంతే..109 ఓవర్లకే 30 వికెట్లా?
బ్యాటర్లు వచ్చారు..వెళ్ళారు..అంతే..109 ఓవర్లకే 30 వికెట్లా?
రెండు కోట్లు లేవు అన్నవారికి 26 బంతుల్లోనే సమాధానం చెప్పాడు
రెండు కోట్లు లేవు అన్నవారికి 26 బంతుల్లోనే సమాధానం చెప్పాడు
క్రిస్మస్ పర్వదినాన కాలిఫోర్నియాను ముంచెత్తిన వరదలు
క్రిస్మస్ పర్వదినాన కాలిఫోర్నియాను ముంచెత్తిన వరదలు
సీన్ గురించి చెప్పాలని గదిలోకి అలా ప్రవర్తించాడు..
సీన్ గురించి చెప్పాలని గదిలోకి అలా ప్రవర్తించాడు..
ఈజీగా డబ్బులు వస్తాయనుకున్నాడు.. కానీ చివరకు ఇలా బలైపోయాడు..
ఈజీగా డబ్బులు వస్తాయనుకున్నాడు.. కానీ చివరకు ఇలా బలైపోయాడు..
శ్రేయస్ అయ్యర్ రిటర్న్ గిఫ్ట్.. నెట్స్‌లో బ్యాటింగ్ షురూ
శ్రేయస్ అయ్యర్ రిటర్న్ గిఫ్ట్.. నెట్స్‌లో బ్యాటింగ్ షురూ