AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

SJ Surya: హనుమాన్ సినిమాలో ఛాన్స్ మిస్సైన ఎస్‏జే సూర్య.. డైరెక్టర్ ప్రశాంత్ వర్మ ఏమన్నారంటే..

త్వరలోనే హనుమాన్ సినిమాకు సీక్వెల్ తీసుకురానున్నారు. ఈ విషయాన్ని గతంలోనే ప్రకటించగా.. ఎప్పుడెప్పుడు ఈ మూవీ స్టార్ట్ అవుతుందా అని వెయిట్ చేస్తున్నారు అడియన్స్. అలాగే ఈ మూవీలో హనుమాన్ పాత్రలో ఏ స్టార్ హీరో కనిపించనున్నారనే ఆసక్తి నెలకొంది. ఇదిలా ఉంటే.. తాజాగా హనుమాన్ సినిమాకు సంబంధించిన ఓ ఆసక్తికర విషయాన్ని వెల్లడించారు డైరెక్టర్ ప్రశాంత్ వర్మ.

SJ Surya: హనుమాన్ సినిమాలో ఛాన్స్ మిస్సైన ఎస్‏జే సూర్య.. డైరెక్టర్ ప్రశాంత్ వర్మ ఏమన్నారంటే..
Sj Surya
Rajitha Chanti
|

Updated on: Aug 27, 2024 | 10:39 AM

Share

టాలీవుడ్ యంగ్ హీరో తేజా సజ్జా ఈ ఏడాది బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్న సంగతి తెలిసిందే. డైరెక్టర్ ప్రశాంత్ వర్మ దర్శకత్వంలో ఈ హీరో నటించిన హనుమాన్ సినిమా బాక్సాఫీస్ వద్ద కాసుల వర్షాన్ని కురిపించింది. ఎలాంటి అంచనాలు లేకుండా అడియన్స్ ముందుకు వచ్చి భారీ విజయాన్ని అందుకుంది. డైరెక్టర్ ప్రశాంత్ వర్మ మేకింగ్, విజువల్స్, తేజ సజ్జా యాక్టింగ్ ప్రేక్షకులను ఫిదా చేశాయి. తెలుగుతోపాటు మిగతా భాషలలోనూ మంచి రెస్పాన్స్ అందుకుంది ఈ మూవీ. త్వరలోనే హనుమాన్ సినిమాకు సీక్వెల్ తీసుకురానున్నారు. ఈ విషయాన్ని గతంలోనే ప్రకటించగా.. ఎప్పుడెప్పుడు ఈ మూవీ స్టార్ట్ అవుతుందా అని వెయిట్ చేస్తున్నారు అడియన్స్. అలాగే ఈ మూవీలో హనుమాన్ పాత్రలో ఏ స్టార్ హీరో కనిపించనున్నారనే ఆసక్తి నెలకొంది. ఇదిలా ఉంటే.. తాజాగా హనుమాన్ సినిమాకు సంబంధించిన ఓ ఆసక్తికర విషయాన్ని వెల్లడించారు డైరెక్టర్ ప్రశాంత్ వర్మ.

న్యాచురల్ స్టార్ నాని నటిస్తోన్న సరిపోదా శనివారం సినిమా త్వరలో అడియన్స్ ముందుకు రానుంది. ఇందులో ప్రియాంక మోహన్, ఎస్జే సూర్య కీలకపాత్రలు పోషిస్తున్నారు. ఈ క్రమంలో తాజాగా ఈ మూవీ ప్రీ రిలీజ్ వేడుకకు ముఖ్య అతిథిగా వచ్చిన ప్రశాంత్ వర్మ ఆసక్తికర విషయాన్ని పంచుకున్నారు. సరిపోదా శనివారం సినిమా టీంకు శుభాకాంక్షలు తెలిపారు. అలాగే ఇందులో ప్రతినాయకుడి పాత్రలో కనిపించనున్న ఎస్జే సూర్య గురించి మాట్లాడుతూ.. ఆయన అద్భుతమైన దర్శకుడని.. అలాగే అద్భుతమైన నటుడు అని కొనియాడారు. తాను తీసిన హనుమాన్ సినిమాలో ఓ పాత్ర కోసం ఎస్జే సూర్యను అనుకున్నామని.. కానీ ఆయన రెమ్యునరేషన్ దృష్టిలో పెట్టుకుని ఆ నిర్ణయాన్ని విరమించుకున్నట్లు తెలిపారు.

కానీ తర్వాతి చిత్రాల్లో ఆయనతో కలిసి పనిచేయాలనుకుంటున్నాని అన్నారు. అయితే హనుమాన్ సినిమాలో ఏ పాత్రకు ఎస్జే సూర్యను అనుకున్నారో మాత్రం చెప్పలేదు. ఈమూవీలో ప్రతినాయకుడి పాత్రలో వినయ్ రాయ్ పోషించారు. దర్శకుడిగా ఎన్నో హిట్స్ అందుకుని తనదైన ముద్ర వేసిన సూర్య.. కొంతకాలంగా నటుడిగా కొనసాగుతున్నారు. తెలుగు, తమిళంలో అనేక చిత్రాల్లో కీలకపాత్రలు పోషిస్తున్నారు. ఇటీవలే రాయన్ సినిమాతో సూపర్ హిట్ అందుకున్నారు.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Follow Us
మేక పిల్లల కోసం దారుణం.. మాజీ సర్పంచ్ దాడిలో పశువుల కాపరి బలి!
మేక పిల్లల కోసం దారుణం.. మాజీ సర్పంచ్ దాడిలో పశువుల కాపరి బలి!
చూసేందుకు కంటిలో నలుసంత.. కానీ దగ్గు, ఆస్తమాకు చెక్ పెట్టేస్తుంది
చూసేందుకు కంటిలో నలుసంత.. కానీ దగ్గు, ఆస్తమాకు చెక్ పెట్టేస్తుంది
గురు పూర్ణిమ నుంచి మహర్దశ.. ఇక ఈ రాశుల వారికి తిరుగుండదు!
గురు పూర్ణిమ నుంచి మహర్దశ.. ఇక ఈ రాశుల వారికి తిరుగుండదు!
పేపర్ లీక్‌లపై కేంద్రంపై రాహుల్ గాంధీ ఫైర్..!
పేపర్ లీక్‌లపై కేంద్రంపై రాహుల్ గాంధీ ఫైర్..!
స్కూలు అయిపోగానే తాళం వేసి వెళ్లిపోయిన టీచర్‌.. ఆ తర్వాత
స్కూలు అయిపోగానే తాళం వేసి వెళ్లిపోయిన టీచర్‌.. ఆ తర్వాత
అడ్వాన్స్ తీసుకొని సుతారి మేస్త్రీ పనికి రాకుంటే కేసు పెట్టొచ్చా?
అడ్వాన్స్ తీసుకొని సుతారి మేస్త్రీ పనికి రాకుంటే కేసు పెట్టొచ్చా?
ఇకపై బహిరంగ మూత్ర విసర్జన చేశారో.. ఇక మీ పని అవుట్
ఇకపై బహిరంగ మూత్ర విసర్జన చేశారో.. ఇక మీ పని అవుట్
శివాలయంలో అద్భుతం.. నూనెతో అభిషేకం చేస్తే పాలుగా మారి
శివాలయంలో అద్భుతం.. నూనెతో అభిషేకం చేస్తే పాలుగా మారి
800 ఏళ్ల చరిత్ర.. హిందూ-ముస్లిం ఐక్యతకు ప్రతీకగా నిలిచిన ఆలయం..
800 ఏళ్ల చరిత్ర.. హిందూ-ముస్లిం ఐక్యతకు ప్రతీకగా నిలిచిన ఆలయం..
రైల్వే ప్లాట్‌ఫాం టికెట్ ఎన్ని గంటల వరకు చెల్లుబాటు అవుతుంది?
రైల్వే ప్లాట్‌ఫాం టికెట్ ఎన్ని గంటల వరకు చెల్లుబాటు అవుతుంది?