లాక్డౌన్ తర్వాత థియేటర్లలో విడుదలైన జాతి రత్నాలు సినిమా బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్న సంగతి తెలిసిందే. తక్కువ బడ్జెట్‌తో తెరకెక్కించిన ఈ మూవీ నిర్మాతలకు కాసుల వర్షం కురిపించింది. ఈ సినిమా యంగ్ హీరో నవీన్ పోలిశెట్టి కెరీర్లో సూపర్ హిట్‌గా నిలిచింది. ఈ మూవీ తర్వాత నవీన్ పోలిశెట్టికి వరుస ఆఫర్లు తలుపు తట్టాయి. ఇంతటీ బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్న ఈ సినిమాను యంగ్ డైరెక్టర్ అనుదీప్ రూపొందించాడు. తొలి ప్రయత్నంలోనే కామెడీని ఎంచుకునే.. సక్సెస్ అయ్యాడు అనుదీప్. ముఖ్యంగా చాలా కాలం తర్వాత కోవిడ్ పరిస్థితులలోనూ జనాలను థియేటర్లకు రప్పించాడు అనుదీప్. చాలా కాలంగా వినోదానికి దూరమైన ప్రేక్షకులను కడుపుబ్బ నవ్వించడంతో.. అనుదీప్ కెవి క్రేజ్ ఒక్కసారిగా మారిపోయింది. ఈ యంగ్ డైరెక్టర్‌తో సినిమాలు తీసేందుకు నిర్మాతలు క్యూ కడుతున్నారు.
అయితే ఈ సినిమా తర్వాత.. అనుదీప్.. ఎవరితో సినిమా చేయనున్నాడని ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ క్రమంలోనే తమిళ్ హీరో శివకార్తికేయన్ ప్రధాన పాత్రలో ఓ మూవీ చేయబోతున్నట్లుగా వార్తలు వచ్చాయి. ఈ సినిమాను తెలుగు, తమిళ్ భాషల్లో విడుదల చేయనున్నారని వినిపించింది. అయితే ఈ ప్రాజెక్ట్ గురించి ఇప్పటివరకు ఎలాంటి అధికారిక ప్రకటన రాలేదు. తాజాగా అనుదీప్ తదుపరి సినిమా గురించి మరో క్రేజీ అప్డేట్ నెట్టింట్లో చక్కర్లు కొడుతుంది. అనుదీప్.. వెంకటేష్ ప్రధాన పాత్రలో ఓ సినిమా చేయబోతున్నట్లుగా టాక్ వినిపిస్తోంది. ఇందుకోసం వెంకటేష్‌తో చర్చలు జరుగుతున్నట్లుగా తెలుస్తోంది. ఇందుకు వెంకీ గ్రీన్ సిగ్నల్ ఇస్తే… త్వరలోనే ఈ మూవీ పట్టాలెక్కనున్నట్లుగా సమాచారం. అయితే నాగ్ అశ్విన్ కూడా ఈ సినిమాను నిర్మించనున్నట్లుగా తెలుస్తోంది.
Pelli SandaD: సూపర్ స్టార్ చేతుల మీదగా దర్శకేంద్రుడి ‘పెళ్లి సందD’ ట్రైలర్.. రిలీజ్ ఎప్పుడంటే..
Krithi Shetty Birthday : ఆకట్టుకుంటున్న అందాల ముద్దుగుమ్మ కృతిశెట్టి బర్త్ డే స్పెషల్ పోస్టర్స్…