Jawan Trailer: ‘మేం జవాన్లం.. దేశం కోసం వెయ్యిసార్లు ప్రాణాలు పోగొట్టుకుంటాం’.. హాలీవుడ్‌ రేంజ్‌లో షారుక్‌ జవాన్‌ ట్రైలర్‌

'పఠాన్' లాంటి బ్లాక్‌ బస్టర్‌ హిట్‌ తర్వాత బాలీవుడ్ బాద్‌షా షారుఖ్ ఖాన్ నటిస్తోన్న చిత్రం 'జవాన్‌'. స్టైలిష్‌ యాక్షన్‌ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కిన ఈ మూవీలో నయనతార హీరోయిన్‌గా నటించింది. విజయ్‌ సేతుపతి, దీపికా పదుకొణె, ప్రియమణి కీ రోల్స్‌ పోషించారు. ఇప్పటికే అన్నిహంగులు పూర్తి చేసుకున్న జవాన్‌ సినిమా సెప్టెంబర్ 7న వరల్డ్‌ వైడ్‌గా రిలీజ్ కానుంది. దీంతో ప్రమోషన్‌ కార్యక్రమాలను ముమ్మరం చేశారు మేకర్స్‌

Jawan Trailer: 'మేం జవాన్లం.. దేశం కోసం వెయ్యిసార్లు ప్రాణాలు పోగొట్టుకుంటాం'.. హాలీవుడ్‌ రేంజ్‌లో షారుక్‌ జవాన్‌ ట్రైలర్‌
Jawan Movie Trailer
Follow us
Basha Shek

|

Updated on: Aug 31, 2023 | 1:30 PM

‘పఠాన్’ లాంటి బ్లాక్‌ బస్టర్‌ హిట్‌ తర్వాత బాలీవుడ్ బాద్‌షా షారుఖ్ ఖాన్ నటిస్తోన్న చిత్రం ‘జవాన్‌’. స్టైలిష్‌ యాక్షన్‌ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కిన ఈ మూవీలో నయనతార హీరోయిన్‌గా నటించింది. విజయ్‌ సేతుపతి, దీపికా పదుకొణె, ప్రియమణి కీ రోల్స్‌ పోషించారు. ఇప్పటికే అన్నిహంగులు పూర్తి చేసుకున్న జవాన్‌ సినిమా సెప్టెంబర్ 7న వరల్డ్‌ వైడ్‌గా రిలీజ్ కానుంది. దీంతో ప్రమోషన్‌ కార్యక్రమాలను ముమ్మరం చేశారు మేకర్స్‌. ఇటీవల చెన్నై వేదికగా ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌ను గ్రాండ్‌గా నిర్వహించారు. తాజాగా అభిమానులు ఎంతగానో ఎదురుచూస్తోన్న ట్రైలర్‌ను కూడా రిలీజ్‌ చేశారు. హిందీతో పాటు తెలుగు, తమిళ్‌ భాషల్లోనూ ట్రైలర్‌ విడుదలైంది. ‘అన‌గ‌న‌గా ఒక రాజు… ఒక‌దాని త‌ర్వాత ఒక‌టి యుద్ధం ఓడిపోతూనే ఉన్నాడు. దాహంతో, ఆక‌లితో. అతను చాలా కోపంగా ఉన్నాడు’ అనే డైలాగ్‌తో ఎంతో ఆసక్తికరంగా ట్రైలర్‌ ప్రారంభమైంది. ఆతర్వాత షారుక్‌ ముంబైలో ఓ ట్రైన్‌ను హైజాక్‌ చేయడం.. మీకు ఏం కావాలి అన్న ప్రశ్నకు అలియా భట్‌ కావాలి అనడం, అలాగే యోగిబాబు ఎవరండీ.. అతను గోనెసంచిని హెల్మెట్‌లా కట్టుకున్నాడు అని చెప్పిన డైలాగులు కడుపుబ్బా నవ్వించాయి. ఈ మూవీలో పోలీస్‌ ఆఫీసర్‌గా, జవాన్‌గా అలాగే పలు డిఫరెంట్‌ షేడ్స్‌తో కూడిన క్యారెక్టర్స్‌లో కనిపించి ఫ్యాన్స్‌ను అలరించాడు షారుఖ్‌.

ఇక మక్కల్‌ సెల్వన్‌ విజయ్‌ సేతుపతి స్టైలిష్‌ విలన్‌ పాత్రలో కొత్తగా కనిపించాడు. ఆయన లుక్‌ , గెటప్‌ హైలెట్‌గా నిలిచింది. ఇక నయనతార, దీపికా పదుకొణె, ప్రియమణి వంటి అందాల తారలు ఎంతో గ్లామర్‌గా కనిపించారు. ఇక ట్రైలర్‌ చివరిలో ‘మేము జ‌వాన్లం, మా ప్రాణాల‌ను ఒక్క‌సారి కాదు వెయ్యి సార్లు పోగోట్టుకుంటాం.. కానీ అది దేశం కోసమే.. అంటూ షారుఖ్‌ ఖాన్ చెప్పిన డైలాగ్‌ అందరినీ ఆకట్టుకుంది. మొత్తానికి అదిరిపోయే యాక్షన్‌ సీక్వెన్స్‌, హాలీవుడ్ స్థాయి విజువల్స్‌తో ట్రైలర్‌ను కట్‌ చేశారు. ప్రస్తుతం షారుక్‌ సినిమా ట్రైలర్‌ నెట్టింట ట్రెండింగ్‌లో ఉంది. ‘రెడ్‌ చిల్లీస్‌ ఎంటర్‌టైన్‌మెంట్‌’ పై గౌరీఖాన్‌ జవాన్‌ సినిమాను నిర్మించగా అట్లీ దర్శకత్వం వహించారు. అనిరుధ్‌ స్వరాలు సమకూర్చారు.

ఇవి కూడా చదవండి

షారుక్ ఖాన్ జవాన్ ట్రైలర్ తెలుగులో..

View this post on Instagram

A post shared by Shah Rukh Khan (@iamsrk)

రామయ్యా వస్తావయ్యా సాంగ్ చూశారా?

View this post on Instagram

A post shared by Shah Rukh Khan (@iamsrk)

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.