AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Bigg Boss 5 Telugu: బిగ్ బాస్ హౌస్‌లో హీట్ పెంచిన ప్రియ- లహరి.. చిన్నపాటి యుద్ధమే జరిగిందిగా..

బిగ్ బాస్ సీజన్ 5 లో ప్రేక్షకులందరికీ కావాల్సినంత వినోదాన్ని పంచుతుంది. గత సీజన్స్‌తో పోల్చుకుంటే ఈసీజన్‌లో రచ్చ కాస్త ఎక్కువగానే ఉంది.

Bigg Boss 5 Telugu: బిగ్ బాస్ హౌస్‌లో హీట్ పెంచిన ప్రియ- లహరి.. చిన్నపాటి యుద్ధమే జరిగిందిగా..
Lahari
Rajeev Rayala
|

Updated on: Sep 21, 2021 | 7:09 AM

Share

Bigg Boss 5 Telugu: బిగ్ బాస్ సీజన్ 5 లో ప్రేక్షకులందరికీ కావాల్సినంత వినోదాన్ని పంచుతుంది. గత సీజన్స్‌తో పోల్చుకుంటే ఈసీజన్‌లో రచ్చ కాస్త ఎక్కువగానే ఉంది. ఇప్పటికే రెండు ఎలిమినేషన్స్ కూడా జరిగిపోయాయి. హౌస్‌లో ఫైర్ బ్రాండ్స్‌గా ఉన్న సరయు, ఉమా దేవి ఇద్దరు హౌస్ నుంచి ఎలిమినేట్ అయ్యారు. ఇక నిన్నటి ఎపిసోడ్‌లో హౌస్‌లో వేడి మరింత పెరిగిందనే చెప్పాలి. ఇక ఈ వారం నామినేషన్ ప్రక్రియ చాలా ఆసక్తిగా సాగింది. నామినేషన్స్‌లో భాగంగా ఒక్కో ఇంటి సభ్యుడు ఇద్దరిని నామినేట్ చేసి అందుకు రీజన్ చెప్పాలని బిగ్ బాస్ ఆడ్డర్ వేశాడు. టైల్స్‌పై ఎవర్ని అయితే నామినేట్ చేయాలని అనుకుంటున్నారో వాళ్ల పేర్లతో ఉన్న స్టాంప్‌ వేసి.. ఆ టైల్స్‌ని సుత్తితో పగల కొట్టాలని చెప్పాడు బిగ్ బాస్. దాంతో ఈ నామినేషన్ ప్రక్రియ కాస్త రచ్చగా మారింది.

శ్రీరామ్.. మానస్- రవి,  సిరి.. శ్వేతా- లహరి, వీజే సన్నీ.. ప్రియ- కాజల్, నటరాజ్ మాస్టర్.. సిరి- కాజల్, ఆనీ మాస్టర్..శ్రీరామ్- మానస్, రవి.. శ్రీరామ్- జెస్సీ, లహరి.. ప్రియ- శ్రీరామ్, లోబో.. ప్రియాంక- శ్రీరామ్, ప్రియాంక.. లోబో- జెస్సీ, మానస్.. శ్రీరామ్- రవి, ప్రియ.. లహరి- సన్నీ.. ఇలా ఒక్కక్కరు ఇద్దరిని నామినేట్ చేశారు. లహరి ప్రియను నామినేట్ చేస్తూ.. టాస్క్ అయిన తరువాత ప్రియ తనకి దూరంగా ఉంటున్నారని.. ఆవిడ మనసులో ఏదో పెట్టుకుని ప్రతిదానికి కావలనే పాయింట్ చేస్తుందని చెప్పింది లహరి. దాంతో ప్రియకు కోపం వచ్చింది. హౌస్‌లో ఉన్న మగాళ్లతో నువ్ బిజీగా ఉంటావ్.. నువ్ మగాళ్లతోనే కలుస్తున్నావ్ అంది ప్రియా. దాంతో నేను ఎవరితో బిజీగా ఉన్నా అంటూ ప్రశ్నించింది లహరి. దానికి ప్రియా .. రవి, మానస్ మిగిలిన వాళ్లు అని అంది. హౌస్‌లో చాలామంది మగాళ్లు ఉన్నారు.. కానీ నువ్ వాళ్లని నామినేట్ చేయవు.. ఎందుకంటే నీకు మగాళ్ళతో ఏం ప్రాబ్లమ్ ఉండదు. నీకు మహిళలతోనే ప్రాబ్లమ్ అంది ప్రియ. దీంతో లహరికి చిర్రెత్తుకొచ్చింది.. మీరు పదే పదే.. మగాళ్లతో ఉంటున్నా అని చెప్పడం చాలా తప్పు.. నేను అమ్మాయిలతో ఎవరితో మాట్లాడలేదో చెప్తావా? అని హౌస్‌లో ఉన్న ప్రతి అమ్మాయి దగ్గరకు వెళ్లి నేను నీతో మాట్లాడటం లేదా? అని అడిగింది.. వాళ్లంతా మాట్లాడుతున్నావ్ అని చెప్పడంతో.. లహరి ఆవేశం కట్టలుతెంచుకుంది.

మరిన్ని ఇక్కడ చదవండి : 

Samantha: అన్ని పుకార్లను సమంత ఒక్క ట్వీట్‌తో పటా పంచలు చేసిందా.! ఇంతకీ సామ్‌ చేసిన ఆ ట్వీట్ ఏంటో తెలుసా.?

Raj Kundra: నీలి చిత్రాల కేసులో బాలీవుడ్‌ నటి శిల్పాశెట్టి భర్తకు ఊరట.. బెయిల్‌ మంజూరు చేసిన ముంబై కోర్టు

Bigg Boss 5 Telugu: అబ్బాయిలతోనే బిజీగా ఉంటున్నావ్.. హీట్ పెంచిన ప్రియా కామెంట్స్.. రెచ్చిపోయిన ఆ ఇద్దరు..

Follow Us
ఎండాకాలంలో చల్లని కబురు.. ఏపీ, తెలంగాణకు వర్షసూచన..
ఎండాకాలంలో చల్లని కబురు.. ఏపీ, తెలంగాణకు వర్షసూచన..
పల్లెటూరి స్టైల్ వంకాయ పచ్చిమిర్చి రోటి పచ్చడి.. రుచి అమోఘం
పల్లెటూరి స్టైల్ వంకాయ పచ్చిమిర్చి రోటి పచ్చడి.. రుచి అమోఘం
మరోసారి తలపడని బెంగళూరు, చెన్నై జట్లు.. ఎందుకో తెలుసా?
మరోసారి తలపడని బెంగళూరు, చెన్నై జట్లు.. ఎందుకో తెలుసా?
లవ్ బ్రేకప్ గురించి బయటపెట్టిన సుధీర్.. 14 ఏళ్ల ప్రేమ..
లవ్ బ్రేకప్ గురించి బయటపెట్టిన సుధీర్.. 14 ఏళ్ల ప్రేమ..
వర్షం వల్ల మ్యాచ్ రద్దయినా టికెట్ డబ్బులు వెనక్కి వస్తాయా ?
వర్షం వల్ల మ్యాచ్ రద్దయినా టికెట్ డబ్బులు వెనక్కి వస్తాయా ?
పసిడి ప్రియులకు పండగే! మరింత తగ్గిన బంగారం ధర, ఇవాళ్టి రేట్స్...
పసిడి ప్రియులకు పండగే! మరింత తగ్గిన బంగారం ధర, ఇవాళ్టి రేట్స్...
ఆభరణానికి ఒక ప్రత్యేక గుర్తింపు.. ప్రభుత్వం మరో కీలక నిర్ణయం
ఆభరణానికి ఒక ప్రత్యేక గుర్తింపు.. ప్రభుత్వం మరో కీలక నిర్ణయం
మీ అకౌంట్ నుండి ఆటోమేటిక్‌గా డబ్బులు కట్ అవుతున్నాయా? ఇలా ఆపేయండి
మీ అకౌంట్ నుండి ఆటోమేటిక్‌గా డబ్బులు కట్ అవుతున్నాయా? ఇలా ఆపేయండి
Horoscope Today: ఆ రాశి వారికి కొత్త ఉద్యోగావకాశాలు..
Horoscope Today: ఆ రాశి వారికి కొత్త ఉద్యోగావకాశాలు..
పసిడి ప్రేమికులకు శుభవార్త.. ఏకంగా రూ.54,686 వరకు పడిపోయిన బంగారం
పసిడి ప్రేమికులకు శుభవార్త.. ఏకంగా రూ.54,686 వరకు పడిపోయిన బంగారం