AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Chandramukhi 2 : చంద్రముఖి 2 ఆలస్యం కావడానికి అదే కారణమా.. రంగంలోకి దిగిన లారెన్స్..

తమిళ్‏లో తెరకెక్కిన చంద్రముఖి సినిమా ఎంత బ్లాక్ బస్టర్ హిట్టయ్యిందో అందరికి తెలిసిన విషయమే. కంప్లీట్ హర్రర్ జోనర్‏లో వచ్చిన ఈ సినిమా....

Chandramukhi 2 : చంద్రముఖి 2 ఆలస్యం కావడానికి అదే కారణమా.. రంగంలోకి దిగిన లారెన్స్..
Chandramukhi 2
Rajitha Chanti
|

Updated on: Sep 20, 2021 | 2:27 PM

Share

తమిళ్‏లో తెరకెక్కిన చంద్రముఖి సినిమా ఎంత బ్లాక్ బస్టర్ హిట్టయ్యిందో అందరికి తెలిసిన విషయమే. కంప్లీట్ హర్రర్ జోనర్‏లో వచ్చిన ఈ సినిమా…. కామెడీ పరంగానూ ప్రేక్షకులను ఆకట్టుకుంది. ఇందులో రజీని కాంత్ ప్రధాన పాత్రలో నటించగా.. జ్యోతిక, నయన్ కీలక పాత్రలలో కనిపించారు. ఈ మూవీ వచ్చి ఇన్న సంవత్సరాలైన.. మరే హరర్ సినిమా ఈ సినిమాను మించిపోలేదు. ఇప్పటికీ చంద్రముఖి సినిమాకు ప్రత్యేకమైన క్రేజ్ ఉంది. తమిళ్ సినిమా అయినా.. తెలుగులో డబ్ అయి సంచలనం సృష్టించింది. దక్షిణాది చిత్రపరిశ్రమలో ఈ మూవీ ఆల్ టైం రికార్డ్ సొంతం చేసుకుంది.

అన్ని చిత్రాల మాదిరిగానే దెయ్యం కాన్సెప్ట్‏తో ప్రేక్షకుల ముందుకు వచ్చినా ఈ సినిమా.. మరోవైపు పొట్టచెక్కలయ్యే కామెడీతో ప్రేక్షకులను అలరించింది. ఇక ఈ సినిమాకు సీక్వెల్ చేయడానికి చాలా కాలంగా ప్రయత్నాలు జరుగుతున్నాయి. కానీ ఇప్పటికీ ఈ మూవీ పట్టాలెక్కలేదు. ఇందుకు కారణం.. చంద్రముఖి 2 పై రజీని అంతగా ఆసక్తి చూపించకపోవడమే. దీంతో డైరెక్టర్ వాసు.. లారెన్స్‎తో ఈ మూవీ కంప్లీట్ చేయాలని భావిస్తున్నారట. ఇప్పటికే వీరిద్దరి మధ్య చర్చలు కూడా జరిగాయట. కానీ ఇప్పటి వరకు ఈ సినిమా సెట్స్ పైకి వెళ్లలేదు. సినిమా లేట్ కావడానికి లారెన్స్ ప్రధాన కారణమంటూ టాక్ వినిపిస్తోంది.

చంద్రముఖి సినిమా బ్లాక్ బస్టర్ హిట్ అందుకుంది. అలాగే చంద్రముఖి 2 మూవీ కోసం జనాలు ఎంత ఆసక్తిగా ఎదురుచూస్తారో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఈ క్రమంలో సినిమాను వీలైనంత త్వరగా పూర్తి చేసి.. ఓటీటీకి ఇచ్చేస్తారు. చంద్రముఖి సినిమాకు ఉన్న క్రేజ్ గురించి తెలిసిన లారెన్స్.. ఈ మూవీని థియేటర్లలోనే విడుదల చేయాలని భావిస్తున్నారట. అందుకే ఈ సినిమాను ఇప్పట్లో పూర్తి చేయకూడదని అనుకుంటున్నాడని టాక్. ఇక ఇందులో టైటిల్ రోల్ కోసం అనుష్కను ఎంపిక చేశారట మేకర్స్.

Also Read: Drishyam 2: వెంకీ అభిమానులకు షాకిచ్చిన చిత్రయూనిట్… దృశ్యం 2 ఫస్ట్‏లుక్ ఇప్పట్లో లేనట్లే..

Love Story PreRelease Event photos: లవ్ స్టోరీ ప్రీ రిలీజ్ ఈవెంట్ లో ఆకర్షణగా మారిన చిరు , సాయి పల్లవి డాన్స్.. (ఫొటోస్)

Follow Us
మహాలక్ష్మీ వ్రతం అందరూ చేయవచ్చా? ఈ 4 మంది మాత్రం ఉపవాసం చేయకూడదట!
మహాలక్ష్మీ వ్రతం అందరూ చేయవచ్చా? ఈ 4 మంది మాత్రం ఉపవాసం చేయకూడదట!
శ్రాద్ధ భోజనం తినడానికి కాకి రాకపోతే ఏం చేయాలి? ఈ పరిహారాలు..
శ్రాద్ధ భోజనం తినడానికి కాకి రాకపోతే ఏం చేయాలి? ఈ పరిహారాలు..
పరివర్తిని ఏకాదశి నాడు గుడికి వెళ్లలేకపోతే.. ఇంట్లోనే ఇలా పూజ..
పరివర్తిని ఏకాదశి నాడు గుడికి వెళ్లలేకపోతే.. ఇంట్లోనే ఇలా పూజ..
ఏడాది పాటు చెక్కుచెదరకుండా ఉండే దబ్బకాయ నిల్వ పచ్చడి
ఏడాది పాటు చెక్కుచెదరకుండా ఉండే దబ్బకాయ నిల్వ పచ్చడి
మీ అరచేతిలో వివాహ రేఖ ఇలా ఉందా? పెళ్లి ఆలస్యమవుతుందనే సంకేతమట!
మీ అరచేతిలో వివాహ రేఖ ఇలా ఉందా? పెళ్లి ఆలస్యమవుతుందనే సంకేతమట!
ఆ కండిషన్‌తోనే బిగ్ బాస్ కు వెళ్ళా.. ఒక్క రూపాయి కూడా రాలేదు..
ఆ కండిషన్‌తోనే బిగ్ బాస్ కు వెళ్ళా.. ఒక్క రూపాయి కూడా రాలేదు..
ఇంట్లో పితృ దోషం ఉందా? ఈ 3 సులభమైన పరిహారాలు పాటిస్తే..
ఇంట్లో పితృ దోషం ఉందా? ఈ 3 సులభమైన పరిహారాలు పాటిస్తే..
ఈ తేదీల్లో పుట్టినవారికి డబ్బు విషయంలో అదృష్టం కలిసొస్తుందట!
ఈ తేదీల్లో పుట్టినవారికి డబ్బు విషయంలో అదృష్టం కలిసొస్తుందట!
టాయిలెట్‌లోకి పాములు ఎలా వస్తాయి..?
టాయిలెట్‌లోకి పాములు ఎలా వస్తాయి..?
కమ్మని దోసకాయ కొబ్బరి పచ్చడి.. తాలింపు లేకపోయినా అదిరిపోయే టేస్ట్
కమ్మని దోసకాయ కొబ్బరి పచ్చడి.. తాలింపు లేకపోయినా అదిరిపోయే టేస్ట్