Bigg Boss 5 Telugu: అబ్బాయిలతోనే బిజీగా ఉంటున్నావ్.. హీట్ పెంచిన ప్రియా కామెంట్స్.. రెచ్చిపోయిన ఆ ఇద్దరు..

బిగ్‏బాస్ షో ఎప్పుడు ఏం జరుగుతుందో తెలియదు.. అలాగే.. ఏ క్షణం కంటెస్టెంట్స్ ఎలా ఉంటారో అస్సలు అర్థం కాదు.. వారం మొత్తం సరదాగా.. స్నేహితులు, ఆత్మీయులుగా ఉన్న

Bigg Boss 5 Telugu: అబ్బాయిలతోనే బిజీగా ఉంటున్నావ్.. హీట్ పెంచిన ప్రియా కామెంట్స్.. రెచ్చిపోయిన ఆ ఇద్దరు..
Bigg Boss Priya
Follow us
Rajitha Chanti

|

Updated on: Sep 20, 2021 | 7:49 PM

బిగ్‏బాస్ షో ఎప్పుడు ఏం జరుగుతుందో తెలియదు.. అలాగే.. ఏ క్షణం కంటెస్టెంట్స్ ఎలా ఉంటారో అస్సలు అర్థం కాదు.. వారం మొత్తం సరదాగా.. స్నేహితులు, ఆత్మీయులుగా ఉన్న కంటెస్టెంట్స్ నామినేషన్స్ ప్రక్రియలో శత్రువులుగా మారిపోతుంటారు. సహనాన్ని కోల్పోయి మరి కోపంతో చిందులు వేస్తుంటారు. నామినేట్ చేస్తూ.. ఒకరిపై మరోకరు తీవ్రమైన కామెంట్స్ చేస్తూ రెచ్చిపోతుంటారు. ఇక బిగ్‏బాస్ సీజన్ 5 గడిచిన రెండు వారాల నామినేషన్స్‏లో కంటెస్టెంట్స్ ప్రవర్తించిన తీరుపై ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ముఖ్యంగా రెండోవారం నామినేషన్స్‏లో కొందరు హౌస్‏మేట్స్.. విచక్షణ కోల్పోయి మరి సైకోలుగా మారిపోయిన సంగతి తెలిసిందే. తాజాగా బిగ్‏బాస్ సీజన్ 5 మూడో వారం నామినేషన్స్ ప్రక్రియ ఇంట్లో మరోసారి హీట్ పెంచినట్లుగా తెలుస్తోంది. ఈరోజు విడుదలైన రెండు ప్రోమోల్లోనూ కంటెస్టెంట్స్ రెచ్చిపోయి మరి ఒకరిపై ఒకరు అరుచుకుంటున్నారు..

తాజాగా విడుదలైన ప్రోమోలో ప్రియ చేసిన కామెంట్స్‏తో మళ్లీ ఇంట్లో రచ్చ జరిగినట్టుగా తెలుస్తోంది. ముందుగా లహరి మాట్లాడుతూ.. ప్రియను ఎందుకు డిస్టన్స్ మెయింటెన్స్ చేస్తున్నారో అర్థం కావడం లేదు అనగా.. ఎందుకు నువ్వు ఇంట్లో ఉన్న అందరూ అబ్బాయిలతో బిజీగా ఉంటున్నావ్ అంటూ రివర్స్ కౌంటర్ ఇచ్చింది ప్రియా.. దీంతో ఇంట్లోని సభ్యులు షాకయ్యారు.. సన్నీ మాత్రం నోరెళ్లపెట్టేసినట్లుగా తెలుస్తోంది. ఎవరితో బిజీగా ఉన్నానో చెప్తారా అంటూ లహరి ప్రశ్నించగా.. రవితో బిజీగా ఉన్నావు.. మానస్‏తో బిజీగా ఉన్నావ్ అంటూ చెప్పుకొచ్చింది ప్రియా.. దీంతో లహరి చప్పట్లు కొడుతూ రెచ్చిపోయింది. ఇక రవి మాట్లాడుతూ.. నేను లహరి కంటే సిరితో ఎక్కువగా క్లోజ్ అయ్యానని.. తనను ఒక ఫ్రెండ్ లాగా. ఒక సిస్టర్ లాగా భావిస్తాను అని చెప్పగా.. మీరు ఇప్పుడు అందరి సపోర్ట్ కోసం మాట్లాడవద్దు రవి అంటూ కుండబద్దలు కొట్టింది ప్రియా. దీంతో సపోర్టా అంటూ తల పట్టుకున్నాడు రవి. రాంగ్ స్టేట్‏మెంట్స్ ఇవ్వోద్దు అంటూ రవి.. లహరి.. ప్రియాపై విరుచుకుపడ్డారు. మొత్తానికి ఈరోజు నామినేషన్స్ ప్రక్రియ రసవత్తరంగా మారినట్టుగా తెలుస్తోంది.

వీడియో..

Also Read: Bigg Boss 5 Telugu: మరోసారి ఇంట్లో నామినేషన్స్ రచ్చ.. పనికిమాలిన రీజన్స్ అంటూ ఫైర్ అయిన ప్రియాంక..

Bheemla Nayak: భీమ్లా నాయక్ అప్డేట్ వచ్చేసింది.. ధర్మేంద్ర అంటూ రానా వార్నింగ్..

గుడ్‌న్యూస్‌.. గుడ్‌న్యూస్‌.! రూ.27 వేలకే iPhone-15.. వీడియో.
గుడ్‌న్యూస్‌.. గుడ్‌న్యూస్‌.! రూ.27 వేలకే iPhone-15.. వీడియో.
మాది లవ్‌ ఎట్‌ ఫస్ట్‌ సైట్‌! పీవీ సింధు సిగ్గు మొగ్గలేస్తుందిగా.!
మాది లవ్‌ ఎట్‌ ఫస్ట్‌ సైట్‌! పీవీ సింధు సిగ్గు మొగ్గలేస్తుందిగా.!
కుప్పకూలిన విమానం.. ఘటన సమయంలో విమానంలో 72 మంది.!
కుప్పకూలిన విమానం.. ఘటన సమయంలో విమానంలో 72 మంది.!
మన్యంలో మెరుస్తున్న రోడ్లు.! రోడ్ల మరమ్మతులు, నిర్మాణాలపై ఫోకస్‌!
మన్యంలో మెరుస్తున్న రోడ్లు.! రోడ్ల మరమ్మతులు, నిర్మాణాలపై ఫోకస్‌!
వాటర్‌ బాటిల్‌తో చేపలు ఇట్టే పట్టేశారే.. ఐడియా అదిరిందిగా.!
వాటర్‌ బాటిల్‌తో చేపలు ఇట్టే పట్టేశారే.. ఐడియా అదిరిందిగా.!
వీళ్లు మహా కంత్రీగాళ్లు.. నిమిషంలో లక్షలు కొల్లగొట్టారు.!
వీళ్లు మహా కంత్రీగాళ్లు.. నిమిషంలో లక్షలు కొల్లగొట్టారు.!
ఎవరీ బేబీ 81.. ఏంటా కథ.? ప్రపంచం దృష్టిని ఆకర్షించిన బేబీ 81’ కథ.
ఎవరీ బేబీ 81.. ఏంటా కథ.? ప్రపంచం దృష్టిని ఆకర్షించిన బేబీ 81’ కథ.
డిప్ చాయ్ తాగే వాళ్లకు షాకింగ్ న్యూస్.టీ కలిపేటప్పుడు చాలజాగ్రత్త
డిప్ చాయ్ తాగే వాళ్లకు షాకింగ్ న్యూస్.టీ కలిపేటప్పుడు చాలజాగ్రత్త
డ్రగ్ స్మగ్లర్ హత్య.. చంపి పగ తీర్చుకున్న బిష్ణోయ్ గ్యాంగ్.!
డ్రగ్ స్మగ్లర్ హత్య.. చంపి పగ తీర్చుకున్న బిష్ణోయ్ గ్యాంగ్.!
మీ శరీరంలో ఈ లక్షణాలు కనిపిస్తే అస్సలు నిర్లక్ష్యం చెయ్యద్దు.!
మీ శరీరంలో ఈ లక్షణాలు కనిపిస్తే అస్సలు నిర్లక్ష్యం చెయ్యద్దు.!