Online Cinema Tickets: త్వరలోనే ఏపీలో ఆన్‌లైన్ పద్దతిలో సినిమా టిక్కెట్లు.. చర్చల అనంతరం మంత్రి కీలక ప్రకటన

ప్రజలకు మేలు జరిగేలా ఎవరు ఏ ప్రతిపాదన చేసినా తమ ప్రభుత్వం సానుకూలంగా స్పందిస్తుందన్నారు ఏపీ మంత్రి పేర్ని నాని. సినీ పరిశ్రమ డిమాండ్లను, విజ్ఞప్తులను ప్రభుత్వం పరిశీలిస్తోందన్న పేర్ని నాని.. త్వరలోనే సీఎం జగన్ నిర్ణయం తీసుకుంటారని తెలిపారు.

Online Cinema Tickets: త్వరలోనే ఏపీలో ఆన్‌లైన్ పద్దతిలో సినిమా టిక్కెట్లు.. చర్చల అనంతరం మంత్రి కీలక ప్రకటన
Minister Perni Nani
Follow us

|

Updated on: Sep 20, 2021 | 4:48 PM

ప్రజలకు మేలు జరిగేలా ఎవరు ఏ ప్రతిపాదన చేసినా తమ ప్రభుత్వం సానుకూలంగా స్పందిస్తుందన్నారు ఏపీ మంత్రి పేర్ని నాని. సినీ పరిశ్రమ డిమాండ్లను, విజ్ఞప్తులను ప్రభుత్వం పరిశీలిస్తోందన్న పేర్ని నాని.. త్వరలోనే సీఎం జగన్ నిర్ణయం తీసుకుంటారని తెలిపారు. ప్రభుత్వం నిర్ణయించిన ధరలు మాత్రమే అమలయ్యేలా ఆన్‌లైన్ టికెటింగ్ వ్యవస్థను తీసుకొస్తామన్నారు. ఈ నేపథ్యంలో సోమవారం ఏపీ ప్రభుత్వంతో సినీ పరిశ్రమకు చెందిన ప్రముఖులు, థియేటర్‌ యజమానులు భేటీ కావడం ప్రాధాన్యం సంతరించుకుంది. ఈ సందర్భంగా ఆన్‌లైన్‌ టికెట్ల వ్యవహారంపై సమావేశంలో చర్చ జరిగింది. త్వరలోనే ఆన్‌లైన్‌ వ్యవస్థ ద్వారా ప్రజలకు వినోదాన్ని పంచుతామని ఏపీ సినిమాటోగ్రఫీశాఖ మంత్రి పేర్ని నాని అన్నారు. సినీ ప్రముఖలతో సమావేశం అనంతరం ఆయన వివరించారు. చిరంజీవి అంటే సీఎం జగన్‌కు గౌరవం ఉందని, సోదరభావంతో చూస్తారని అన్నారు.

ప్రజలకు మేలు చేసేలా ఎవరు ఏ విన్నపం చేసినా జగన్‌మోహన్‌రెడ్డి సర్కార్ సానుకూలంగా స్పందిస్తుందని అన్నారు. ప్రభుత్వం నిర్ణయించిన రేట్ల గురించి తాజా సమావేశంలో వారికి వివరించామని అన్నారు. త్వరలోనే ఆన్‌లైన్‌ టికెటింగ్‌ వ్యవస్థ ద్వారా ప్రజలకు వినోదాన్ని అందిస్తామని అన్నారు. సినిమాపై మాకున్న ఆపేక్షను ఎందుకు సొమ్ము చేసుకుంటున్నారని ప్రజలెవరూ ప్రశ్నించే అవకాశం లేకుండా పారదర్శకతతో కూడిన రేట్లను అమలు చేస్తామన్నారు. ప్రభుత్వ నిర్దేశించిన ధరలను మాత్రమే థియేటర్‌లో అమలు చేయాలని… అందుకు ఆన్‌లైన్‌ వ్యవస్థ ద్వారా వినోదాన్ని అందించేందుకు జగన్‌మోహన్‌రెడ్డి ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నిస్తోందన్నారు.

ఇందుకు అన్ని వర్గాల నుంచి సానుకూల స్పందన వచ్చిందని.. చట్టాలకు అతీతంగా వ్యాపారాలు చేసే పరిస్థితి ఉత్పన్నం అవదని తాను అనుకుంటున్నానని అన్నారు. నిర్మాతలు, డిస్ట్రిబ్యూటర్స్‌, థియేటర్‌ యజమానులు ప్రభుత్వం ఇలా చేస్తే బాగుంటుందని అనేక విషయాలు తయ దృష్టికి తీసుకొచ్చారని… వారి విజ్ఞప్తులను పరిశీలించి సాధ్యమైనంత త్వరలోనే ప్రభుత్వం సానుకూలంగా స్పందిస్తుందన్నారు మంత్రి పేర్ని నాని.

ఇవి కూడా చదవండి: Hyderabad: దూసుకుపోతున్న హైదరాబాద్.. ఢిల్లీ, ముంబై ఆ తర్వాత మనమే.. ఎందులోనో తెలుసా..

PAN Aadhaar Linking: పాన్-ఆధార్ లింక్ చేయకపోతే ఈ 5 నష్టాలు తప్పవు.. ఇందులో ఇవి చాలా ముఖ్యం..