Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Adivi Sesh: అనారోగ్యంతో ఆసుపత్రిలో చేరిన యంగ్ హీరో అడివి శేష్.. ప్రస్తుతం ఎలా ఉన్నారంటే..

టాలీవుడ్ యంగ్ హీరో అడివి శేషు తీవ్ర అనారోగ్యంతో ఆసుపత్రిలో చేరారు. గత కొద్ది రోజుల క్రితం అడివి శేషు డెంగ్యూ సోకినట్లుగా టాక్ వినిపించింది. దీంతో ఆయన రక్తంలో ఉన్న

Adivi Sesh: అనారోగ్యంతో ఆసుపత్రిలో చేరిన యంగ్ హీరో అడివి శేష్.. ప్రస్తుతం ఎలా ఉన్నారంటే..
Adivi Sesh
Follow us
Rajitha Chanti

|

Updated on: Sep 20, 2021 | 3:12 PM

టాలీవుడ్ యంగ్ హీరో అడివి శేషు తీవ్ర అనారోగ్యంతో ఆసుపత్రిలో చేరారు. గత కొద్ది రోజుల క్రితం అడివి శేషు డెంగ్యూ సోకినట్లుగా టాక్ వినిపించింది. దీంతో ఆయన రక్తంలో ఉన్న ప్లేట్‏లెట్స్ ఆకస్మాత్తుగా పడిపోవడంతో.. సెప్టెంబర్ 18న ఆయన హైదరాబాద్‏లో ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో చేరినట్లుగా సమాచారం. దీంతో ఆయనకు ప్రత్యేకంగా చికిత్స చేస్తున్నారట వైద్యులు. అయితే ఇప్పటివరకు ఈ యంగ్ హీరో ఆరోగ్య పరిస్థితిపై ఆయన కుటుంబసభ్యులు గానీ.. సన్నిహితులు కానీ స్పందించలేదు. త్వరలోనే ఆయన ఆరోగ్యంకు సంబంధించిన పూర్తి వివరాలను ఆయన కుటుంబసభ్యులు ప్రకటించనున్నట్లుగా సన్నిహితులు తెలిపారు. ఇక యంగ్ హీరో ఇలా అనారోగ్య సమస్యలతో ఆసుపత్రిలో చేరడంతో టాలీవుడ్ చిత్రపరిశ్రమ ఒక్కసారిగా షాకయ్యాంది. ఆయన తొందరగా కోలుకోవాలని అభిమానులు.. సన్నిహితులు కోరుకుంటున్నారు.

ఎప్పుడూ కంటెంట్ ప్రాధాన్యత ఉన్న సినిమాలు.. విభిన్నమైన ప్రయోగాత్మక చిత్రాలను ఎంచుకుంటూ.. చిత్రపరిశ్రమకు తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నాడు అడివి శేషు. ఇప్పటివరకు ఎన్నో సూపర్ హిట్ చిత్రాల్లో నచించిన ఈ యంగ్ హీరో ప్రస్తుతం.. మేజర్ సినిమా చేస్తున్నాడు. ఇందులో అడివి శేషు..టైటిల్ రోల్ పోషిస్తున్నాడు. 26/11 ముంబై టెర్రర్ అటాక్‏లో అమరవీరుడైన ఆర్మీ ఆఫీసర్ మేజర్ సందీప్ ఉన్నికృష్ణన్ జీవితం ఆధారంగా ఈ సినిమా తెరకెక్కుతుంది. ఈ మూవీకి శశికిరణ్ తిక్క దర్శకత్వం వహిస్తున్నాడు. ఇక మహేష్ బాబు జీఎంబీ ఎంటర్టైన్మెంట్.. ఏ ప్లస్ఎస్ మూవీస్ సహకారంతో సోనీ పిక్చర్స్ ఫిల్మ్స్ ఇండియా ఈ సినిమాను నిర్మిస్తుంది. ప్రస్తుతం ఈ మూవీ షూటింగ్ చివరి దశలో ఉంది. ఈ సినిమాతో పాటు.. టాలీవుడ్ సూపర్ హిట్ మూవీ హిట్ సిక్వెల్‏లోనూ అడివి శేషు నటిస్తున్నాడు. ప్రస్తుతం అడివి శేషు పూర్తిగా వైద్యుల పర్యవేక్షణలో ఉన్నారని.. ఆయన ఆరోగ్యం పూర్తిగా మెరుగుపడేవరకు ఆసుపత్రిలో ఉండనున్నట్లుగా సమాచారం.

Also Read: Chandramukhi 2 : చంద్రముఖి 2 ఆలస్యం కావడానికి అదే కారణమా.. రంగంలోకి దిగిన లారెన్స్..

Drishyam 2: వెంకీ అభిమానులకు షాకిచ్చిన చిత్రయూనిట్… దృశ్యం 2 ఫస్ట్‏లుక్ ఇప్పట్లో లేనట్లే..

Love Story PreRelease Event photos: లవ్ స్టోరీ ప్రీ రిలీజ్ ఈవెంట్ లో ఆకర్షణగా మారిన చిరు , సాయి పల్లవి డాన్స్.. (ఫొటోస్)