AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Raviteja: ఆ సినిమా సీక్వెల్ చేయడానికి రవితేజ అందుకే దూరంగా ఉంటున్నాడా ? నెట్టింట్లో సరికొత్త గాసిప్స్..

మాస్ మహారాజా రవితేజ... ప్రస్తుతం చేతినిండా సినిమాలతో బిజీగా ఉన్నాడు. చాలా కాలం తర్వాత రవితేజ ఇటీవల క్రాక్ సినిమాతో సూపర్ హిట్

Raviteja: ఆ సినిమా సీక్వెల్ చేయడానికి రవితేజ అందుకే దూరంగా ఉంటున్నాడా ? నెట్టింట్లో సరికొత్త గాసిప్స్..
Raviteja
Rajitha Chanti
|

Updated on: Sep 21, 2021 | 2:43 PM

Share

మాస్ మహారాజా రవితేజ… ప్రస్తుతం చేతినిండా సినిమాలతో బిజీగా ఉన్నాడు. చాలా కాలం తర్వాత రవితేజ ఇటీవల క్రాక్ సినిమాతో సూపర్ హిట్ అందుకున్నాడు. ఈ మూవీ తర్వాత మరోసారి రవితేజ మళ్లీ ఫాంలోకి వచ్చాడు. ప్రస్తుతం ఖిలాడి, రామారావు ఆన్ డ్యూటీ సినిమాలు చేస్తున్నాడు. అలాగే.. నక్కిన త్రినాథరావు దర్శకత్వంలోనూ ఓ సినిమా చేయనున్నాడు. ఇదిలా ఉంటే.. దాదాపు 15 సంవత్సరాల క్రితం సక్సెస్ ఫుల్ డైరెక్టర్ రాజమౌళి దర్శకత్వంలో రవితేజ నటించిన విక్రమార్కుడు సినిమా బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్న సంగతి తెలిసిందే. థియేటర్లలో ఈ మూవీ కాసుల వర్షం కురిపించింది. ఇందులో రవితేజ ద్విపాత్రాభినయం నటనకు ప్రేక్షకులను ఆకట్టుకున్నాడు. ఈ మూవీ స్టోరీని రచయిత విజయేంద్రప్రసాద్ అందించారు.

ఇక డైరక్టర్ యాక్షన్..ఎమోషనల్ సీన్స్ చూపించిన తీరుకు ప్రేక్షకులు ఫిదా అయ్యారు. అలాగే ఈ సినిమాతో అనుష్క శెట్టి సూపర్ హిట్ అందుకుని.. తెలుగులో ప్రత్యేక ఇమేజ్ క్రియేట్ చేసుకుంది. ఇదిలా ఉంటే.. ఇటీవల ఈ సినిమా సీక్వె్ల్‏కు సంబంధించిన వార్తలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి.. రచయిత విజయేంద్ర ప్రసాద్ ఈ సినిమా సీక్వెల్ కోసం కథను సిద్ధం చేశాడని.. కానీ ఈ మూవీకి రాజమౌళి దర్శకత్వం వహించనున్నారని టాక్ నడుస్తోంది. అయితే తాజా సమాచారం ప్రకారం. ఈ మూవీ సీక్వెల్ పై వస్తున్న వార్తలన్ని అవాస్తవమని.. గతంలో రవితేజ.. కిక్ .. కిక్ 2 సినిమాలు చేశాడు.. కానీ కిక్ 2 డిజాస్టర్‏గా నిలిచింది. దీంతో రవితేజ.. తన కెరీర్‏లో మరోసారి సీక్వెల్ సినిమాలు చేయకూడదని నిర్ణయించుకున్నాడట. అందుకే విక్రమార్కుడు సీక్వెల్ చేయడానికి అంతగా ఆసక్తి చూపించలేదని ఫిల్మ్ వర్గాల్లో టాక్ వినిపిస్తోంది.

Also Read: Pelli SandaD: సూపర్ స్టార్ చేతుల మీదగా దర్శకేంద్రుడి ‘పెళ్లి సందD’ ట్రైలర్.. రిలీజ్ ఎప్పుడంటే..

Krithi Shetty Birthday : ఆకట్టుకుంటున్న అందాల ముద్దుగుమ్మ కృతిశెట్టి బర్త్ డే స్పెషల్ పోస్టర్స్…

Krithi Shetty Birthday : పండువెన్నెల పరువాలతో.. ఓరకంటి చూపులతో కవ్విస్తున్న కృతి

Follow Us
మహాలక్ష్మీ వ్రతం అందరూ చేయవచ్చా? ఈ 4 మంది మాత్రం ఉపవాసం చేయకూడదట!
మహాలక్ష్మీ వ్రతం అందరూ చేయవచ్చా? ఈ 4 మంది మాత్రం ఉపవాసం చేయకూడదట!
శ్రాద్ధ భోజనం తినడానికి కాకి రాకపోతే ఏం చేయాలి? ఈ పరిహారాలు..
శ్రాద్ధ భోజనం తినడానికి కాకి రాకపోతే ఏం చేయాలి? ఈ పరిహారాలు..
పరివర్తిని ఏకాదశి నాడు గుడికి వెళ్లలేకపోతే.. ఇంట్లోనే ఇలా పూజ..
పరివర్తిని ఏకాదశి నాడు గుడికి వెళ్లలేకపోతే.. ఇంట్లోనే ఇలా పూజ..
ఏడాది పాటు చెక్కుచెదరకుండా ఉండే దబ్బకాయ నిల్వ పచ్చడి
ఏడాది పాటు చెక్కుచెదరకుండా ఉండే దబ్బకాయ నిల్వ పచ్చడి
మీ అరచేతిలో వివాహ రేఖ ఇలా ఉందా? పెళ్లి ఆలస్యమవుతుందనే సంకేతమట!
మీ అరచేతిలో వివాహ రేఖ ఇలా ఉందా? పెళ్లి ఆలస్యమవుతుందనే సంకేతమట!
ఆ కండిషన్‌తోనే బిగ్ బాస్ కు వెళ్ళా.. ఒక్క రూపాయి కూడా రాలేదు..
ఆ కండిషన్‌తోనే బిగ్ బాస్ కు వెళ్ళా.. ఒక్క రూపాయి కూడా రాలేదు..
ఇంట్లో పితృ దోషం ఉందా? ఈ 3 సులభమైన పరిహారాలు పాటిస్తే..
ఇంట్లో పితృ దోషం ఉందా? ఈ 3 సులభమైన పరిహారాలు పాటిస్తే..
ఈ తేదీల్లో పుట్టినవారికి డబ్బు విషయంలో అదృష్టం కలిసొస్తుందట!
ఈ తేదీల్లో పుట్టినవారికి డబ్బు విషయంలో అదృష్టం కలిసొస్తుందట!
టాయిలెట్‌లోకి పాములు ఎలా వస్తాయి..?
టాయిలెట్‌లోకి పాములు ఎలా వస్తాయి..?
కమ్మని దోసకాయ కొబ్బరి పచ్చడి.. తాలింపు లేకపోయినా అదిరిపోయే టేస్ట్
కమ్మని దోసకాయ కొబ్బరి పచ్చడి.. తాలింపు లేకపోయినా అదిరిపోయే టేస్ట్