AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Bigg Boss 5 Telugu: మరోసారి ఇంట్లో నామినేషన్స్ రచ్చ.. పనికిమాలిన రీజన్స్ అంటూ ఫైర్ అయిన ప్రియాంక..

బుల్లితెరపై బిగ్‏బాస్ సీజన్ 5 రచ్చ మాములుగా లేదు. మొదటి నుంచి బిగ్‏బాస్ ఇంట్లో కావాల్సినంత డ్రామా క్రియేట్ చేయడంలో సీజన్ 5 కంటెస్టెంట్స్ సక్సెస్ అయ్యారని చెప్పుకోవాలి.

Bigg Boss 5 Telugu: మరోసారి ఇంట్లో నామినేషన్స్ రచ్చ..  పనికిమాలిన రీజన్స్ అంటూ ఫైర్ అయిన ప్రియాంక..
Bigg Boss
Rajitha Chanti
|

Updated on: Sep 20, 2021 | 4:10 PM

Share

బుల్లితెరపై బిగ్‏బాస్ సీజన్ 5 రచ్చ మాములుగా లేదు. మొదటి నుంచి బిగ్‏బాస్ ఇంట్లో కావాల్సినంత డ్రామా క్రియేట్ చేయడంలో సీజన్ 5 కంటెస్టెంట్స్ సక్సెస్ అయ్యారని చెప్పుకోవాలి. గత సీజన్స్ కంటే ఈసారి పూర్తి విభిన్నంగా ఈషో కొనసాగుతుందనుకోవచ్చు. మొదటి వారం నుంచే హౌస్‏మేట్స్ మధ్య గొడవలు.. ఏడుపులతో రసవత్తరంగా నడుస్తోంది. ముఖ్యంగా ఈసారి షోలో ఒకరంటే ఒకరికి పడడం లేదు. ప్రతి సీజన్‏లో వారం మొత్తం సరదాగా ఉండి.. నామినేషన్స్ ప్రక్రియలో మాత్రమే అసలైన కోపాతాపాలు చూపించేవారు.. కానీ ఈసారి ప్రతి ఎపిసోడ్‏లోనూ గొడవలు, ఏడుపులతో ప్రేక్షకులను విసుగు తెప్పిస్తున్నారు. ముఖ్యంగా తెలుగు షోలో తెలుగే వినిపించడం లేదు. ఇదిలా ఉంటే.. ఇప్పటికే బిగ్‏బాస్ సీజన్ 5 రెండు ఎలిమినేషన్స్ పూర్తి చేసుకుంది. మొదటి ఎలిమినేషన్‏లో సరయు.. రెండవ ఎలిమినేషన్‍లో ఉమాదేవి ఇంటి నుంచి బయటకు వచ్చేంది. ఇక సోమవారం మళ్లీ నామినేషన్స్ ప్రక్రియ జరిగనుంది. ఈ క్రమంలో ఈరోజు ఎపిసోడ్‏కు సంబంధించిన ప్రోమో విడుదల అయ్యింది.

తాజాగా విడుదలైన ప్రోమో చూస్తుంటే.. మరోసారి ఇంటి సభ్యుల మధ్య మాటల యుద్ధం నడిచినట్లుగా తెలుస్తోంది. ఇక మానస్, శ్రీరామచంద్ర మధ్య ఉన్న గోడవ ఇప్పటికీ కంటిన్యూ అవుతున్నట్లుగా తెలుస్తోంది. అలాగే ప్రియా మాటలను తీసుకోలేకపోతున్నానంటూ సన్నీ సీరియస్ అయినట్లుగా తెలుస్తోంది. దీంతో ఏ మాట అన్నాను చెప్పు అంటూ ప్రియ ప్రశ్నించింది. దీంతో వెంటనే సన్నీ ఏ మాట అన్నారో మీకు తెలుసు అది అనగానే.. ప్రియ చప్పట్లు కొడుతూ కనిపించింది. ఇక లహరి సైతం ప్రియను నామినేట్ చేయగా.. సేఫ్ గేమ్ ఆడుతున్నావ్ అని ప్రియ అంటే.. ఇది సేఫ్ గేమ్ కాదు.. సేఫ్ గేమ్ అనుకుంటే ఇక్కడ చాలామంది ఉన్నారు నామినేషన్ చేయడానికి అంటూ రివర్స్ ఆన్సర్ ఇచ్చింది లహరి. ఇక ఆ తర్వాత.. ప్రియాంక, హమిదా మాధ్య వార్ జరిగినట్లుగా తెలుస్తోంది. పనికిమాలిన రీజన్స్‏తో నామినేట్ చేస్తున్నావంటూ హమిదా మీద ఫైర్ అయ్యింది ప్రియాంక.

ఇక ఆ తర్వాత నటరాజ్ మాస్టర్.. జెస్సీల మధ్య హీట్ డిస్కషన్ నడించింది. వేరొకరు చెప్తే నువ్వు నన్ను నామినేట్ చేశావ్.. అని నాకు తెలుసు అంటూ నటరాజ్ మాస్టర్ అంటూ ఫైర్ అయ్యారు. నువ్వు చిన్నపిల్లోడివి.. జుజూ అంటూ సీరియస్ అవ్వగా.. అవును నేను చిన్నపిల్లోడినే.. అంటూ రివర్స్ అయ్యాడు జెస్సీ. ఇక విశ్వ… నటరాజ్ మాస్టర్ లేడీస్‏కు రెస్పెక్ట్ ఇవ్వడం రాదని నామినేట్ చేశాడు. ఇక రవి.. జెస్సీని నామినేట్ చేస్తూ.. ఇన్నిరోజులు చిన్న చిన్న చెడ్డీలు వేసుకుంటూ ఆ దెబ్బ చూపించి సింపథీ కోసం ట్రై చేస్తూ.. ఇంత మంచి ప్లాట్‏ఫాంను మిస్ చేసుకుంటున్నావేమో అనిపిస్తుంది అంటూ జెస్సీకి కౌంటర్ వేశాడు రవి. మొత్తానికి ఈరోజు నామినేషన్స్ ప్రక్రియ హీట్ పెంచినట్లుగానే తెలుస్తోంది.

వీడియో..

Also Read: Adivi Sesh: అనారోగ్యంతో ఆసుపత్రిలో చేరిన యంగ్ హీరో అడివి శేష్.. ప్రస్తుతం ఎలా ఉన్నారంటే..

Chandramukhi 2 : చంద్రముఖి 2 ఆలస్యం కావడానికి అదే కారణమా.. రంగంలోకి దిగిన లారెన్స్..

Follow Us
మహాలక్ష్మీ వ్రతం అందరూ చేయవచ్చా? ఈ 4 మంది మాత్రం ఉపవాసం చేయకూడదట!
మహాలక్ష్మీ వ్రతం అందరూ చేయవచ్చా? ఈ 4 మంది మాత్రం ఉపవాసం చేయకూడదట!
శ్రాద్ధ భోజనం తినడానికి కాకి రాకపోతే ఏం చేయాలి? ఈ పరిహారాలు..
శ్రాద్ధ భోజనం తినడానికి కాకి రాకపోతే ఏం చేయాలి? ఈ పరిహారాలు..
పరివర్తిని ఏకాదశి నాడు గుడికి వెళ్లలేకపోతే.. ఇంట్లోనే ఇలా పూజ..
పరివర్తిని ఏకాదశి నాడు గుడికి వెళ్లలేకపోతే.. ఇంట్లోనే ఇలా పూజ..
ఏడాది పాటు చెక్కుచెదరకుండా ఉండే దబ్బకాయ నిల్వ పచ్చడి
ఏడాది పాటు చెక్కుచెదరకుండా ఉండే దబ్బకాయ నిల్వ పచ్చడి
మీ అరచేతిలో వివాహ రేఖ ఇలా ఉందా? పెళ్లి ఆలస్యమవుతుందనే సంకేతమట!
మీ అరచేతిలో వివాహ రేఖ ఇలా ఉందా? పెళ్లి ఆలస్యమవుతుందనే సంకేతమట!
ఆ కండిషన్‌తోనే బిగ్ బాస్ కు వెళ్ళా.. ఒక్క రూపాయి కూడా రాలేదు..
ఆ కండిషన్‌తోనే బిగ్ బాస్ కు వెళ్ళా.. ఒక్క రూపాయి కూడా రాలేదు..
ఇంట్లో పితృ దోషం ఉందా? ఈ 3 సులభమైన పరిహారాలు పాటిస్తే..
ఇంట్లో పితృ దోషం ఉందా? ఈ 3 సులభమైన పరిహారాలు పాటిస్తే..
ఈ తేదీల్లో పుట్టినవారికి డబ్బు విషయంలో అదృష్టం కలిసొస్తుందట!
ఈ తేదీల్లో పుట్టినవారికి డబ్బు విషయంలో అదృష్టం కలిసొస్తుందట!
టాయిలెట్‌లోకి పాములు ఎలా వస్తాయి..?
టాయిలెట్‌లోకి పాములు ఎలా వస్తాయి..?
కమ్మని దోసకాయ కొబ్బరి పచ్చడి.. తాలింపు లేకపోయినా అదిరిపోయే టేస్ట్
కమ్మని దోసకాయ కొబ్బరి పచ్చడి.. తాలింపు లేకపోయినా అదిరిపోయే టేస్ట్