AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Pelli SandaD: సూపర్ స్టార్ చేతుల మీదగా దర్శకేంద్రుడి ‘పెళ్లి సందD’ ట్రైలర్.. రిలీజ్ ఎప్పుడంటే..

హీరో శ్రీకాంత్ తనయుడు రోషన్ నటిస్తున్న తాజా చిత్రం పెళ్లి సందడి. ఈ సినిమాలో శ్రీలీల హీరోయిన్‌గా నటిస్తోంది. రాఘవేంద్ర రావు పర్యవేక్షణలో గౌరి రోనంకి దర్శకత్వం వహిస్తుండగా.

Pelli SandaD: సూపర్ స్టార్ చేతుల మీదగా దర్శకేంద్రుడి 'పెళ్లి సందD' ట్రైలర్.. రిలీజ్ ఎప్పుడంటే..
Mahesh
Rajeev Rayala
|

Updated on: Sep 22, 2021 | 10:49 AM

Share

Pelli SandaD: హీరో శ్రీకాంత్ తనయుడు రోషన్ నటిస్తున్న తాజా చిత్రం పెళ్లి సందడి. ఈ సినిమాలో శ్రీలీల హీరోయిన్‌గా నటిస్తోంది. రాఘవేంద్ర రావు పర్యవేక్షణలో గౌరి రోనంకి దర్శకత్వం వహిస్తుండగా… కృష్ణమోహన్ రావు సమర్పణలో మాధవి కోవెలమూడి, శోభు యార్లగడ్డ, ప్రసాద్ దేవినేని సంయుక్తంగా నిర్మిస్తున్నారు. అయితే ఈ సినిమా గత పెళ్లి సందడి చిత్రానికి సీక్వెల్ కాదని ఇప్పటికే ప్రకటించింది చిత్రయూనిట్. ఇప్పటికే విడుదలైన ఈ సినిమా పోస్టర్లు, సాంగ్స్ ప్రేక్షకుల్లో మంచి రెస్పాన్స్ ను దక్కించుకున్నాయి. ఈ సినిమాలో తనికెళ్ళ భరణి, పోసాని కృష్మ మురళి, వెన్నెల కిషోర్ రాజీవ్ కనకాల అన్నపూర్ణ తదితరులు కీలక పాత్రలలో నటిస్తున్నారు. వీరితోపాటు దర్శకేంద్రుడు రాఘవేంద్రరావు ఈ సినిమాలో కీలక పాత్రలో కనిపించనున్నారు. ఇదిలా ఉంటే ఈ సినిమానుంచి ఇప్పుడు ట్రైలర్ ను విడుదల చేయనున్నారు.

రేపు ( 22న )ఉదయం 11 గంటలకు సూపర్ స్టార్ మహేశ్ బాబు చేతుల మీదుగా ట్రైలర్‌ను రిలీజ్ చేయించనున్నారు. ‘పెళ్లి సందడి’ సినిమాకి పనిచేసిన కీరవాణి – చంద్రబోస్ ఈ సినిమాకి కూడా పనిచేయడం విశేషం. పాతికేళ్ళ క్రితం దర్శకేంద్రుడు రాఘవేంద్రరావు తెరకెక్కించిన పెళ్ళిసందడి సినిమా ఎంత పెద్ద విజయం సాధించిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఈ సినిమా మ్యూజికల్‌గా కూడా సూపర్ హిట్ సాధించిన సంగతి తెలిసిందే. ఇప్పటికీ ఈ పాటలు శ్రోతలను మంత్రముగ్ధులను చేస్తాయి. ఈ చిత్రానికి ఎంఎం కీరవాణి సంగీతాన్ని అందించారు. ఈ సూపర్ హిట్ సినిమా ఇప్పుడు మరోసారి ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. మరి ఈ సినిమా రోషన్ కు ఎంతటి విజయాన్ని అందిస్తుందో చూడాలి.

మరిన్ని ఇక్కడ చదవండి :  Bigg Boss 5 Telugu: ఆమె సింగిల్.. ఏమైనా చెయ్యొచ్చు అన్న ప్రియా.. రెచ్చిపోయిన రవి.. సీరియస్ అయిన సన్నీ.. Bigg Boss 5 Telugu: బిగ్ బాస్ హౌస్‌లో హీట్ పెంచిన ప్రియ- లహరి.. చిన్నపాటి యుద్ధమే జరిగిందిగా.. Bigg Boss 5 Telugu: అబ్బాయిలతోనే బిజీగా ఉంటున్నావ్.. హీట్ పెంచిన ప్రియా కామెంట్స్.. రెచ్చిపోయిన ఆ ఇద్దరు..

Follow Us
భర్త, పిల్లలు లేని మహిళ ఆస్తి ఎవరికి చెందుతుంది?
భర్త, పిల్లలు లేని మహిళ ఆస్తి ఎవరికి చెందుతుంది?
పెళ్లైందని చెప్పడంతో ఆఫర్ మిస్ అయ్యింది.. కట్ చేస్తే.. ఇప్పుడు ..
పెళ్లైందని చెప్పడంతో ఆఫర్ మిస్ అయ్యింది.. కట్ చేస్తే.. ఇప్పుడు ..
రికార్డు సృష్టించిన నిమ్స్.. 2 వేల కిడ్నీ మార్పిడులతో సంచలనం!
రికార్డు సృష్టించిన నిమ్స్.. 2 వేల కిడ్నీ మార్పిడులతో సంచలనం!
చెలరేగిన హైదరాబాద్ బ్యాటర్స్.. బెంగుళూరు ముందు భారీ టార్గెట్
చెలరేగిన హైదరాబాద్ బ్యాటర్స్.. బెంగుళూరు ముందు భారీ టార్గెట్
మండుతున్న ఎండలు.. ఏపీలో కూల్ డ్రింక్ కాదు, బీర్‌కే భారీ క్రేజ్!
మండుతున్న ఎండలు.. ఏపీలో కూల్ డ్రింక్ కాదు, బీర్‌కే భారీ క్రేజ్!
అతడు నా కలను మోసం చేశాడు.. నాకు వెన్నుపోటు పొడిచాడు..
అతడు నా కలను మోసం చేశాడు.. నాకు వెన్నుపోటు పొడిచాడు..
రూ.81,590 కోట్లతో బ్యాంకింగ్‌ సిస్టమ్‌కు బూస్టర్‌ డోస్‌!
రూ.81,590 కోట్లతో బ్యాంకింగ్‌ సిస్టమ్‌కు బూస్టర్‌ డోస్‌!
హైదరాబాద్‌‌లో టెస్లా..! మంత్రి శ్రీధర్ బాబుతో కీలక భేటీ..
హైదరాబాద్‌‌లో టెస్లా..! మంత్రి శ్రీధర్ బాబుతో కీలక భేటీ..
శనివారం రోజున శ్రీ వెంకటేశ్వర స్వామికి ఇష్టమైన పాల పొంగళ్ళు..
శనివారం రోజున శ్రీ వెంకటేశ్వర స్వామికి ఇష్టమైన పాల పొంగళ్ళు..
బల్లి కనిపిస్తే డబ్బు వర్షమా.. లేక దురదృష్టానికి సంకేతమా..?
బల్లి కనిపిస్తే డబ్బు వర్షమా.. లేక దురదృష్టానికి సంకేతమా..?