Bheemla Nayak: భీమ్లా నాయక్ అప్డేట్ వచ్చేసింది.. ధర్మేంద్ర అంటూ రానా వార్నింగ్..

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్.. టాలెంటెడ్ హీరో రానా దగ్గుబాటి ప్రధాన పాత్రలలో నటిస్తోన్న సినిమా భీమ్లా నాయక్. ఈ మూవీ కోసం పవర్ స్టార్ ఫ్యాన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

Bheemla Nayak: భీమ్లా నాయక్ అప్డేట్ వచ్చేసింది..  ధర్మేంద్ర అంటూ రానా వార్నింగ్..
Rana
Follow us
Rajitha Chanti

|

Updated on: Sep 20, 2021 | 6:09 PM

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్.. టాలెంటెడ్ హీరో రానా దగ్గుబాటి ప్రధాన పాత్రలలో నటిస్తోన్న సినిమా భీమ్లా నాయక్. ఈ మూవీ కోసం పవర్ స్టార్ ఫ్యాన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఇటీవల వకీల్ సాబ్ సినిమాతో రీఎంట్రీ ఇచ్చిన పవన్… మరోసారి తన మేనియా కొనసాగిస్తున్నాడు. వరుస ఆఫర్లను లైన్లో పెట్టిన పవన్.. వీలైనంత తర్వగా.. తన ప్రాజెక్ట్స్ కంప్లీట్ చేసేందుకు ప్రయత్నిస్తున్నారు. ఇక గత కొద్ది రోజులుగా పవన్ సినిమాల నుంచి వరుస అప్డేట్స్ వస్తున్న సంగతి తెలిసిందే. ఇక సాగర్ కె చంద్ర దర్శకత్వం వహిస్తున్న భీమ్లా నాయక్ సినిమాలో పవన్ మరోసారి పోలీస్ గెటప్‏లో కనిపించనున్నారు. ఇప్పటికే విడుదలైన పోస్టర్స్‏కు ఏ రేంజ్‏లో రెస్పాన్స్ వచ్చిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.

ఇక ఇందులో పవర్ స్టార్‍తోపాటు.. రానా దగ్గుబాటి సైతం కీలక పాత్రలో నటిస్తున్న సంగతి తెలిసిందే. తాజాగా రానా పాత్రకు సంబంధించిన టీజర్‏ను కాసేపటి క్రితం విడుదల చేసింది చిత్రయూనిట్. ఇందులో రానా.. డేనియల్ శేఖర్ పాత్రలో అదరగొట్టాడు. పంచెకట్టులో రానా లుక్‏కు మాస్ ఆడియన్స్ ఫిదా అయ్యారు. అలాగే నిత్యామీనన్‏కు వార్నింగ్ ఇస్తూ కనిపించాడు రానా.. నీ మొగుడు గబ్బర్ సింగ్ అంటా.. స్టేషన్‏లో టాక్ నడుస్తోంది.. నేనేవరో తెలుసా.. ధర్మేంద్ర..హీరో అంటూ వార్నింగ్ ఇస్తున్నాడు రానా.. డాని ఎంటర్‏టైన్మెంట్ ప్రోడక్షన్ నంబర్ 1 అంటూ రానా చెప్పే డైలాగ్స్ ఆకట్టుకుంటున్నాయి. ఈ సినిమాను సితార ఎంటర్‏టైన్‏మెంట్స్ పై సూర్యదేవర నాగవంశీ నిర్మిస్తుండగా.. థమన్ మ్యూజిక్ అందిస్తున్నాడు. అలాగే మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ మాటలు రచిస్తున్నాడు. ఇటీవల విడుదలైన భీమ్లా నాయక్ టైటిల్ సాంగ్ యూట్యూబ్‏లో రికార్డ్స్ సృష్టించింది. ఇందులో పవన్‏కు జోడిగా నిత్యా మీనన్ నటిస్తుండగా.. రానా సరసన ఐశ్వర్య రాజేష్ నటిస్తున్నట్లుగా టాక్. ఈ మూవీని వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా జనవరి 12న విడుదల చేయనున్నారు.

వీడియో..

ట్వీట్..

Also Read: సినీ పెద్దలతో మంత్రి పేర్ని నాని సమావేశం.. ఆసక్తికర వ్యాఖ్యలు చేసిన నిర్మాతలు..

Online Cinema Tickets: త్వరలోనే ఏపీలో ఆన్‌లైన్ పద్దతిలో సినిమా టిక్కెట్లు.. చర్చల అనంతరం మంత్రి కీలక ప్రకటన

Bigg Boss 5 Telugu: మరోసారి ఇంట్లో నామినేషన్స్ రచ్చ.. పనికిమాలిన రీజన్స్ అంటూ ఫైర్ అయిన ప్రియాంక..

నాన్న చివరి కోరిక తీర్చలేకపోయా.! కన్నీళ్లు పెట్టుకున్న వెంకీ..
నాన్న చివరి కోరిక తీర్చలేకపోయా.! కన్నీళ్లు పెట్టుకున్న వెంకీ..
బాబాయ్ ఆ సినిమా చేసుంటే.. అబ్బాయి కెరీర్ కష్టమయ్యేదా.? వీడియో..
బాబాయ్ ఆ సినిమా చేసుంటే.. అబ్బాయి కెరీర్ కష్టమయ్యేదా.? వీడియో..
ఆ ఫెయిల్యూరే నన్ను ఇక్కడి వరకు తీసుకొచ్చింది.! వీడియో.
ఆ ఫెయిల్యూరే నన్ను ఇక్కడి వరకు తీసుకొచ్చింది.! వీడియో.
బాధతో సల్మాన్ కీలక నిర్ణయం.! కానీ ఆ తర్వాత సూపర్ రెస్పాన్స్..
బాధతో సల్మాన్ కీలక నిర్ణయం.! కానీ ఆ తర్వాత సూపర్ రెస్పాన్స్..
దేశంలోనే అతిపెద్ద కటౌట్‌ దటీజ్ చరణ్‌ క్రేజ్‌! | ఎంత దారుణానికి..
దేశంలోనే అతిపెద్ద కటౌట్‌ దటీజ్ చరణ్‌ క్రేజ్‌! | ఎంత దారుణానికి..
మరణించిన తండ్రిపై మమకారంతో పిల్లలు ఏంచేశారంటే..?
మరణించిన తండ్రిపై మమకారంతో పిల్లలు ఏంచేశారంటే..?
గుడ్‌న్యూస్‌.. గుడ్‌న్యూస్‌.! రూ.27 వేలకే iPhone-15.. వీడియో.
గుడ్‌న్యూస్‌.. గుడ్‌న్యూస్‌.! రూ.27 వేలకే iPhone-15.. వీడియో.
మాది లవ్‌ ఎట్‌ ఫస్ట్‌ సైట్‌! పీవీ సింధు సిగ్గు మొగ్గలేస్తుందిగా.!
మాది లవ్‌ ఎట్‌ ఫస్ట్‌ సైట్‌! పీవీ సింధు సిగ్గు మొగ్గలేస్తుందిగా.!
కుప్పకూలిన విమానం.. ఘటన సమయంలో విమానంలో 72 మంది.!
కుప్పకూలిన విమానం.. ఘటన సమయంలో విమానంలో 72 మంది.!
మన్యంలో మెరుస్తున్న రోడ్లు.! రోడ్ల మరమ్మతులు, నిర్మాణాలపై ఫోకస్‌!
మన్యంలో మెరుస్తున్న రోడ్లు.! రోడ్ల మరమ్మతులు, నిర్మాణాలపై ఫోకస్‌!